రాష్ట్రీయం

మళ్లీ ముంచెత్తిన వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలలో కుంభవృష్టి.. భక్తుల అవస్థలు
ఒంగోలు/తిరుపతి/నెల్లూరు, నవంబర్ 30: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. తిరుమలలో, నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్‌లో కుంభవృష్టికురవగా ఇతర ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా రాళ్ళపాడు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో ఐదుగేట్లు ఎత్తివేసి 9500 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా సరాసరిన 10.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో నెలసరి వర్షపాతం 143.7మిల్లీమీటర్లుగా కాగా 196.6మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీరం వెంబడి చలిగాలులు వీస్తుండడంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఒక మోస్తరుగా ప్రారంభమైన వాన సోమవారం ఉద్ధృతమై భారీగా కురిసింది. ఈదురుగాలులు వీచడంతో చలితీవ్రత పెరిగి, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా తిరుమల్లోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో భక్తులు రోడ్డు దాటేందుకు వాహన రాకపోకలు సాగేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపలికి చేరే భక్తులు వర్షంలో తడుస్తూనే గదులకు చేరుకుంటున్నారు. నిర్విరామంగా వర్షం కురుస్తుండటంతో వాణిజ్య సముదాయాల వెలుపల ఉన్న దుకాణాలన్నీ మూతపడ్డాయి. రెండో కనుమ మార్గంలో వర్షం కారణంగా మరోసారి బండరాళ్ళు జారిపడ్డవచ్చని భావించిన టిటిడి ప్రతి కిలోమీటరుకు ఇద్దరు సిబ్బందిని నియమించి భక్తులను అప్రమత్తం చేస్తూ వాహనాలను అనుమతిస్తున్నారు. కాగా వాల్మీకిపురం మండలంలోసుమారు ఐదువందల సంవత్సరాల చరిత్ర కలిగిన పాత కోట బురుజు సోమవారం ఉదయం మండలంలోని కూరపర్తి గ్రామంలో సుమారు ఐదు వందల సంవవత్సరాలక్రితం నిర్మించిన కోట ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోట కుంగిపోయింది.