వారం వారం గోచారం

వారం వారం గోచారం (6-5-2018 నుంచి 12-5-2018 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(6-5-2018 నుంచి 12-5-2018 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆది సోమ మంగళ వారాల్లో వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. అధికారిక వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. సామాజికాంశాల్లో జాగ్రత్త వహించాలి. గౌరవం కోసం ప్రయత్నం. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాల్లో అనుకూలత. గృహ వాహనాది విషయాల్లో కొత్త నిర్ణయాలు. ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. బుధ గురువారాల్లో అన్ని పనుల్లో ప్రయోజనాభిలాష ఉంటుంది. పెద్దలతో కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. లాభాలు శ్రమతో సాధిస్తారు. ఆలోచనలకు అనుకూలం. క్రియేటివిటీ పెంచుకునే ప్రయత్నం. సంతానంతో సంతోషంగా గడుపుతారు. శుక్ర శనివారాల్లో ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలకు, విహారాలకు అవకాశం. వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారాదుల్లో ఒత్తిడులుంటాయి.్ప

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆది సోమ మంగళ వారాల్లో లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. ఆధ్యాత్మిక ప్రయత్నాదులకు అనుకూలం. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. సంప్రదింపుల్లో జాగ్రత్త వహించాలి. ఇతరులకు సహకారం అందించే ప్రయత్నం చేయాలి. సోదర వర్గంతో ఒత్తిడులు. బుధ గురువారాల్లో అధికారుల ఆదరణ. సామాజిక గౌరవం పెంచుకుంటారు. వృత్తి, ఉద్యోగాదుల్లో శ్రమతో ఉన్నతి. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహారాదులు సమయానికి అందకపోవచ్చు. సౌఖ్యలోపం. శ్రమాధిక్యం. శుక్ర శనివారాల్లో ప్రయోజనాలు కోల్పోయే అవకాశం. పెద్దలతో ఒత్తిడులుంటాయి. లాభాలు ఆశించినట్లుగా ఉండవు. సంతాన వర్గానికి సంబంధించిన కార్యక్రమాలుంటాయి. ఆలోచనలకు రూపకల్పన చేసే ప్రయత్నం.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆది సోమ మంగళ వారాల్లో శ్రమరహిత ప్రయోజనాలకై ప్రయత్నం. ఊహించని సంఘటనలుంటాయి. అప్రమత్తంగా మెలగాలి. నూతన నిర్ణయాదులు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబంలో ఒత్తిడులు. మాటల్లో తేడాలు రాకుండా చూసుకోవాలి. ఆర్థిక నిల్వలు కోల్పోయే అవకాశం. బుధ గురువారాల్లో అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు. గుర్తింపు, గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. విద్యాత్మక వ్యవహారాల్లో అనుకూలత. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. అధికారుల సహకారం శ్రమతో లభిస్తుంది. శుక్ర శనివారాల్లో అధికారిక వ్యవహారాల్లో ఘర్షణ. పెద్దలతో జాగ్రత్త. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం. వినోదాలుంటాయి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆది సోమ మంగళ వారాల్లో సామాజికానుబంధాల్లో ఒత్తిడులు. కొత్త పరిచయాల్లో జాగ్రత్త. వ్యాపార భాగస్వామ్యాల్లోనూ ఇబ్బందులకు అవకాశం. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మెలగాలి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. కొత్త పనులు, నిర్వహణపై దృష్టి. వ్యవహార దక్షత. బుధ గురువారాల్లో అన్ని పనుల్లో అప్రమత్తంగా మెలగాలి. నూతన నిర్ణయాదులను వాయిదా వేసుకోవడం మంచిది. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత అనుకూలత. మాట విలువ కొంత పెరుగుతుంది. ఆర్థిక నిల్వలు పెంచుకుంటారు. శుక్ర శనివారాల్లో దూర ప్రయాణాలు. ఆధ్యాత్మిక యాత్రలకు కూడా అవకాశం. లక్ష్యాల సాధన. కీర్తి ప్రతిష్ఠలపై దృష్టి. సంతృప్తిగా ఉంటుంది. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. వ్యాపార అనుబంధాల్లో సమస్యలు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆది సోమ మంగళ వారాల్లో వ్యతిరేకతలు బాగా పెరుగుతాయి. పోటీలు ఒత్తిడులను అధిగమించడం కష్టం. శత్రువుల వృద్ధి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ధర్మకార్యాలను పెంచుకోవాలి. ఖర్చులు పెట్టుబడుల్లో అనుకూలత. విందులు, వినోదాలు, విహారాలుంటాయి. కొన్ని ఒత్తిడులున్నా సంతోషంగా గడుపుతారు. బుధ గురువారాల్లో పరిచయాలు ఇబ్బంది పెట్టవచ్చు. జీవిత, భాగస్వామ్యా వ్యవహారాల్లో ఆలోచించి ముందడుగు వేయాలి. పరిచయాలు పెంచుకునే ప్రయత్నంలో ఇబ్బందులు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తమ గూర్చి తాము నిర్ణయాదులు తీసుకోవచ్చు. శుక్ర శనివారాల్లో ఊహించని సంఘటనలు. కార్యనిర్వహణలో శ్రమరహిత ప్రయోజనాలపై దృష్టి. ముఖ్య నిర్ణయాదులు వాయిదా వేసుకోవాలి. కుటుంబంలోనూ, ఆర్థికాంశాల్లోనూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మాట విలువ పెంచుకునే ప్రయత్నం చేస్తారు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆది సోమ మంగళ వారాల్లో మనోభీష్టాలు నెరవేర్చుకుంటారు. సంతానంతో సంతోషంగా గడుపుతారు. క్రియేటివిటీ పెరుగుతుంది. విద్యాత్మక వ్యవహారాలు, పరిశోధనలకు అనుకూలం. లాభాలు ఆశించినంతగా ఉండకపోవచ్చు. పెద్దలతోనూ జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. ప్రయోజనాలు కోల్పోయే అవకాశం. బుధ గురువారాల్లో పోటీలు ఒత్తిడులున్నా శ్రమతో అధిగమిస్తారు. గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేకతలపై విజయం. రుణాలు తీర్చుకుంటారు. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. నిద్రా సౌఖ్యం కోల్పోయే అవకాశం. శుక్ర శనివారాల్లో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరించే అవకాశం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. నూతన నిర్ణయాదులపై దృష్టి. అనేక కార్యక్రమాల నిర్వహణ. సంతృప్తి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆది సోమ మంగళ వారాల్లో సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాలకు అనుకూలం. సౌఖ్యంగా గడుపుతారు. గృహ వాహనాది వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. సంతోషంగా గడుపుతారు. విద్యాత్మక వ్యవహారాలుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో పైవాళ్లతో ఘర్షణలు. శ్రమతో గుర్తింపు, గౌరవం. బుధ గురువారాల్లో ఆలోచనలకు రూపకల్పన. నూతన ప్రణాళికలు. సంతానంతో హాయిగా గడపటం, వారి శ్రేయస్సు, ఆశించిన ప్రయోజనాలు అందక ఇబ్బంది పడటం, పెద్దలతో కొంత అభిప్రాయ భేదాలు, లాభాల విషయంలో రాజీ పడాలి. శుక్ర శనివారాల్లో పోటీ రంగంలో ఒత్తిడులు. రుణ బాధలు. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఖర్చులు పెట్టుబడులు అత్యధికం. విహార యాత్రలు. వ్యాపారాదుల్లో పెట్టుబడులు. అన్నింటిలోనూ వ్యతిరేకతలు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆది సోమ మంగళవారాల్లో సంప్రదింపుల్లో జాగ్రత్త. ఇతరుల సహకారం ఆశించినంతగా అందకపోవచ్చు. ప్రయాణాదుల్లో సమస్యలు. సోదర వర్గం అసంతృప్తి. సుదూర ప్రయాణాలపై ప్రణాళికలు. కీర్తి ప్రతిష్ఠలపై దృష్టి. దైవ సంబంధ కార్యక్రమాలపై దృష్టి. వ్యవహారాల్లో అనుకూలత. బుధ గురువారాల్లో సౌకర్యాదులు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల విషయంలో ముందు జాగ్రత్త అవసరం. విద్యలో వెనుకబడే సూచనలు. గృహ వాహనాదుల వల్ల సౌఖ్యలోపం. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు. అధికారుల ఆదరణ, సామాజిక గౌరవం. శుక్ర శనివారాల్లో మనోభీష్టాలు నెరవేరుతాయి. ప్లానింగ్‌కు అనుకూలం. సంతాన సంబంధమైన శ్రేయస్సు. క్రియేటివిటీ పెరుగుతుంది. లాభాల విషయంలో రాజీ ధోరణి అవసరం. కొన్ని ప్రయోజనాలు కోల్పోవచ్చు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆది సోమ మంగళ వారాల్లో కుటుంబంలో ఒత్తిడులు. ఆర్థిక నిల్వలు కోల్పోయే అవకాశం. మాట వల్ల సమస్యలను ఎదుర్కోవచ్చు. సంపాదనపై ప్రత్యేక దృష్టి. అనుకోని ఇబ్బందులు, ఊహించని సంఘటనలు, శ్రమ రహిత ఫలితాలు, లాభాలపై దృష్టి, ఇన్సూరెన్స్ వ్యవహారాలుంటాయి. బుధ గురువారాల్లో సంప్రదింపుల్లో జాగ్రత్త. సోదర వర్గ సహకారం ఆశించినంత లభించకపోవచ్చు. సేవకవర్గం కొంత అనుకూలత. నూతన కార్యక్రమాల నిర్వహణ. లక్ష్యాలను సాధించే అవకాశం. దూర ప్రయాణాలు. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. శుక్ర శనివారాల్లో ఆహార విహారాలపై దృష్టి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. గృహ వాహనాదులు సంతోషాన్నిస్తాయి. కార్యనిర్వహణలో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆది సోమ మంగళవారాల్లో నూతన నిర్ణయాలు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కొత్త పనులపై దృష్టి. సంతోషంగా గడుపుతారు. శ్రమ ఉన్నా సంతృప్తి. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త. పరిచయాలు, అనుబంధాలు కొంత ఇబ్బందులకు గురి చేయవచ్చు. విస్తరించే ప్రయత్నం. బుధ గురువారాల్లో కుటుంబంలో అనుకూలత. ధన వ్యవహారాలపై దృష్టి. మాటల్లో శుభ పరిణామాలు. వాక్చాతుర్యంతో వ్యవహరిస్తారు. అనుకోని సమస్యలు ఎదురు అవుతాయి. అన్ని ముఖ్యమైన నిర్ణయాదులను వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. శుక్ర శనివారాల్లో సంప్రదింపులలో ఒత్తిడులు. పెద్దల సహకారం కోసం ప్రయత్నం. సోదర వర్గంతో కొంత ఘర్షణ. సుదూర ప్రయాణాలపై దృష్టి. గుర్తింపు లభిస్తుంది.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆది సోమ మంగళ వారాల్లో ఖర్చులు పెట్టుబడులు సంతోషాన్నిస్తాయి. విందులు వినోదాలు విహార యాత్రలపై దృష్టి. ఆసుపత్రుల్లో పరామర్శలకు అవకాశం. వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టవచ్చు. పోటీ రంగంలో గెలుపు లభించకపోవచ్చు. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కొన్ని చికాకులు. బుధ గురువారాల్లో ముఖ్యమైన నిర్ణయాదులకు అవకాశం. సంతోషంతో వ్యవహరిస్తారు. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. భాగస్వామ్యాల్లో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. అధికారులతో కొంత జాగ్రత్త అవసరం. పరిచయాలలో ఇబ్బందులు. శుక్ర శనివారాల్లో కుటుంబంలో ఒత్తిడులకు అవకాశం. లక్ష్యాల సాధన. ఆర్థిక నిల్వలు తగ్గిపోయే సూచనలు. మాట వల్ల ఇబ్బందులు. సవరించుకోవాల్సి వస్తుంది. అనుకోని సమస్యలున్నా అధిగమిస్తారు. ఊహించని సంఘటనలు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆది సోమ మంగళవారాల్లో లాభాలపై దృష్టి ఉన్నా ఆశించిన ప్రయోజనాలు అందవు. కొంత చికాకుగా ఉంటుంది. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. కొంత అనుకూలత ఉంటుంది. సంతానంతో సంతృప్తి. కొత్త ప్రణాళికలపై దృష్టి. అభీష్టాలు నెరవేర్చుకునే ప్రయత్నం. ఉన్నత విద్యా వ్యవహారాలు, బుధ గురువారాల్లో పెట్టుబడి రంగంలో జాగ్రత్త. విందు వినోదాల కోసం కాలం ధనం వ్యర్థం కావచ్చు. ప్రయాణాల్లో ఒత్తిడులు. పోటీ రంగంలో విజయం. వ్యతిరేకతలను అధిగమిస్తారు. విజయంపై దృష్టి. గుర్తింపు లభిస్తుంది. శుక్ర శనివారాల్లో నిర్ణయాదుల్లో అనుకూలత. కొత్త పనుల నిర్వహణపై దృష్టి. సంతోషంగా, సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. వ్యాపార భాగస్వామ్యాల్లో కొంత చికాకు. పరిచయాలు నూతనంగా ఏర్పడే అవకాశం. కార్యనిర్వహణలో అనుకూలత.

--డాక్టర్ సాగి కమలాకరశర్మ