వారం వారం గోచారం
వారం వారం గోచారం (9.2.2020 నుంచి 15.2.2020 వరకు)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలు, సౌకర్యాలు, ప్రయాణాలపై దృష్టి. సౌఖ్యంగా గడుపుతారు. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులుంటాయి. వ్యాపారాల్లో ప్రయోజనాలు. క్రమంగా ఆలోచనలకు రూపకల్పన., ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశం. సంతానంతో కలిసి విందులు, విహారాలుంటాయి. అభీష్టాలు నెరవేరుతాయి. విశ్రాంతి లభిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. వారం మధ్యమంలో వ్యతిరేకతలుంటాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. కార్యనిర్వహణపై దృష్టి, కార్యక్రమాల ఒత్తిడులు అధికమవుతాయి. వృత్తిపరమైన అనుకూలత, అనేక బాధ్యతలుంటాయి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఉన్నత కార్యక్రమాల్లో లోపాలు, వారాంతంలో భాగస్వామ్యాల్లో శుభపరిణామాలు.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులుంటాయి. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. వృత్తిపరమైన ఒత్తిడులున్నా గౌరవం పెంచుకుంటారు. సామాజిక బాధ్యతలుంటాయి. క్రమంగా ఆహార విహారాలపై దృష్టి, సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. కొన్ని అనుకోని ఇబ్బందులుంటాయి. సౌఖ్యలోపం, లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల అనుకూలత, ప్రయోజనాలుంటాయి. విద్యా రంగంలోని వారికి గుర్తింపు. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెంచుకుంటారు. సంతానవర్గంపై ప్రత్యేక దృష్టి. సుదూర లక్ష్యాల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. సోదరవర్గంపై దృష్టి. చిన్న చిన్న ప్రమాదాలకు అవకాశం. జాగ్రత్త. వారాంతంలో పోటీలు, ఒత్తిడులను అధిగమించాల్సి ఉంటుంది. శ్రమాధిక్యం. గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో ఒత్తిడులు.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. సుదూర లక్ష్యాలను సాధించే ప్రయత్నం. క్రమంగా సంప్రదింపులకు అనుకూలం. సహకారం లభిస్తుంది. సోదర వర్గంతో జాగ్రత్తగా మెలగాలి. అనుకోని సమస్యలు వృత్తిపరమైన అనుకూలత. సామాజిక గౌరవం పెరుగుతుంది. వారం మధ్యమంలో సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. కొన్ని అనుకోని సమస్యలు. ఆరోగ్య లోపాలు, అధికార గణంతో జాగ్రత్త. పితృవర్గ ఒత్తిడులు, మాటవిలువ పెరుగుతుంది. భాగస్వామ్యాల్లో జాగ్రత్త. పరిచయాల వల్ల కాలం, ధనం వ్యర్థం. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికలుంటాయి. నిర్ణయాదుల్లో కొంత జాగ్రత్త. తొందరపాటు కూడదు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు.
కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఈ వారం ప్రారంభంలో నిర్ణయాదుల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారాదుల్లో ఇబ్బందులకు అవకాశం. అనుకోని సమస్యలు ఎదురయ్యే సూచనలు. ఆత్మవిశ్వాస లోపాలు. క్రమంగా కుటుంబంలో అనుకూలత, మాట విలువ పెరుగుతుంది. నిల్వధనంపై ప్రత్యేక దృష్టి, వ్యతిరేకతలుంటాయి. పోటీలలో జాగ్రత్తగా మెలగాలి. ఋణ రోగాదుల వల్ల ఒత్తిడులు, ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. సుదూర ప్రయాణ భావనలు. వారం మధ్యమంలో సంప్రదింపులుంటాయి. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. అధికారులతో కొంత జాగ్రత్త. భాగస్వామ్యాల్లో ఒత్తిడులు, నిర్ణయాలు లాభిస్తాయి. పోటీ రంగంలో గుర్తింపు. శ్రమాధిక్యం. వారాంతంలో సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాల కోసం ధనం, కాలం వెచ్చిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఈ వారం ప్రారంభంలో ఖర్చులు, పెట్టుబడులు అధికం. విశ్రాంతి లభిస్తుంది. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వ్యాపారానుబంధాలు మెరుగుపడతాయి. ప్రయాణాలకు అవకాశం. క్రమంగా ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆలోచనల్లో కొంత ఒత్తిడి. ఏదో కోల్పోతున్న భావం. సంతానంతో చికాకులు. కాంట్రాక్టు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అనుకోని సంఘటనలు. వారం మధ్యమంలో కుటుంబ, బంధువర్గ వ్యవహారాలపై దృష్టి, నిల్వధనం పెంచుకుంటారు. మాట విలువ పెరుగుతుంది. వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు, గౌరవాదులుంటాయి. కుటుంబం కోసం ధనం వెచ్చించాల్సి వస్తుంది. నిర్ణయాల్లో తొందరపాటు కూడదు. వారాంతంలో సంప్రదింపులుంటాయి. సహకారం కోసం ప్రయత్నిస్తారు.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఈ వారం ప్రారంభంలో లాభాలు సంతోషాన్నిస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. వ్యాపారాదుల్లో అనుకూలత. వ్యతిరేకులపై విజయం. నిర్ణయాదుల్లో ఒత్తిడి. క్రమంగా ఖర్చులు, పెట్టుబడులు అధికం. అధికారిక వ్యవహారాల కోసం కాలం, ధనం వెచ్చిస్తారు. సంతాన వర్గంతో ఒత్తిడులు. ఆలోచనల్లో శ్రమ. సృజనాత్మక లోపాలు. ప్రయాణాదుల్లో సౌకర్య లోపాలు. భాగస్వామ్యాల్లో అనుకూలత. కాంట్రాక్టు వ్యవహారాల్లో లాభాలు. వారం మధ్యమంలో నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్పెక్యులేషన్స్‌లో ఇబ్బందులు, లాభాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాల్లో ఒత్తిడులను అధిగమించాల్సి ఉంటుంది. శ్రమాధిక్యం. వారాంతంలో కుటుంబంలో అనుకూలత. బ్యాంకు పనులపై దృష్టి, నిల్వధనం పెంచుకుంటారు
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఈ వారం ప్రారంభంలో వృత్తి, ఉద్యోగాదుల్లో ఒత్తిడులంటాయి. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెరుగుతుంది. వ్యాపారాల్లో శుభ పరిణామాలు. క్రమంగా లాభాలు సంతోషాన్నిస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. స్ర్తి వర్గంతో పోటీలు కూడదు. కాంట్రాక్టు వ్యవహారాల్లో శ్రమ ఉంటుంది. సహకార లోపాలుండవచ్చు. వారం మధ్యమంలో ఖర్చులు, పెట్టుబడులు అధికమవుతాయి. వ్యాపారాదుల కోసం వెచ్చిస్తారు. ప్రయాణాదులలో ఖర్చులు, వృత్తిలో అనుకూలత. అధికారిక కార్యక్రమాల కోసం కాలం, ధనం కేటాయించాలి. వార్తల వల్ల సమస్యలు . వారాంతంలో ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. సుదూర ప్రయాణ భావనలు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం ప్రారంభంలో సమున్నత కార్యక్రమాలపై దృష్టి. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. విద్యారంగం వారికి అనుకూలత. ప్రయాణావకాశాలు. క్రమంగా వృత్తి, ఉద్యోగాదులపై దృష్టి. అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. కుటుంబ ఆర్థికాంశాలు కొంత శ్రమకు గురి చేస్తాయి. మాటల్లో నైరాశ్యం కూడదు. ఆలోచనలకు రూపకల్పన. క్రియేటివిటీ పెంచుకోవడం వల్ల సామాజిక గౌరవం పెరుగుతుంది. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ అనుకూలత. ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్ని ఇస్తాయి. అధికారిక సంప్రదింపులుంటాయి. ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం. మాటల్లో తొందరపాటు కూడదు. వారాంతంలో ఖర్చులు, పెట్టుబడులు అధికం. వ్యర్థంగా కాలం, ధనం కోల్పోయే అవకాశం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు, కొత్త పనులకు దూరంగా మెలగాలి. ముఖ్యంగా వ్యాపారాదులకు దూరం. కమ్యూనికేషన్స్‌తో సమస్యలు. సహకార లోపాలు. క్రమంగా ఉన్నత లక్ష్యాలపై దృష్టి. కార్య నిర్వహణ దక్షత, కీర్తి ప్రతిష్టలు. నిర్ణయాదుల్లో జాగ్రత్త. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలత. విందులు, వినోదాలకు అవకాశం. వారం మధ్యమంలో వృత్తి, ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక, వృత్తి, వ్యాపారాదులు సంతోషాన్నిస్తాయి. సంప్రదింపులకు అనుకూలం. నిర్ణయాదుల్లో ఒత్తిడులుంటాయి. భాగస్వామ్యాల్లో జాగ్రత్తగా మెలగాలి. పరిచయాలు, స్నేహానుబంధాల వల్ల కొన్ని లాభాలున్నా చికాకులు కూడా తప్పవు. ఆత్మవిశ్వాసంతో మెలగుతారు. సామాజిక గౌరవం పెరుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో శుభపరిణామాలు. కుటుంబ, ఆర్థికాంశాలు సంతోషాన్నిస్తాయి. మాటల్లో అనుకూలత. చమత్కారంగా ప్రవర్తిస్తారు. వ్యాపారాల్లో అనుకూలత. క్రమంగా అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాలి. వ్యర్థంగా కోల్పోయే అవకాశం. ఆథ్యాత్మిక ప్రయాణాల వల్ల అనుకూలత. సంప్రదింపులకు అనుకూలం. వార్తల వల్ల ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి. వారం మధ్యమంలో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. సుదూర ప్రయాణాలకు అవకాశం. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. నిర్ణయాదుల్లో కొంత ఒత్తిడి. ఆరోగ్యం కొంత జాగ్రత్త. భాగస్వామ్యాల్లో శుభపరిణామాలు. వ్యర్థంగా కాలం, ధనం కోల్పోతారు. వారాంతంలో వృత్తి, ఉద్యోగ, సామాజిక వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. కార్యనిర్వహణలో శ్రమ తప్పదు. గుర్తింపు,
కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ప్రభావాలపై విజయం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. వ్యాపారాదుల్లో అనుకూలత, గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యాలు. క్రమంగా భాగస్వామ్యాల్లో శుభపరిణామాలు. పరిచయాలు, స్నేహానుబంధాలు పెరుగుతాయి. లాభాలున్నా ఆశించిన సంతృప్తి ఉండకపోవచ్చు. కుటుంబ, ఆర్థికాంశాల్లో అనుకూలత. మాటల్లో చమత్కారం. భాగస్వామితో సంతృప్తి. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావాలు. వ్యాపారాదుల్లో జాగ్రత్త. అధికారిక కార్యక్రమాల కోసం కాలం, ధనం వెచ్చించాలి. పోటీ రంగంలో ఒత్తిడులుంటాయి. లాభాలు సంతోషాన్నిచ్చినా అప్రమత్తంగా మెలగాలి. వారాంతంలో ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నాలు. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి.
మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన, క్రియేటివిటీ పెంచుకుంటారు. వ్యాపారాదుల కోసం కాలం, ధనం వెచ్చిస్తారు. ప్రయాణావకాశాలు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. క్రమంగా వ్యతిరేకతలున్నా విజయం. పోటీరంగంలో గుర్తింపు. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత జాగ్రత్త. శ్రమాధిక్యం. నిర్ణయాదుల్లో సంతోషం. కొత్త పనులపై దృష్టి, బాధ్యతలు విస్తరిస్తాయి. అధికారిక ప్రయోజనాలకు అవకాశం. మనోభీష్టాలు నెరవేరుతాయి. అధికారిక వ్యవహారాల్లో జాగ్రత్త. స్నేహానుబంధాలు, వ్యాపారానుబంధాల్లో అనుకూలత. వారాంతంలో అనుకోని సమస్యలు. ఊహించని సంఘటనలు, అనారోగ్య భావనలు. ప్రయాణాది సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త. వృత్తి ఉద్యోగాదుల్లో ఇబ్బందులను అధిగమించాల్సి ఉంటుంది.