రాష్ట్రీయం

వసంత మండపంలో హోమాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభ్యంతరం వ్యక్తం చేసిన శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు
తిరుమల, నవంబర్ 30: కర్ణాటక రాష్ట్రం ఉడిపి పాలిమార్ మఠాధిపతి విద్యాదీశ తీర్థస్వామికి 60 జన్మదినోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా మఠానికి చెందిన కొంతమంది నిర్వాహకులు అర్పణోత్సవం పేరుతో శ్రీవారి ఆలయం వెనుకభాగాన ఉన్న వసంత మండపంలో చేపట్టిన కార్యక్రమాలు వివాదాస్పదంగా మారడమే కాకుండా టిటిడి అధికారులు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తిరుమల్లో ప్రైవేట్ వ్యక్తులకు, ఇతర దేవతామూర్తులకు యజ్ఞాలు, హోమాలు నిర్వహించడం నిషేధమని ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తెలిపారు. టిటిడి నిబంధనలు కూడా లెక్క చేయకుండా తిరుమల్లో గత మూడు రోజులుగా అర్పణోత్సవ కమిటీ నిర్వాహకులు చేస్తున్న పూజా కైంకర్యాలు క్షేత్ర పవిత్రతకు మంచిదికాదన్నారు. ఈపరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింతమంది మఠ, పీఠాధిపతులు తమకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను చేపట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. పాలిమారు మఠం అధిపతి విద్యాదీశ తీర్థస్వామికి 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మఠానికి చెందిన ఆయన శిష్యులు బృందంగా ఏర్పడి తిరుమల్లో అర్పణోత్సవం చేయాలని నిర్ణయించారు. ఈనేపధ్యంలో కర్ణాటకకు చెందిన ధర్మకర్తల మండలి సభ్యుడు అనంత్ సహకారం తీసుకున్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు చొరవ తీసుకుని ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 27న సుమారు 3వేల మంది మఠాధిపతి శిష్యులు తిరుమలకు చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్పణోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. స్వామీజీలకు హోమాలు, కలశాభిషేకాలు నిర్వహించారు. అయితే ఈవ్యవహారం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా అందరూ భావించారు. అయితే భగవంతుడి సన్నిధిలో వ్యక్తి పూజలు చేస్తున్నారని తెలుసుకున్న ఆలయ అర్చకులు నివ్వెరపోయారు. ఇదే విషయాన్ని ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. సాక్షాత్తు స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించడమే కాకుండా ఏడాదికి ఒకమారు శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాలు సందర్భంగా పుట్టమన్నును సేకరించే వసంత మండపంలో హోమాలు నిర్వహించడమేమిటని నిర్వాహకులను ప్రశ్నించారు. టిటిడి కూడా తిరుమల్లో యాగాలు, హోమాలు నిర్వహించాలంటే ఊరి పొలిమేర్లలో నిర్వహిస్తారన్నారు. అలాంటిది ఒక మఠాధిపతికి ఆలయ మాడావీధిలోవున్న వసంత మండపంలో ఎలా నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈసందర్భంగా దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ టిటిడి నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టలేదని, పూర్తిగా దైవ కార్యక్రమానే్న నిర్వహిస్తున్నామని, ఇది జన్మదిన వేడుకలు కావన్నారు. కాగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేద విద్యార్థులతో వేదాల్లో అత్యంత ప్రాశస్త్యం కలిగిన న్యాయసుధ గ్రంథ పఠనం చేశామని స్వామీజీ శిష్యులు చెబుతున్నారు. వసంత మండపంలో వంటలు, భోజనాలు చేయడాన్ని స్థానికులు తప్పుపట్టారు. అయితే తాము వంటలు చేసుకుని భుజించలేదని, సీతారాములకు, శ్రీకృష్ణునికి, ఇతర దేవతా మూర్తులకు నైవేద్యాలు సమర్పించి పూజలు చేశామని చెప్పుకున్నారు. శ్రీనివాసుడైనా, రాముడైనా, శ్రీకృష్ణుడైనా ఇతర దేవతామూర్తులు ఎవరైనా భగవంతులేనని వారికి పూజలు చేయడం తప్పుకాదన్నారు. ఇదిలా ఉండగా ఈ అర్పణోత్సవాలు సందర్భంగా మఠం నిర్వాహకులు కొంత మంది విరాళాలు సేకరించడం కర్ణాటక, మైసూరుకి చెందిన నిర్మాణ్ ప్రమోటర్స్ అనే రియలెస్టేట్ సంస్థ దేవుని చిత్రపటాన్ని ముద్రించి మరో వైపు వాణిజ్య ప్రకటనలతో కరపత్రాలను పంచారు.