వారం వారం గోచారం

వారం వారం గోచారం (25-8-2019 నుంచి 31-8-2019 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. శ్రమతో కూడిన కార్యక్రమాలు. అధికారిక వ్యవహారాలపై దృష్టి. ప్రయాణావకాశాలు. సంతాన వ్యవహారాల్లో జాగ్రత్త. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. పోటీలు ఒత్తిడులుంటాయి. సౌఖ్యం కోసం తీవ్రంగా ప్రయత్నించాలి. శ్రమాధిక్యం. నిర్ణయాదుల్లో శ్రమ ఉంటుంది. ఆహార వ్యవహారాల్లో ఇబ్బందులు అధికం. తెలియని భయం ఉంటుంది. సంప్రదింపులు అధికం. కొత్త వార్తల వల్ల కొంత కన్‌ఫ్యూజ్‌కు అవకాశం. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదర వర్గంతో కొంత జాగ్రత్తగా మెలగాలి. కొన్ని అవమానాలకు అవకాశం. గౌరవ లోపం ఉండవచ్చు. అసంతృప్తి తగ్గించుకోవాలి. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. దానధర్మాల వల్ల మేలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల సంతోషం కలుగుతుంది. సుదూర లక్ష్యాలు దెబ్బతినే అవకాశం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. అధికారిక ప్రయాణాలు. విశ్రాంతి లోపం. నిర్ణయాదులు ఇబ్బంది పెడతాయి. పరామర్శలకు అవకాశం. తొందరపాటు నిర్ణయాలు కూడదు. కుటుంబంలో అనుకూలం. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిల్వలు సమకూర్చుకుంటారు. బంధువర్గంతో సంతృప్తి. ప్రయాణాలకు అవకాశం. ధన వినియోగంలో జాగ్రత్త అవసరం. సౌకర్యాల కోసం వెచ్చిస్తారు. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త. కొన్ని లాభాలున్నా అప్రమత్తంగా మెలగాలి. ఊహించని ప్రయోజనాలుంటాయి. అత్యాశ కూడదు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. సౌఖ్యంగా గడుపుతారు. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. విద్యారంగంలోని వారికి అనుకూలత. మాతృవర్గ వ్యవహారాల్లో సంతోషం. సంతాన వర్గంతో సమస్యలుంటాయి. క్రియేటివిటీ తగ్గే సూచనలు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఊహించని నష్టాలుంటాయి. అధికారికమైన లోపాలుంటాయి. వ్యవహారాల్లో ఇబ్బందులు. అనారోగ్య భావనలు. ఉద్యోగాదుల్లో అప్రమత్తంగా మెలగాలి. క్రమంగా సామాజిక గౌరవం పెంచుకునే సూచనలు. పితృవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. వ్యాపార వ్యవహారాలకు అనుకూలం. ప్రమోషన్‌లకు అనుకూలం. అధికారులతో కొంత జాగ్రత్తగా మెలగాలి. అనుకోని ప్రమాదాలుంటాయి. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. ఖర్చులు పెట్టుబడులు అధికం. దానధర్మాల వల్ల మేలు. భాగస్వామ్యాల్లో అప్రమత్తంగా మెలగాలి. పరిచయాలు, స్నేహానుబంధాల్లో సమస్యలకు అవకాశం ఉంది. కాలం ధనం శ్రమ వ్యర్థం కావచ్చు. దానధర్మాలు సంతోషాన్నిస్తాయి. ధార్మిక దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాలు. నిర్ణయాలు శ్రమకు గురి చేస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

అధికారిక సంప్రదింపులు, ప్రయాణాలుంటాయి. సోదర వర్గంతో ఇబ్బందులు. సౌకర్యాలు సమకూర్చుకునే ప్రయత్నం. పెద్దల సహకారం. ఆలోచనలకు రూపకల్పన. మంచి వార్తలు వింటారు. సంతాన వ్యవహారాల్లో సంతోషం. అభీష్టాలు నెరవేరుతాయి. భాగస్వామి సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ ఇబ్బంది పెట్టవచ్చు. అననుకూలమైన వార్తలుంటాయి. మీడియా రంగం వారికి సమస్యలు. కుటుంబ ఆర్థికాంశాల్లో అత్యాశలుంటాయి. బంధువర్గంతోనూ జాగ్రత్తగా మెలగాలి. మాటల్లో తొందరపాటు కూడదు. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. పెద్దలతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. లాభాలకు అనుకూలం. అనుకోని సమస్యలు. ఊహించని ఇబ్బందులు. అనారోగ్య భావనలకు అవకాశం. కాలం ధనం వ్యర్థం కావచ్చు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

అనేక రూపాల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల అనుకూలత. లాభాలు సంతోషాన్నిస్తాయి. కొంత శ్రమ తప్పకపోవచ్చు. కొన్ని పెట్టుబడుల వల్ల మాత్రమే ఉన్నతి కలుగుతుంది. నిర్ణయాలు లాభిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతోషంగా గడుపుతారు. కొత్త పనులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. లాభాలు కొన్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. పెద్దలతో కొంత జాగ్రత్తగా మెలగాలి. ఊహించని సమస్యలకు అవకాశం. వృత్తి ఉద్యోగాదుల్లో సమస్యలుంటాయి. అనేక కార్యక్రమాలలో పాల్గొనాల్సి వస్తుంది. శ్రమాధిక్యం. సంప్రదింపుల వల్ల మేలు కలుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ప్రయాణాల్లో ఒత్తిడులుంటాయి. సౌఖ్య లోపం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

పరిచయాలు స్నేహానుబంధాల్లో జాగ్రత్త వహించాలి. అధికారిక వ్యవహారాల్లో ఊహించని ఇబ్బందులు. భాగస్వామితో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం. కొత్త పరిచయాల్లో జాగ్రత్త అవసరం. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. కార్యనిర్వహణ దక్షత. సుదూర ప్రయాణాలు. విద్య, ఉద్యోగం, విజ్ఞానం మొదలైన రంగాలన్నింటిలోనూ అభీష్టాలు నెరవేరుతాయి. సామాజికమైన గుర్తింపు, గౌరవాలు పెరుగుతాయి. వ్యతిరేక ప్రభావాలు తప్పకపోవచ్చు. పోటీలలో గెలుపొందే ప్రయత్నం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు. అనేక కార్యక్రమాల నిర్వహణ. లాభాలు సంతోషాన్నిస్తాయి. కొన్ని ఖర్చులు తప్పకపోవచ్చు. విశ్రాంతి లోపం. పరామర్శలుంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. మాటల్లో అధికారిక ధోరణి ఉంటుంది. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. బంధువర్గంతో అసంతృప్తి. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలుంటాయి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. ప్రయాణాలకు అవకాశం. లాభాలపై దృష్టి ఉంటుంది. వ్యతిరేకతలను అధిగమించాలి. మాట తీరువల్ల సమస్యలు. నిల్వధనంపై ప్రత్యేక దృష్టి. నిర్ణయాదుల్లో అతి జాగ్రత్త. అత్యాశ ప్రభావితం చేస్తుంది. అతి విశ్వాసం సమస్యలకు దారితీసే అవకాశం. పోటీ రంగంలో గుర్తింపు. వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యసాధన. భాగస్వామితో జాగ్రత్త. పరిచయాల్లో ఇబ్బందులు. వ్యాపారాదుల్లో సమస్యలుంటాయి. సామాజికమైన ఒత్తిడులు తప్పకపోవచ్చు. మాటల్లో చమత్కారం.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. పదోన్నతులకు అవకాశం. సామాజిక గౌరవం పెరుగుతుంది. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. కార్యనిర్వహణ దక్షత. ఖర్చులు పెట్టుబడుల్లో అనుకూలత. ప్రయాణావకాశాలు. విశ్రాంతి లభిస్తుంది. విందులు వినోదాలు విహారాలకు అవకాశం. సామాజిక గౌరవం కొంత శ్రమకు గురి చేయవచ్చు. భాగస్వామ్యాల్లో అనుకూలత. శ్రమతో ఫలితాలుంటాయి. నూతన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. సుదూర ప్రయాణాల వైపు దృష్టి. అసంతృప్తి. వైజ్ఞానిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాట విలువ పెరుగుతుంది. బంధువర్గంతో సంతోషంగా గడుపుతారు. సేవక వర్గ సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ ఇబ్బంది పెడతాయి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీలు ఒత్తిడులు చికాకులు తప్పకపోవచ్చు. కార్యనిర్వహణ దక్షత. పోటీలు గెలుపు సంభవం. నిర్ణయాదుల్లో అనుకూలత. అనుకోని ఇబ్బందులు. అనారోగ్య లోపాలు. ఊహించని నష్టాలకు అవకాశం. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. కొత్త నిర్ణయాల వాయిదా అవసరం. సంప్రదింపుల్లో ఇబ్బందులుంటాయి. సామాజిక గౌరవం పెంచుకునే సూచనలు. శ్రమతో గుర్తింపు. గౌరవాదులు సంభవం. క్రియేటివిటీ పెంచుకుంటారు. సంతాన వర్గంతో జాగ్రత్తగా మెలగాలి. ఊహలు అధికం. కొత్త పనుల నిర్వహణ. ఆలోచనలకు రూపకల్పన. వృత్తి ఉద్యోగాదుల్లో గౌరవం ఉన్నా శ్రమ తప్పకపోవచ్చు. పితృవర్గంతో అనుకూలత. వ్యవహారాలు సంతోషాన్నీ సంతృప్తినీ ఇస్తాయి. లాభాలు సంతోషాన్నిస్తాయి. కుటుంబంలో సంతోషం.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

శారీరకమైన ఒత్తిడులు అధికం. కొంత అనారోగ్యానికి అవకాశం. అన్ని పనుల్లోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడికి అవకాశం. సంప్రదింపులకు అనుకూలం. సోదరీమణుల సహకారం లభిస్తుంది. నిర్ణయాదులు లాభిస్తాయి. మంచి వార్తలు వింటారు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. వృత్తిపరమైన వత్తిడులుంటాయి. సంతాన వ్యవహారాల్లో కొత్త సమస్యలు. తొందరపాటు నిర్ణయాలు కూడదు. శారీరకమైన చికాకులకు అవకాశం. వ్యర్థమైన ఖర్చులు పెట్టుబడులకు అవకాశం. కాలం ధనం పోగొట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పరామర్శలకు అవకాశం. విశ్రాంతి లోపం. మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానంతో సంతోషంగా గడుపుతారు. వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టే అవకాశం.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. వృత్తి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వత్తిడులు తప్పకపోవచ్చు. అన్ని పనుల్లోనూ లాభాలుంటాయి. పెద్దల అనుకూలత. గుర్తింపు లభిస్తుంది. గౌరవం పెంచుకుంటారు. ప్రయోజనాల వల్ల సంతోషం. కొత్త పనుల ప్రారంభం. నిర్ణయాదుల్లో ఒత్తిడులున్నా అనుకూలత. వ్యతిరేకతలపై విజయం. కొంత అసంతృప్తి ఉంటుంది. వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. నిర్ణయాదులు లాభిస్తాయి. గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో అనేక బాధ్యతలను నెరవేరుస్తారు. సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో ఒత్తిడులు. బంధువర్గంతో జాగ్రత్తగా మెలగాలి. మాట వల్ల ఇబ్బందులుంటాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆలోచనల్లో వత్తిడులుంటాయి. క్రియేటివిటీ తగ్గే సూచనలు. తొందరపాటు నిర్ణయాదులు కూడదు. వ్యతిరేకతలను అధిగమిస్తారు. సంతాన వర్గంతో జాగ్రత్తగా మెలగాలి. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ప్రేమలు పెంచుకుంటారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆలోచనలకు రూపకల్పన. ఉన్నత లక్ష్యాలను సాధించే మార్గాలలో శ్రమ ఉంటుంది. ఆందోళన లేకుండా చూసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. సృజనాత్మకత పెంచుకునే ప్రయత్నం. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఉన్నత వ్యవహారాలు. సుదూర ప్రయాణాలు. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక వ్యవహారాలు. విద్య, ఉద్యోగం, కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అప్రమత్తంగా మెలగాలి. అధికారులతో వత్తిడులు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. శ్రమ.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744