వాసిలి వాకిలి

నేను.. శోధనాపత్రాన్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1
నేను
సాధకుడను, సన్యాసిని కాను
బుద్ధుడను, భిక్షువును కాను
అంతర్ముఖీనుడను, అనుకరణను కాను
ప్రాపంచికుడను, అనుసరణను కాను.
కనిపించే బైరాగినీ కాను
కనిపించని తాపసినీ కాను
అవును, నేను
నిశ్వాసగా బాహ్యాన్ని, ఉచ్ఛ్వాసగా ఆంతర్యాన్ని,
2
నేను
కాను మనోవ్యాపారాన్ని, అయినా మనసును
కాను ఇంద్రియక్రతువుని, అయినా దేహాన్ని,
దేహానికి మనసు లేనివాడిని
మనసుకు దేహం కానివాడిని
లేనిదాని ఆరాటాన్నీ కాను
ఉన్నదాని వ్యామోహాన్నీ కాను
అవును, నేను
దేహ బంధం మనసు ఒరిపిడి లేనివాడిని
3
నేను
అవసరాలను గణించని వాడిని
అనవసరాలను పరిగణించని వాడిని
అవసరంలోని అనవసరత అవగతమైన వాడిని
అనవసరంలోని అవసరం అర్థమైనవాడిని
అవసర తొందరనూ కాను
అనవసర వేగాన్నీ కాను.
అవును, నేను
పారదర్శక ధ్యాసను పర శ్వాసను.
4
నేను
ఐహికాన్ని, అయినా విదేహ విజేతని
భౌతికాన్ని, అయినా దేహ సేనానిని
కాను సేవకుడను, అవును నిజ యజమానిని
దేహ యాజమాన్యాన్ని, కాను మనసు అల్లరిని
ఆంతర్య మేథను అధిరోహించిన వాడ్ని
అంతర్గమన మెళకువలను మధించినవాణ్ని
అవును, నేను
గెలవటం తెలిసిన మనీషి పార్శ్వాన్ని.
5
నేను
ఏకాంత దేహాన్ని ఏకాంత మానసాన్ని
ఏకైక పార్శ్వాన్ని ఏకైక దర్శనాన్ని.
ఏకలవ్యుడ్ని ఏకాంత వేటగాడిని
గురు అనే్వషిని గురి కలవాడిని
శిష్యుడిని, గురుతత్వ శిష్యరికాన్ని
గురువును, ఆత్మతత్వ గురుత్వాన్ని
అవును, నేను
ఏకమనస్క భారమితిని.
6
నేను
సాధువును, పంచభూత ఏకోదరుడ్ని
సహవాసిని, గురు ఆరామ వాసిని
పాఠాన్ని, ఆలోచనల పాఠ్య పుస్తకాన్ని
ఫలితాన్ని, లోచనల పరీక్షాపర్వాన్ని
గురు బోధనల ప్రయోగశాలను
గురుబ్రహ్మల గ్రంథాలయాన్ని
అవును, నేను
దివ్యాక్షర శోధనా పత్రాన్ని.
7
నేను
రూపరిని, వస్తు ప్రపంచ వికారిని
నిర్వికారిని, నిరుపమాన చిత్తాన్ని
సిద్దార్థను, అనుభవ పీఠాన్ని
పరమాత్మను, నిర్వికల్ప దేహస్థితిని
శక్తీ స్థితిని, మానసికంకాని సత్యస్థితిని
గిక స్థితిని, వోక్షంకాని అమృత స్థితిని
అవును, నేను
కాల కరవాలంపై నడుస్తున్న సుశిక్షితుడ్ని.
8
నేను
అంతర్నేత్రాన్ని, రెప్పవేయని అంతరిక్షాన్ని
అతీంద్రియాన్ని, సడిచేయని బాహ్య వనరుని.
అహంకారిని, అభిన్నతల అంతర్వేదిని
అంతర్యామిని, గురుపథ అరవిందాన్ని.
ఆత్మవిశ్వాసాన్ని, పురోగమన పాటవాన్ని
ఆత్మ దర్శనాన్ని, సంకల్ప శ్రీకారాన్ని
అవును, నేను
ఆత్మన ఒదిగిన అనుభవ రహస్యాన్ని.
9
నేను
ధ్యానిని, ప్రకృతి పెంచిన ధ్యాసని
వౌనిని, ప్రవృత్తి పెంచిన ప్రాకారాన్ని
వెలుతురును పంచే తెల్లమబ్బులు
చీకటిని పెంచే నల్ల మబ్బులు
వర్షించే కారుమేఘాలు
రంగులు పూయించే నీటి తుంపరలు
ఇంద్రధనస్సుల్ని సృజించే కిరణాలు
సంధ్యన కలగలిసే కుంచెల రంగులు
నా అంతర్నేత్ర విరచితాలే
ఆ సృజన రహస్యాలన్నీ నా ధ్యాన సాధనాలే.
10
నేను
శిఖరాన్ని అగాధాన్ని
అరణ్యాన్ని అలను
శిఖరం తొలిగురువు అగాధం మలిగురువు
సమూహం భౌతిక గురువు సముద్రం ఆత్మగురువు
విరుచుకుపడే అలా గురువే
విరిగిపడ్డ కలా గురువే
రాలిపడే చినుకూ గురువే
రాజీపడే మెతుకూ గురువే
ఆరిన దీపమూ గురువే
ఆలయ దీపమూ గురువే.
గాలివానా గురువే గాలిపటమూ గురువే.
అవును,
ఈ అంతరంగాలన్నీ నా సాధనా రహస్యాలే
ఈ స్థితి భేదాలన్నీ పరిణామ క్రమాలే.

-విశ్వర్షి 93939 33946