జాతీయ వార్తలు

వారణాసిలో భద్రత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, డిసెంబర్ 12: ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే వారణాసి రాక సందర్భంగా కనీవినీ ఎరగని భద్రత కల్పించారు. నగర శివార్లలోని బాబత్‌పూర్ విమానాశ్రయం వద్ద ఇరువురు దేశాధినేతలకు ఘనస్వాగతం లభించింది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాంనాయక్, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కేంద్ర మంత్రులు మనోజ్ శర్మ, కల్‌రాజ్ మిశ్రా ఇరువురు ప్రధానులకు ఘనస్వాగతం పలికారు. మోదీ, షింజో దశశ్వమేధ్ ఘాట్‌కు వెళ్లి గంగానది హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘాట్‌ల వద్ద, దారిపొడవునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 7 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పిజి) పోలీసులు మంగళవారంనాడే నగరానికి చేరుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డు (ఎన్‌ఎస్‌జి), యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, కేంద్ర పారామిలటరీ దళాలు, రాష్ట్ర పోలీసులను మోహరించారు. బాబత్‌పూర్ విమానాశ్రయం నుంచి దశశ్వమేధ్ ఘాట్‌కు వచ్చే 22 కిలోమీటర్ల మార్గంలో బ్యానర్లు, ఫ్లెక్సీలు, తోరణాలతో అలంకరించారు. జపాన్ భాషలోనూ బ్యానర్లు వెలిశాయి. శుక్రవారం రాత్రి నుంచే ట్రాఫిక్ క్రమబద్ధం చేశారు. (చిత్రం) శనివారం వారణాసి చేరుకున్న భారత, జపాన్ ప్రధానులకు వివిధ రకాల వాద్యాలతో స్వాగతం పలుకుతున్న కళాకారులు.