వాసిలి వాకిలి
నేను.. గురుఛత్రాన్ని
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నేను ఎవరు?
పాతాళ లింగ మహర్షిని
అరుణాచల పాద నేత్రాన్ని
భూవలయ వౌలిక శక్తిని
అగ్ని క్షేత్ర శూన్య వౌనాన్ని
వాహన మంటప నిర్వ్యాపారాన్ని
హరితవనాన ధ్యాసలేని ధ్యానాన్ని
తమస్సును గిక తపోవనాన్ని.
*
నేన ఎవరు?
గమ్యాన్ని, కాను గమ్యస్థానాన్ని
గమనాన్ని, కాను గమ్యరచనను
వేయిస్తంభ మంటప సాధనను
సహస్రార గమన తపస్సును
అమాత్ర స్థిత అరూపను.
*
నేను ఎవరు?
సాధనా ఫలితాన్ని
ఇప్పచెట్టు నీడన ధ్యాన చక్రాన్ని
గురుమూర్త గురుఛత్రాన్ని
కాను, భౌతిక గురువును
కానుకాను, ఆత్మ గురువును
అవునవును, అచల గురువును.
*
నేను ఎవరు?
కాను, నామగుణ వర్ణిత స్తోత్రాన్ని
కాను, ప్రణవ శబ్ద మంత్రాన్ని
కాను, ఉచ్ఛశ్రవ వాచకాన్ని
కాను, నిశ్శబ్ద ఉపాంశువును
కాను, మానసిక జపాన్ని
అవును, వౌన ధ్యానాన్ని.
*
నేను ఎవరు?
తనువు పిలవని స్థితిని
మనసు పరితపించని స్థితిని
ఇంద్రియాలు శబ్దించని స్థితిని
ఇహాన్ని పరిత్యజించిన నిశ్శబ్దాన్ని
సుక్షేత్రాన్ని స్వక్షేత్రాన్ని ఆత్మక్షేత్రాన్ని.
*
నేను ఎవరు?
గురువును
అచల గురువును
గురుదక్షిణను గిరిప్రదక్షిణను
దివ్యశరీరుల గురుప్రదక్షిణను
అరుణాచల పాదపీఠాన్ని
గిరిశిఖర జ్యోతిర్మండలాన్ని.
*
నేను ఎవరు?
కాను ద్వైతాన్ని, అవును అద్వైతాన్ని
కాను వివేకాన్ని, అవును విజ్ఞతను
కాను ధ్యాసను, అవును ధ్యానాన్ని
కాను లక్ష్యాన్ని, అవును ఆత్మస్పర్శను
కాను దర్శనాన్ని, అవును వౌన మార్గాన్ని.
*
నేను ఎవరు?
స్థిర సంకల్పాన్ని, స్థితప్రజ్ఞను
అడగని ప్రశ్నకు అందిన సమాధానాన్ని
విచారణతో అందుకున్న అనే్వషణను
అదృశ్య దృశ్య జగత్తును, దృశ్య ఆత్మను
కాను అవగాహనను, అవును ఆలోకనను.
*
నేను ఎవరు?
స్వస్వభావ ధ్యానాన్ని
స్వస్వరూప సాధనను
ఆత్మానే్వషణా సంస్కారాన్ని
విరూపాక్ష గుహానే్వషిని
అనుభవ జ్ఞానసిద్ధిని.
*
నేను ఎవరు?
కాను దేహాన్ని
కాను మనసును
అవును సంయమనాన్ని.
కాను ఆరాటాన్ని
కాను పోరాటాన్ని
అవును ప్రశాంతిని
కాను స్వార్థాన్ని
కాను కృత్రిమత్వాన్ని
అవును నిత్యకృత్యాన్ని.
*
నేను ఎవరు?
కాను పూర్వ వ్యక్తిత్వ భావనను
అవును వర్తమాన సమతుల్యతను
కాను సాధించిన వైరాగ్యాన్ని
అవును క్షణ క్షణ ధ్యాన వలయాన్ని
కాను కాపరిని
అవును అచల మార్గదర్శని.
*
నేను ఎవరు?
కాను మెరుగుకు తపించిన విచారణను
కాను తరుగుకు తల్లడిల్లిన విచారాన్ని
కాను ఇహపర ఆనంద కాంక్షను
అవును చరాచర చిదానందాన్ని
కాను ఐహికామోద ఆనందపథాన్ని
కాను ప్రాపంచిక నిష్క్రమణను
అవును పాదపద అచల పథాన్ని.
*
నేను ఎవరు?
నాలోని గెలుపును
ఉద్గమన విజేతను
నిత్య సాధనా ప్రజ్ఞానాన్ని
కాను పోగు చేసిన పరిజ్ఞానాన్ని
అవును ఇంద్రియ కాంక్షలేని జ్ఞానాన్ని.
*
నేను ఎవరు?
మనిషి మనిషిని
మనీషి మనసును
నిజజన తపస్సును
మహర్షి మహస్సును
అరుణాచల ఆజ్ఞను
రమణాచల వర్ఛస్సును.