వాసిలి వాకిలి

ప్లానెటరీ క్లైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగ సాధన అనేది స్పిరిట్యుయల్ సైన్స్ అయితే సైన్సును దాటి విశ్వసనీయతతో యోగసాధన విశ్వమండలాలను దాటుతుంది. కాబట్టి సైన్స్ స్పిరిట్యుయాలిటీలు ఎడమొహాలు, పెడమొహాలు అవుతుంటాయి. మెడిటేషన్ అధిభౌతిక దృశ్యాలను ‘అప్పియరెనె్సస్’గా పరిగణిస్తుంటే సైన్స్ భౌతిక దృశ్యాలనే ప్రామాణికంగా తీసుకుంటోంది. ఈ రెండింటికీ నడుమ ఆస్ట్రాలజీ అనేది A typology of living beings projected on to the celectial vault అయింధి. ఒక విధంగా జ్యోతిష, ఖగోళ శాస్త్రాలు మానవ పరిణామ విషయంలో ఇటు స్పిరిట్యుయాలిటీ అటు సైన్స్‌ల మధ్య ఒక వారధి అవుతున్నాయి.
తల్లి గర్భంలో మనం మానవ ఆకృతిగా పరిణమిస్తున్న దశలోనే ఖగోళ గర్భంలోని గ్రహాల, నక్షత్రాల ప్రభావాలతో మన హార్మోన్లు, జీన్స్ వృద్ధి చెందుతాయి. వాటిపై ఏ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుందో ఆ గ్రహ ఆధిపత్యంలో మనం పుడమిపైకి వస్తాం. దీనే్న మనం ‘ప్లానెటరీ క్లైట్’గా చెప్పుకోవచ్చు. నిజానికి మతం కూడా ఇలా గ్రహ వారసత్వంతో పుట్టుకొచ్చిందే. అంటే మనపై గ్రహాల ప్రభావం ఉందని గుర్తించిన మన పూర్వీకులు నాటి నుండే ఆ గ్రహాలను ఆరాధించటం ప్రారంభించటంతో మతం పుట్టుకొచ్చింది.
కాలక్రమంలో భాషా సంస్కృతులు మతానికి తోడయ్యాయి. మొదట్లో గ్రహశక్తిని బట్టి గ్రహారాధన ప్రారంభమైనా రానురాను ఆ ఆరాధనకు కొన్ని క్రతువులు కలిసాయి. భాషా సంస్కృతుల కారణాన మతం బహుముఖీనమైంది. చివరికి నా మతం గొప్పదంటే నా మతం గొప్పదన్న సంకుచితత్వం నెలకొంది. దరిమిలా మనం విస్తృతం కావటానికి బదులు సంకుచితం కావటం జరుగుతోంది. చివరకు ప్రాకృతిక శక్తుల్ని ఈవిల్ స్పిరిట్స్, గుడ్ స్పిరిట్స్ అంటూ విడదీస్తున్నాం. ఇలా దెయ్యాల్ని, దేవతల్ని మన ప్రాంగణాలలో నిలుపుకున్నాం.. మన ఆహారపు అలవాట్లతో వాటినే ప్రసాదాలుగా సమర్పిస్తున్నాం. కొన్ని శక్తులకు రక్తతర్పణం, ఇంకొన్ని శక్తులకు జంతు బలులు పైగా ఆ శక్తులకు అవే ఇష్టం కాబట్టి వాటిని సమర్పిస్తూ వాటిని తృప్తి పరిస్తే ఎటువంటి నష్టమూ జరగదంటూ మనం సంతృప్తులం అవుతున్నాం. ఇటువంటి సంతృప్తితో వాటి దుష్ప్రభావాల నుండి దూరమవుతున్నాం.
ప్లానెటరీ సెన్సిటివిటీ
ఈ చర్యలతో ‘ప్లానెటరీ సెన్సిటివిటీ’ అన్న పదం మన మనసులలో తిష్ట వేసింది. ఈ ‘సెన్స్’తో మంచి శక్తుల్ని దేవతలంటున్నాం. చెడు శక్తుల్ని దెయ్యాలంటున్నాం. అయినా శక్తికి ‘మంచీ చెడు’లేమిటి? గొప్ప ఇంట పుట్టిన వాళ్లు గొప్పవాళ్లు అన్నట్లుగా మనమే ఆ గొప్పను ఆపాదిస్తూ దేవతల అంశలో పుట్టిన వాళ్లను దేవతలను చేస్తున్నాం. ఇలా దివ్యత్వానికీ వంశప్రతిష్ట తలుపులు తెరుస్తోందా?
ఈ నమ్మకంతోనే నేటి ఆధ్యాత్మిక కేంద్రాలు వారసత్వ, కుటుంబ నేపథ్యాల నుండి పుట్టుకొస్తున్నాయి. చివరికి ధ్యాన, యోగ మార్గాలలో సైతం ‘యాస్ట్రల్ కల్ట్’లు తయారవుతుండటానికి కారణాలు మనం గీసుకుంటున్న రక్షణ రేఖలే! ఏది ఏమైనా గత ఇరవై వేల ఏళ్లుగా మన ‘మనసు గతి’ ఇంతే!
మనిషిగా మనం తృప్తి పడగలిగితే ఎటువంటి ఆరాధనకైనా ముందు వరుసలో ఉంటాం. అప్పుడు ఆరాధనల పర్వంలో రక్తం ఏరులైనా ఫర్లేదు. మనం మన సమీప భవిష్య అవసరాల నుండి సాంత్వన పొందటానికి, ప్రయోజనం పొందటానికే ఇలా స్వార్థపరుల మవుతున్నాం. ఈ స్వార్థం ఏదో రూపేణా గత ముప్పై వేల ఏళ్లుగా గ్రహారాధన పేరున సాగుతోంది.

-విశ్వర్షి 93939 33946