వారం వారం గోచారం

వారం వారం గోచారం (10.11.2019 నుంచి 16.11.2019 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదులకు అనుకూలత. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆలోచనలకు రూపకల్పన. బాధ్యతలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాల నిర్వహణలో తలమునక లవుతారు. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. పరిచయాలు స్నేహానుబంధాలు ఇబ్బంది పెట్టే అవకాశం అధికం. వారం మధ్యమంలో కుటుంబ, బంధువర్గ బాధ్యతలు విస్తరిస్తాయి. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని అనుకోని ఇబ్బందులున్నా అధిగమిస్తారు. విలాసాల కోసం ధనం కాలం వెచ్చిస్తారు. మాటల్లో కొంత చమత్కార ధోరణి ఉంటుంది. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. అనేక రూపాల్లో సమాచారం అందుతుంది. కొంత ఒత్తిడి కూడా ఏర్పడుతుంది. మీడియా రంగంలోని వారు కొంత జాగ్రత్త పడాలి. వ్యర్థమైన ప్రయాణాలుంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. వేరు వేరు కార్యకలాపాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలలు పెంచుకునే ప్రయత్నం. విద్య, ఉద్యోగం, పరిశోధన, దూర ప్రయాణాలు అన్నింటికీ అనుకూలం. అధికారిక సహకారం అందుతుంది. సోదర వర్గంతో జాగ్రత్తగా మెలగాలి. సంప్రదింపుల్లో సమస్యలుంటాయి. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. పదోన్నతులకు అవకాశం. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాలకు అనుకూలం. సామాజిక హోదా గౌరవాలు పెంచుకుంటారు. శ్రమ ఉన్నా సంతృప్తి ఉంటుంది. పితృవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. వారాంతంలో ప్రయోజనాలపై దృష్టి. లాభాలు ప్రభావితం చేస్తాయి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సంతాన వర్గ వ్యవహారాలు చర్చలోకి వస్తాయి. క్రియేటివిటీతో పనులు పూర్తి చేస్తాయి. ప్రణాళికాబద్ధమైన జీవన విధానం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాల్సి వస్తుంది. వారం మధ్యమంలో వ్యతిరేకతలు అధికం. పోటీలు ఒత్తిడులు అధికవౌతాయి. కార్యనిర్వహణలో శ్రమాధిక్యం. రుణ రోగాదులను అధిగమిస్తారు. ఖర్చులు పెట్టుబడులు అధికం. విందులు వినోదాలుంటాయి. విహార యాత్రలకు అవకాశం. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. విలాసాల కోసం పెట్టుబడులుంటాయి. వారాంతంలో భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. పరిచయాలు, స్నేహానుబంధాల్లో శ్రమ ఉంటుంది. నిర్ణయాలు ఇబ్బంది పెట్టవచ్చు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. విహారాలు విందులపై దృష్టి ఏర్పడుతుంది. వ్యతిరేక ప్రభావాలు తీవ్రవౌతాయి. పోటీలు ఒత్తిడులు చికాకులను అధిగమించాలి. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. ప్రయాణాలకు అవకాశం. పరామర్శలుంటాయి. ఆసుపత్రులను సందర్శించవచ్చు. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసంతో మెలగుతారు. అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. సంతోషంగా గడుపుతారు. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. దక్షతతో, ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. బాధ్యతలు అధికవౌతాయి. వారాంతంలో కుటుంబంలో ఒత్తిడులుంటాయి. మాట్లాడే ధోరణిలో కొంత జాగ్రత్త అవసరం. నిల్వధనం కోల్పోవచ్చు. బంధువర్గాదులతో కొంత జాగ్రత్తగా మెలగాల్సి వస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు కూడదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఊహించని సంఘటనలుంటాయి. చిన్న చిన్న ప్రమాదాలకు అవకాశం. మాటల్లో తొందరపాటు కూడదు. నిల్వధనం కోల్పోవచ్చు. కుటుంబంలో, బంధువర్గంతో సమస్యలుంటాయి. వారం మధ్యమంలో అత్యున్నత లక్ష్యాలపై దృష్టి. పరిశోధనలకు అనుకూలం. సుదూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక యాత్రలు, ధ్యాన మార్గాలపై ప్రత్యేక దృష్టి. సంప్రదింపులకు అనుకూలం. మంచి వార్తలు వింటారు. స్ర్తివర్గ సహకారం లభిస్తుంది. కీర్తిప్రతిష్ఠలు పెంచుకుంటారు. వారాంతంలో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అనేక కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించలేక సతమతం అవుతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాలకు అనుకూలం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. బాధ్యతలు అధికం. కార్యనిర్వహణ దక్షత. పదోన్నతులుంటాయి. విద్యారంగంలోని వారికి అనుకూలత. ప్రయాణాలు శ్రమకు గురి చేయవచ్చు. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ ఉంటుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. వేరువేరు రూపాల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతానంతో సంతోషంగా కాలం గడుపుతారు. నూతన కార్యక్రమాలపై దృష్టి. వారాంతంలో పోటీలు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యతిరేకతలు అధికం. శ్రమతో కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది. విజయ సాధన. వ్యర్థమైన ఖర్చులుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో అనేక రూపాల్లో ప్రయోజనాలు. లాభాలు వేరువేరు రూపాల్లో అందినా శ్రమ తప్పకపోవచ్చు. పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తారు. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. ప్రణాళికలు చెడిపోయే అవకాశం. సంతాన వర్గంతో జాగ్రత్త అత్యవసరం. నిర్ణయాదులు ఇబ్బంది పెట్టే సూచనలుంటాయి. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. వేరు వేరు కొనుగోళ్లకు అవకాశం. అలంకరణ వస్తువులపై దృష్టి ఉంటుంది. పరామర్శలకు అవకాశం. ప్రయాణాలుంటాయి. సంతోషంగా గడుపుతారు. దానధర్మాల వల్ల మరింత సంతోషం. సంతృప్తి. వారాంతంలో నిర్ణయాదుల్లో ఇబ్బందులుంటాయి. బాధ్యతలు పెరిగినా వేరు వేరు పనులు ముందుకు పోనివ్వవు. భాగస్వామ్యాల్లో చాలా జాగ్రత్తగా మెలగాలి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు అనుబంధాలు విస్తరించే అవకాశం. కార్యనిర్వహణ దక్షత. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. శారీరక ఒత్తిడులు తప్పకపోవచ్చు. కొద్దిపాటి అనారోగ్య భావన. తొందరపాటు కూడదు. బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహించాలి. పరీక్షా కాలం. మిత్రుల సమాచారం అందుతుంది. వారం మధ్యమంలో అనుకోని సమస్యలున్నా శ్రమతో అధిగమిస్తారు. కొన్ని ఊహించని సంఘటనలుంటాయి. శ్రమ రహిత ప్రయోజనాలపై ఆసక్తి పెరుగుతుంది. లాటరీ, రేసులు మొదలైన వాటి భావాల నుండి దూరంగా ఉండటం శ్రేయస్కరం. అనారోగ్య భావనలుంటాయి. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయాలి. వారాంతంలో సుదూర ప్రయాణాలపై దృష్టి. దూర ప్రాంతాల వారితో కమ్యూనికేషన్స్ పెరుగుతాయి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. సోదరవర్గంతో అనుకూలత. కమ్యూనికేషన్స్ లాభిస్తాయి. మంచి వార్తలు వింటారు. ఉన్నత లక్ష్యాలపై దృష్టి. అయినా కొంత అసంతృప్తి. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు కలుగుతుంది. దైవ ధ్యానం అవసరం. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. అధికారిక కార్యక్రమాలు లాభిస్తాయి. పదోన్నతులకు అవకాశం. అధికారుల వల్ల మేలు కలుగుతుంది. క్రీడా రంగంలోని వారికి గుర్తింపు పొందే సమయం. శ్రమ ఉన్నా సంతోషం. ఆహార విహారాలు సంతృప్తి నిస్తాయి. సౌకర్యాలపై దృష్టి. వారాంతంలో ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. వ్యర్థమైన ఆలోచనల వల్ల కాలం ధనం కోల్పోవచ్చు. ఆశించిన లాభాలు అందకపోవచ్చు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తండ్రి వర్గ సంబంధమైన పనులు చేయాల్సి ఉంటుంది. పదోన్నతులకు అవకాశం. అనేక బాధ్యతలు నిర్వర్తిస్తారు. నిర్వహణ బాధ్యతలు సంతోషాన్నిస్తాయి. శ్రమాధిక్యం. ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి. వారం మధ్యమంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతానంతో సంతోషంగా గడుపుతారు. సృజనాత్మకత పెరుగుతుంది. ప్రణాళికలు రచిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. పెద్దల ఆశీస్సులుంటాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు లభిస్తాయి. వారాంతంలో కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. విశ్రాంతి లోపం ఉంటుంది. పరామర్శలుంటాయి. ఆసుపత్రుల సందర్శన.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీలు ఒత్తిడులు చికాకులుంటాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. శ్రమాధిక్యం. రుణ రోగాదులు శ్రమకు గురి చేస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గే సూచనలు. మొండితనం తగ్గించుకోవాలి. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. తొందరపాటు ప్రయాణాలు కూడదు. ప్రమాదావకాశాలు. విశ్రాంతి లోపం. వ్యర్థమైన ఖర్చులు, పెట్టుబడులుంటాయి. వారం మధ్యమంలో పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో సంతోషంగా వ్యవహరిస్తారు. విందులు వినోదాలకు అధికమైన అవకాశం ఉంటుంది. శారీరక సౌఖ్యం లభిస్తుంది. వారాంతంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. బంధువర్గ వ్యవహారాలు లాభిస్తాయి. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకునే ఆలోచనలుంటాయి. కొన్ని అనుకోని సమస్యలకు అవకాశం. ఊహించని నష్టాలుంటాయి. వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో సానుకూలత ఉంటుంది. వారం మధ్యమంలో సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాల వల్ల లాభాలు. సుదూర లక్ష్యాలను సాధించే యత్నం. ఇతరుల సహకారం లభిస్తుంది. సంప్రదింపులకు అనుకూలం. మంచి వార్తలు వింటారు. విలాస విహార యాత్రలుంటాయి. సోదరీమణులతో సంతోషంగా గడిపే సమయం. వారాంతంలో ఆహార విహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. ఊహలు అధికం. కార్యనిర్వహణలో లోపాలుంటాయి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744