వాసిలి వాకిలి

నేను.. గర్భాలయ పలకరింతను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను
ఇలన కలను
కలన అలను
జీవితానికి స్వప్న జగత్తును
ఇల ఒక వాస్తవం
కల ఒక వాస్తవం
జీవనానికి కళాజగత్తును.
*
నేను
కల కంటాను
కలన
రేపు కనుపాపల దోగాడుతుంది
రేపటి వాస్తవం కదలాడుతుంది
ఆత్మ కళ్లల్లో కొలువుతీరుతుంది
వెలుతురు వేళ నన్ను వదలని ఆత్మ
రాత్రయితే చాలు నా కలను చేరుతుంది
కమ్మని నిజంలా మనసున నిక్షిప్తమవుతుంది
జీవనయానానికి ఆలంబనగా స్థిరమవుతుంది
*
కాలమానానికి కల కొమ్మచ్చి అవుతుంది
ఆత్మసిద్ధికి కాలజ్ఞానం తోడవుతుంది
స్వప్నానికి సాధన చేరువవుతుంది
భూమి పొరల దాగిన విత్తు
కల కలన కొమ్మ కొమ్మవుతుంది
కల ప్రిదిలే వేళ పరిమితమవుతుంది
*
స్వప్నంలోని సుగంధం
సుప్రభాత వేళ పరవాసన అవుతుంది
ఫాలరేఖల పరవశమవుతుంది
కాలరేఖతో కాంతి కిరణమవుతుంది
ప్రత్యూషాన
విత్తును జలబిందువులతో స్పృశిస్తుంటే
గర్భాలయం నుండి పలకరించింది
రేపటి శిశువుకు పిండమై
ధ్యానమగ్నమైన వేళ
మొక్కగా పరిణమించే దశలను నిలిపింది
నా ఆత్మవాకిట ప్రకృతిబింబంలా
*
స్వప్నంలో
నన్ను నేను చూసుకుంటుంటాను
సాధనలో
నా కళ్లెదుట నేనుంటాను
కొలమానాన వామనుడిలా
పరిణామాన వానరునిలా
పరిమాణాన మానవునిలా
కాలమానాన దివ్యునిలా
జ్వలిస్తుంటాను అగ్నిలా
ప్రచండమవుతుంటాను గాలిలా
పదార్థమవుతుంటాను మట్టిలా
స్థితమవుతుంటాను వాయువులా
వాహిని నవుతుంటాను నీటిలా
ఆకాశమవుతుంటాను శూన్యతలా.
*
కల ముగింపుకొస్తూ
మనసును మేల్కొల్పుతుంది
సాధన సారవంతమవుతూ
శక్తిపాతమవుతుంది
స్వప్న సాధనలు అభేదమవుతూ
ఇహ పరాలు సమవేదికలవుతాయి
సహజాతాలవుతూ
సహజసిద్ధులవుతాయి
బాహ్య అంతరాలు సమభాగినులవుతాయి.
*
స్వప్నం నాకొక ఉపదేశం
సాధన నాకొక ఉపాధేయం
కల నాకొక జ్ఞానాలయం
సాధన నాకొక ప్రయోగాలయం.
*
నేను
ఇడ పింగళ సుషుమ్నల ప్రణవ దేహాన్ని
దైహిక నేత్రాలకు అందని
స్వప్న దృష్టిని, యోగదృష్టిని
వినగల కాంతిని, చూడగల చీకటిని
స్పృశించగల పరాన్ని, స్వ ఇచ్ఛా పథాన్ని
*
స్వప్నం నాకొక గ్రంథాలయం
ఏ అరనా ఏ పుస్తకం వుండదు
మనసు శూన్యపత్రాల
శే్వతాక్షరాలను అందుకుంటుంది
సాధనలో ఆత్మ
నల్లకాగితాలపై తెల్లటి పదాలనే శబ్దిస్తుంది
నిశ్శబ్దంగా భవిష్యత్తును నిర్వచిస్తుంటుంది
కృష్ణబిలను చేరుకొని
జనన మరణ రహస్యాలను చేదుతుంటుంది
విశ్వ వేదికన
కాల వేదిక అవుతుంటుంది
సృష్టి వేదికన
పరంపరకు మూలమవుతుంటుంది
మూలానికి అభేద మవుతుంటుంది.

-విశ్వర్షి 93939 33946