వాసిలి వాకిలి

నేను.. పంచకోశ పొత్తాన్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను అన్నమయ ఇతిహాసాన్ని
ప్రాణమయ పురాణాన్ని
మనోమయ ప్రబంధాన్ని
విజ్ఞానమయ నిఘంటువుని
ఆనందమయ ఆకాశిక పొత్తాన్ని.
ఆహారమే నా ఉనికి
గుండె లయనే నా జీవశక్తి
ఆలోచనలే నా వర్తమానం
విజ్ఞానమే నా రేపటితనం
ప్రజ్ఞానమే నా అస్తిత్వం.
నేను మట్టి ముద్దను
నేను శ్వాసక్రియను
నేను భావలహరిని
నేను పరిశోధనా పాఠవాన్ని
నేను శోధనా సాధనను.
నేను-
నిర్యాణాన్ని వీడిన నిర్వాణాన్ని
నిర్వాణాన్ని అధిరోహించిన పర నిర్వాణాన్ని
పరనిర్వాణ ప్రస్థాన మహాపర నిర్వాణాన్ని
మహాపర నిర్వాణ వాకిటి ప్రాణకుంభాన్ని
ప్రాణ కుంభ గుంభన ఆదితత్వాన్ని.
* * *
నేను
పాంచభౌతిక ఆవలితీర ప్రస్థానంలో అరూపంగా ఈథరిక్ శరీరాన్ని, యాస్ట్రల్ శరీరాన్ని, మానసిక శరీరాన్ని, బౌద్ధిక శరీరాన్ని, ఆత్మ శరీరాన్ని. అంటే, ఈ భౌతిక సంబంధిత శరీరాల చైతన్యమంతా క్రింది స్థాయిల చైతన్య వాహినినే! అయినా, ఆత్మ శరీరానిది మాత్రం ఇటు అధోస్థాయి, అటు ఊర్థ్వ స్థాయి చైతన్య సంయోగమే!
మానవత్వం గికత్వంగా ప్రస్థానించే దశలో దిశా నిర్దేశం చేయగలిగేది ఆత్మ శరీరమే! ఒక విధంగా ఇటు ఇహానికి, అటు పరానికి వారధి ఆత్మశరీరం. పరంలోకి అడుగుపెట్టటం ఆలస్యం ఆత్మ శరీరం నిర్వాణ శరీరంగాను, పర నిర్వాణ శరీరంగాను, మహాపర నిర్వాణ శరీరంగాను, ప్రాణ శరీరంగాను, కాంతి శరీరంగాను పరిణమిస్తూ విశ్వంభరగా ‘ఆరిజిన్’ను చేరటమే గిక ప్రస్థానం.
అధోచైతన్య వాహికలైన ఫిజికల్, ఈథరిక్, యాస్ట్రల్, మానసిక్, బుద్ధిక్, ఆత్మిక్ బాడీస్‌లు జ్ఞాన విజ్ఞాన భాసురాలే! ఊర్థ్వ చైతన్య వాహికలైన నిర్వాణిక్, పర నిర్వాణిక్, మహాపర నిర్వాణిక్, ప్రాణిక్, లైట్, యూనివర్సల్ బాడీస్ ప్రజ్ఞాన ప్రభాసాలు. గిక ప్రస్థానంలో అధో చైతన్య శరీరాలలో ఒక్కొక్క శరీరంలో ఏడ అగ్ని తత్వాల చొప్పున ఇరవై ఎనిమిది అగ్ని తత్వాలు నెలకొని ఉంటే, ఊర్థ్వ చైతన్య శరీరాలలో ఇరవై ఒక్క అగ్ని తత్వాలు నెలకొని ఉంటాయి. ఇలా అధో, ఊర్థ్వ శరీరాల నలభై తొమ్మిది అగ్ని తత్వాల సమాహారమే గిక చైతన్య విస్ఫోటనం. అందకే, ‘నేను’ గిక ప్రాణ కుంభంగా పాంచ భౌతిక అగ్ని తత్వానికంటే వరో పది శాతం అధిక అగ్నితత్వం విలసితమై ఉంటాను.
* * *
నేను-
భూతలంలో భౌతిక శరీరాన్ని.
రూప ప్రపంచానికి అందమైన దేహాన్ని.
ఈ ఆరడుగుల ఆరోగ్యానికి ఆహారం, బలం భౌగోళిక వనరులే! తినే తిండి, పీల్చే గాలి, చెట్టూ చేమా, నీరూ నిప్పూ, మిన్నూ మన్నూ - ఇవన్నీ వర్తమాన దేహాన్ని అన్నమయకోశంగా ప్రవర్తిల్ల చేస్తున్నాయి. కాబట్టి అన్నమయకోశమే మన అందం, ఆరోగ్యం. ప్రకృతి శక్తీ దీనికి తోడవుతుంటుంది. సో, మన కంటికి కనిపించేది ఈ మెటీరియల్ బాడీనే. అయినప్పటికీ అన్నమయ కోశం చర్మ సౌందర్యానికి లోపల ఉంటుంది కాబట్టి అది ప్రత్యక్షంగా కనిపించదు. పోనీ, చర్మాన్ని విప్పి చూసినా, పొట్ట విచ్చి చూడ పురుగులుండు అన్నట్లు, భయం గొల్పుతుంది. ఇలా కంటికి కనిపించనిది ఒక్క అన్నమయ కోశమే కాదు.. ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం కూడా. అయినా ఈ పంచ కోశాలలోను అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశ త్రయాన్ని మాత్రమే మెటీరియల్ బాడీ అంటున్నాం.
పాంచభౌతిక దేహం లోపల పంచకోశాలున్నట్లే బయటా మరిన్ని దేహాలున్నాయి. కొందరు వీటిని మూడు అంటారు, ఇంకొందరు అయిదు అంటారు, మరి కొందరు ఏడు అంటూంటారు. సంఖ్యాపరంగా ఎన్ని అని తేల్చి చెప్పినా అవి ఏవీ ఈ నేత్రద్వయానికి అగుపించవు కాక అగుపించవు. వాటి ఉనికి మనకు అందేది కొంత జ్ఞానం వల్ల, ఇంకొంత విజ్ఞానం వల్ల మాత్రమే! మరింత ప్రజ్ఞానం వల్ల - ఇలా జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞాన సంయోగ ఆవిష్కరణలు సాధ్యమయ్యేది యోగ సాధనా జీవన మార్గంలోనే.
పదార్థ దేహం ఎంతలా పాదార్థిక శక్తి ప్రపూర్ణమైనా జీవ ప్రాణ శక్తుల సంపన్నమైన మరొక కోశం ఉంటుంది. అన్నమయ కోశం ద్వారా మనం తీసుకునే ఆహారం శక్తిగా పరిణమించేది ప్రాణమయ కోశంలో జరిగే వివిధ క్రియల వల్లనే. అంటే, బయోలాజికల్ ప్రాసెస్‌కు అవకాశమిచ్చేది ఈ ప్రాణమయ కోశమే. ఒకప్పుడు ఈ ప్రాణమయ కోశ క్రియల్ని గమనించి చికిత్సలు చేసేవారు. అప్పట్లో వాటిని ప్రాణ చికిత్స లనేవారు. డాక్టర్ల దృష్టి అవయవ శరీరంపైకి మళ్లిన తర్వాత చికిత్సా విధానం అవయవ పరిమితమై చెట్టుకొకరు పుట్టకొకరు అన్న తీరున డాక్టర్లు సైతం అవయవానికి ఒకరు చొప్పున స్పెషలిస్ట్‌లయిపోయారు.. చికిత్స సైతం సూప్రా స్పెషల్ అయింది. మళ్లీ గిక సాధనలో గిక చికిత్సల ‘ప్రాణాట్రీట్’గా పరిణమించాయి.
ప్రాణమయ కోశ చికిత్స జరగకపోతే గుండె, శ్వాసకోశాల పనితీరు దెబ్బతింటుంది. అటు గుండె, ఇటు శ్వాసకోశాలు, అపశ్రుతులు పలుకుతుంటే అన్నమయ కోశ పరివ్యాప్త భౌతిక శరీరం దీర్ఘ వ్యాధులకు ఆవాసమవుతుంది. దీనికంతటికీ కారణం కణాల మధ్య సఖ్యత లోపించటమే!
* * *
నేను-
క్షణభంగురమే! కణ సముదాయమే!
ఈ ఆరడుగుల ఆకారంలో కోటానుకోట్ల కణాలు.
డెబ్బై కిలోగ్రాముల ఈ భౌతిక దేహంలోని ప్రతీ గ్రామ్ మాంసంలోను కోట్ల కణాలు. ప్రతీ కణం ఒక హరిత రేణువే! మైతోకాన్ద్రియాగా చెప్పుకునే హరిత రేణువు మనం శ్వాస తీసుకున్న ప్రతీసారీ గాలిలోని ఆక్సిజన్‌ను తీసుకుని కణంలో ఉష్ణంగా ప్రతిఫలిస్తుంది. ఇలా మన దేహంలోని ప్రతీ కణం ఒక ఉష్ణవాహిక కాబట్టి ప్రాణమయ కోశ శ్వాసక్రియ అన్నమయ కోశ ఆరోగ్య వ్యవస్థకు మూలమవుతోంది.
మనం నిమిషానికి పదిహేను మార్లు శ్వాస తీసుకుంటున్నాం అంటే మనలోని ప్రతీ కణం ఆ శ్వాసలో ఉష్ణశక్తిగా మారుతున్నట్లే. ఇలా మనలోని అధిక శాత కణాలు మూడు రోజులపాటు సమర్థవంతంగా ఉష్ణాన్ని జనింపచేస్తూ తమ సామర్థ్యాన్ని కోల్పోయి నశిస్తాయి. మరణించిన కణాలు మన విసర్జకావయవాల ద్వారా శరీరం నుండి వైదొలగుతాయి. ఇలా శక్తి కోల్పోయిన కణాలనే మనం ‘టాక్సిన్స్’ అంటుంటాం. ఈ టాక్సిన్స్ బయటపడటమే ‘డిటాక్సిఫికేషన్.’
ఇంతకీ, గిక సాధనలో ఈ శ్వాసక్రియల వేగాన్ని అంటే సంఖ్యను తగ్గించటం ముఖ్యం. ఉదాహరణకి నిమిషానికి పదిహేనుసార్లు బదులు పధ్నాలుగుమార్లు శ్వాసించగలిగితే కణ ఆయుష్షు మరో రెండు రోజులు పెరుగుతుంది. అంటే, మూడు రోజుల నుండి అయిదు రోజులకి చేరుతుందన్న మాట. ఇలా కణ ఆయుష్షును మూడు రోజుల నుండి ఇరవై ఒక్క రోజుల వరకు పెంచగల శక్తి యోగ సాధనకుంది. కణ ఆయుష్షు పెరగటం వల్ల మన ఆయుష్షు పెరుగుతుంది. సింపుల్‌గా చెప్పుకోవాలంటే, నిమిషానికి ఒక శ్వాసను తగ్గించుకోగలిగితే, అంటే మన శ్వాసక్రియ నిమిషానికి పదిహేను నుండి పధ్నాలుగు చేరగలిగితే మన ఆయుష్షుకు మరో ఇరవై ఏళ్లు కలుస్తుంది. దీర్ఘాయుష్కులం కావటం, ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ సాధ్యమయ్యేది ఇలా యోగ సాధన ద్వారా శ్వాస మందగించటం వల్లనే.
* * *
ప్రాణమయ కోశం అంటే శక్తి కోశమే. ఈ శక్తి ఎనర్జీ, ఫోర్స్‌ల సంగమం. వైటల్ సప్లై, విగర్ సప్లై, ప్రాణా సప్లై జరిగేది ఈ ప్రాణమయ కోశం నుండే. ఎపిథీరియల్ వ్యవస్థ అన్నమయ కోశానిది అయితే ఆ ‘ఎపిథీరియల్ వర్కింగ్’ ప్రాణమయ కోశానిది. స్థూల శరీరాన్ని ప్రాణమయ వ్యవస్థ ఎలా రక్షిస్తుంటుందో అలాగే సూక్ష్మ శరీరంతో బంధం నెలకొల్పుకుని ఉంటుంది. అందుకే గిక చికిత్సల ‘ప్రాణా ట్రీట్’ అవుతున్నాయి.
యోగచికిత్స ‘ప్లెంటీ ఆఫ్ ప్రాణా లెవల్స్’లో ప్రారంభమవుతుంది. ఈ చరాచర సృష్టిలో అంటే విశ్వ కుండలినిలో ప్లెంటీ ఆఫ్ ప్రాణా తొంభై నాలుగు బ్రీతింగ్స్‌గా నెలకొని ఉంటుంది. అంటే తొంభై నాలుగు బ్రీతింగ్స్ వల్ల సృష్టికి సంబంధించిన ఎడ్జెస్ట్‌మెంట్స్ సాధ్యమవుతుంది. రుషిమండల మాస్టర్స్, సప్తర్షులు విశ్వాన్ని ట్రీట్ చేసినవారే! ఎడ్జెస్ట్ చేసినవారే! వారి తపస్సంపన్నత వినియోగానికి నీ-నా భేదం ఉండదు. చర-అచర వింగడింపు ఉండదు. అంతటా, అన్నిటా సమదృష్టి వారిది. సామాన్యులు మానవ కుండలినిపై దృష్టి సారిస్తే మహాత్మలు అసామాన్యంగా విశ్వకుండలినికి తమ గికత్వాన్ని జోడిస్తార. అందుకే వారు విశ్వపురుషులు.
ఇంతకీ, విశ్వకుండలిని తొంభై నాలుగు బ్రీతింగ్స్‌ల పూర్ణకుంభమైతే మానవ కుండలిని అరవై నాలుగు బ్రీతింగ్స్‌ల సమాహారం. మన భౌతిక చికిత్సలకు ఈ అరవై నాలుగు బ్రీతింగ్స్‌లోని రెండు మూడు బ్రీతింగ్స్‌ల సంయోగ సాధన చాలు. ఇంతకీ ఈ అరవై నాలుగు బ్రీతింగ్స్ సౌండ్ వైబ్రేషన్స్‌తో ప్రాణమయ కోశాన్ని చైతన్యపరచి మనలోని డెబ్బై రెండువేల నాడులలో అవసరమైన నాడులలో స్పందనలను, ప్రతిస్పందనలను కలిగిస్తాయి. ఈ ప్రాణ చికిత్స జరిగేది యాస్ట్రల్‌లో అయినప్పటికీ ప్రభావమంతా ఈథర్ బాడీపై ఉండి భౌతిక శరీరం ఫలితాన్ని పొందుతుంది.
బ్రీతింగ్ ద్వారా యాస్ట్రల్ సెపరేషన్ జరిగి ఈథర్ బాడీ బోర్ అయి - ఫిజికల్ బాడీలో కెమికల్ ఛేంజ్ జరిగి - విగర్ సప్లైతో కెమికల్ ఫిట్టింగ్ కలగటమే ‘ప్రాణా ట్రీట్’కే.
Throughout the molecules in songs very constituent regular training to-
-Then Organs

-విశ్వర్షి 9393933946