వారం వారం గోచారం

వారం వారం గోచారం (2.2.2020 నుంచి 8.2.2020 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. బాధ్యతలు అధికం. అన్ని పనులు పూర్తి చేసుకునే ప్రయత్నం. కొత్త పనులపై దృష్టి ఉంటుంది. ప్రయోజనాలు సంతోషాన్నిస్తాయి. స్ర్తివర్గ సహకారం లభిస్తుంది. పెద్దల అనుకూలత. వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు, గౌరవం పెంచుకుంటారు. సామాజిక హోదా పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం ఉన్నా శ్రమ తప్పదు. వారం మధ్యమంలో కుటుంబంలో అనుబంధాలు మెరుగుపడతాయి. బ్యాంకు వ్యవహారాలు పూర్తి చేసుకునే సమయం. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. కొన్ని అనుకోని సమస్యలు, నష్టాలు వస్తాయి. జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. ఊహించని ప్రయోజనాలకు కూడా అవకాశం. వారాంతంలో కమ్యూనికేషన్స్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులుంటాయి. కాలం ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. విందులు, విహారాలు, వినోదాలుంటాయి. ఉన్నత లక్ష్యాలను సాధించే దిశలో ప్రయత్నాలుంటాయి. కీర్తి ప్రతిష్టల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. బాధ్యతల నిర్వహణలో సంతోషం, సంతృప్తి. అనేక కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుంది. సంప్రదింపులకు అనుకూలం. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. పరిచయాలు, స్నేహబంధాలలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం. వారాంతంలో కుటుంబ వాతావరణంపై దృష్టి కేంద్రీకరిస్తారు. నిల్వధనం కోల్పోకుండా చూసుకోవాలి. మాటల్లో అస్పష్టత. తొందరపడి వాగ్దానాలు కూడదు. గౌరవ లోపాలకు అవకాశం.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ లాభాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు పెంచుకుంటారు. దూర ప్రయాణ భావనలు, స్ర్తి వర్గ సహకారం లభిస్తుంది. ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగాదుల్లో అనుకోని సమస్యలు. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. వారం మధ్యమంలో ఖర్చులు, పెట్టుబడులుంటాయి. సంతోషంగా గడుపుతారు. విశ్రాంతి లభిస్తుంది. విందులు, వినోదాలుంటాయి. ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ప్రయాణాలకు అవకాశం ఉంది. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. పోటీలు, వ్యతిరేకతలు తగ్గించడానికి దాన ధర్మాలు అవసరం. వారాంతంలో నిర్ణయాదులు ప్రాధాన్యం వహిస్తాయి. ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు కూడదు.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత, అధికారిక కార్యక్రమాలను నిర్వహించే సమయంలో కొంత జాగ్రత్త. కొన్ని అనుకోని సమస్యలుంటాయి. శ్రమాధిక్యం, అందరినీ తొందరగా విశ్వసించరాదు. భాగస్వామ్యాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. అధికారిక పరిచయాలున్నా అప్రమత్తంగా మెలగాలి. వారం మధ్యమంలో కార్యనిర్వహణలో ప్రయోజనాలు చేకూరుతాయి. లాభాలు సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తాయి. నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆలోచనల్లో కొంత ఒత్తిడికి అవకాశం. ధ్యానం వల్ల చాలా అనుకూలత ఏర్పడుతుంది. ప్రశాంతత అవసరం. క్రియేటివిటీ పెరుగుతుంది. నిర్ణయాదుల్లో ఆచితూచి వ్యవహరించాలి. వారాంతంలో ఖర్చులు, పెట్టుబడులు స్థాయి దాటే అవకాశం. విశ్రాంతి లోపించవచ్చు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఈ వారం ప్రారంభంలో కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. పోటీ రంగంలో గుర్తింపు, గెలుపు ఉన్నప్పటికీ శ్రమ తప్పదు. మొండితనం పెరగవద్దు. వార మధ్యమంలో వృత్తిలో అనుకూలత, ఉద్యోగాదులు సంతోషాన్నిస్తాయి. ఖర్చులు, పెట్టుబడుల వల్ల సామాజిక హోదా పెంచుకుంటారు. విశ్రాంతి లభిస్తుంది. పితృవర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి, అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. వాహనాది సౌకర్యాల్లో లోపాలుంటాయి. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. వారాంతంలో ప్రయోజనాలపై దృష్టి, ఊహించని, శ్రమ లేని లాభాలను కోరుకునే అవకాశం. పెద్దలతో అప్రమత్తంగా మెలగాలి. ఆలోచనలకు రూపకల్పన, క్రియేటివిటీ పెంచుకుంటారు. స్పెక్యులేషన్స్ లాభిస్తాయి. ఖర్చులున్నా సంతోషం.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు, అనారోగ్య భావాలు, అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. కొత్త నిర్ణయాలు వాయిదా వేసుకోవాలి. వ్యతిరేక ప్రభావాలుంటాయి. స్ర్తిలతో సమస్యలు, కాంట్రాక్టు వ్యవహారాల్లో ఇబ్బందులు, ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సంతానంతో సమస్యలు, అన్ని పనుల్లోనూ చికాకులు, వారం మధ్యమంలో ఉన్నత వ్యవహారాలపై దృష్టి, లక్ష్యాలను సాధించే ప్రయత్నం. సుదూర ప్రయాణాలు, కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. వైజ్ఞానిక, థార్మిక వ్యవహారాలపై దృష్టి, లాభాలు సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తాయి. సోదర వర్గంతో సంప్రదింపులకు అవకాశం. సహకార లోపాలుంటాయి. వారాంతంలో వృత్తి, ఉద్యోగాదుల్లో శ్రమ అధికం. అనేక బాధ్యతలు ఒకేసారి నిర్వహించాల్సి వస్తుంది.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు అనుబంధాలపై ప్రత్యేక దృష్టి. పాతమిత్రుల కలయిక. ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. క్రియేటివిటీ పెరుగుతుంది. సంతానవర్గ సంతృప్తి. నిర్ణయాదుల్లో వేగం ఉంటుంది. సౌకర్యాలు శ్రమకు గురిచేస్తాయి. ఆహార విహారాల్లో ఒత్తిడులుంటాయి. గృహ వాహనాది నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు, ఊహించని సంఘటనలు. అప్రమత్తంగా మెలగాలి. కొత్త నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. వృత్తి ఉద్యోగాదుల్లో ఇబ్బందులుంటాయి. అధికారులతో జాగ్రత్త. గౌరవం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ ఆర్థికాంశాల్లో ఒత్తిడులు. మాటల్లో తొందరపాటు ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ప్రభావాలు అధికం. అన్ని పనుల్లోనూ పోటీలు, ఒత్తిడులుంటాయి. విజయంపై దృష్టి ఉన్నా శ్రమ తప్పకపోవచ్చు. గుర్తింపు లభిస్తుంది. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాల్లోనూ కొంత జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో సంప్రదింపులకు అవకాశం. పితృవర్గ సహకారం లభిస్తుంది. అధికారిక ప్రయాణాలకు అవకాశం. వారం మధ్యమంలో పరిచయాలు, స్నేహాలు విస్తరిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. కీర్తి ప్రతిష్టలపై ప్రత్యేక దృష్టి. ఆథ్యాత్మిక కార్యక్రమాలకు కూడా అనుకూలం. నిర్ణయాదుల విషయంలో కొంత జాగ్రత్త. తొందరపాటు కూడదు. వారాంతంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావాలు పెరుగుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాలుంటాయి. సంతానవర్గ సంతోషం. క్రియేటివిటీతో పనిచేస్తారు. స్ర్తి వర్గంతో సంప్రదింపులు. కాంట్రాక్టు వ్యవహారాలు, వ్యాపారాల్లో రాణిస్తారు. దగ్గరి ప్రయాణాలు, సహకారం లభిస్తుంది. కుటుంబ, ఆర్థికాంశాల్లో కొంత ఒత్తిడి. మాటల్లో అధికారిక ధోరణి కూడదు. బంధువర్గంతో జాగ్రత్త. వారం మధ్యమంలో వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీలు, ఒత్తిడులు చికాకులుంటాయి. విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించాల్సి వస్తుంది. ఋణరోగాదులు ఆలోచింపజేస్తాయి. కొంత ధనం, కాలం వ్యర్థం కావచ్చు. పెట్టుబడుల్లో జాగ్రత్త. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. వారాంతంలో భాగస్వామ్యాలపై దృష్టి, పరిచయాలు కాలహరణ చేస్తాయి. భాగస్వామితో జాగ్రత్తగా మెలగాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలకు అనుకూలం. సౌకర్యాలు పెంచుకుంటారు. శ్రమతో కార్యక్రమాలను నిర్వహించే అవకాశం. కుటుంబంలో సంతృప్తి, ఆర్థిక నిర్ణయాల్లో అనుకూలత. మాటల్లో చమత్కారం. విందులు, వినోదాలకై కాలం, ధనం వెచ్చించే అవకాశం. ఆత్మవిశ్వాసం అధికమై ఇబ్బంది పడే అవకాశం. నిర్ణయాదులు శ్రమకు గురి చేస్తాయి. తొందరపాటు కూడదు. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. సంతాన వర్గ వ్యవహారాలపై దృష్టి, భాగస్వామ్యాల్లోనూ అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. క్రియేటివిటీ పెరుగుతుంది. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దలతో కొంత జాగ్రత్త. వారాంతంలో అన్ని పనుల్లోనూ పోటీలు పెరుగుతాయి. ఋణాదులు ఆలోచింపజేస్తాయి. చికాకులు అధికం.
కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఈ వారం ఫ్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. ఇతరుల సహకారం లభిస్తుంది. నిర్ణయాదుల్లో సంతోషం, సంతృప్తి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారిక వ్యవహారాల కోసం కొంత కాలం, ధనం వెచ్చించాలి. ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో వ్యతిరేకతలపై విజయం. సౌకర్యాలు పెంచుకుంటారు. శ్రమ ఉన్నా ఆహార విహారాలపై దృష్టి ఉంటుంది. పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాదుల్లో అధికమైన శ్రమ. అనేక బాధ్యతలను నిర్వర్తించాల్సి రావచ్చు. హోదా తగ్గకుండా చూసుకోవాలి. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. నిర్ణయాదులు ఇబ్బంది పెట్టే అవకాశం. సంతానవర్గంతో అప్రమత్తంగా మెలగాలి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తారు. బ్యాంకు వ్యవహారాలు పూర్తవుతాయి. నిల్వధనంపై దృష్టి. బంధువర్గం కోసం సమయం వెచ్చిస్తారు. విందులు, వినోదాలు, విహారాలు, ప్రయాణాలకు అవకాశం. సంతోషంగా గడుపుతారు. మాట విలువ పెరగుతుంది. చమత్కారంగా గడుపుతారు. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల అనుకూలత. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. వారం మధ్యమంలో సంప్రదింపులుంటాయి. అలోచనలకు రూపకల్పన. సంతానంతో ప్రయాణాలకు అవకాశం. ఇతరుల సహకారం లభిస్తుంది. ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికలుంటాయి. కొంత అసంతృప్తి తప్పకపోవచ్చు. వారాంతంలో ఆహార విహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త.

-డాక్టర్ సాగి కమలాకర శర్మ