వాసిలి వాకిలి

యాస్ట్రల్ ట్రావెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జననం ఒక స్థితి అయితే, మరణం ఇంకొక స్థితి అయితే, మరణించాక మరొక స్థితి ఉంటుంది. అది అధిభౌతిక స్థితిగా అనిపించే స్థితుల సమాహారం. ఆత్మ మానవ రూపంలో అనుభవించే స్థితులు మానవత్వ స్థితులయితే భౌతికతను దాటి అందుకునే స్థితులు గిక సిద్ధలు. ఈ స్థితులను ధ్యానంలో అందుకోవటమే సిద్ధి పొందటం. అంటే ఆత్మ సంచరించే భౌతిక స్థితులన్నీ అనుభవ సంపద లవుతుంటే ఆత్మ అధిభౌతికంగా చేసే సంచారంలో అందుకునే స్థితులన్నీ సిద్ధులవుతుంటాయి. మొత్తానికి దైహిక, భౌతిక, మానసిక సంచారాలన్నీ మానవ పరిణామానికి చెందినవి అయితే ఖగోళిక, నిర్వాణిక, పరనిర్వాణిక, మహాపర నిర్వాణిక సంచారాలన్నీ దివ్య పరిణామానికి చెందినవి.
భౌతికానికి చెందిన మూడు స్థితులు, అధిభౌతికానికి చెందిన మూడు స్థితుల మధ్యన ఖగోళిక స్థితి ఉంటుంది. ఈ ఖగోళ సంచారానే్న ‘యాస్ట్రల్ ట్రావెల్’ అంటాం. గ్రహ మండలాల ప్రభావానికి లోనయి జీవించటం మానవ జీవన రహస్యం అయితే గ్రహ మండలాలను దాటి, గ్రహ ప్రభావాలకు లోనుకాక జీవించటం దివ్యజీవన రహస్యం. ఈ దివ్య జీవన వర్తనం కోసం సాగించే సాధనే ధ్యానం, యోగం, తపస్సు.
మానవ ప్రాంగణంలో వొదిగిన ఆత్మ దివ్య ప్రాంగణంలో ఎదగటమే ధ్యాన సాధన.. యోగ సాధన.. తపస్సాధన. ఇదే ‘మాస్టరిజమ్’. మాన్ బికమింగ్ మీడియమ్.. మీడియమ్ బికమింగ్ మాస్టర్ - ఈజ్ మాస్టరిజమ్. మాన్ ఈజ్ సెల్ఫ్.. సోల్ ఈజ్ మీడియమ్.. స్పిరిట్ ఈజ్ మాస్టర్. దేహావరణలోని సెల్ఫ్ స్థితి నుండి దివ్యావరణకు చెందిన స్పిరిట్‌గా ఆత్మ చేసే పరిణామ ప్రయాణమే దివ్యసాధన.
మానవాత్మ బుద్ధికి అనుగుణంగాను, మనసుకు అనుసంధానంగాను దేహవర్తనం సాగిస్తుంటుంది. అంటే బుద్ధికి తోచినట్లు, మనసుకు తోచినట్లు మనం చేసే పనులన్నీ బౌద్ధిక, మానసికాలే. బౌద్ధిక సూచనలతో మనం కర్తవ్యోన్ముఖులం కావటం బౌద్ధిక చైతన్యం అయితే, మానసిక సూచనలతో కర్మాచరణకు దిగటం మానసిక చైతన్యం. ఈ బౌద్ధిక, మానసిక చైతన్యాల సంయోగమే దైహిక చైతన్యం. బుద్ధి, మనసు చైతన్య స్థితిని కోల్పోతే దేహానిదీ చైతన్యస్థితి కాకుండా పోతుంది. ఆ జడస్థితే మృత్యుస్థితి. దీనే్న మనం ‘దైహిక నిర్వాణం’ అనవచ్చు. దైహిక నిర్వాణంతో ఆత్మ అధ్యాత్మ నిర్వాణ స్థితిని చేరుకుంటుంది. దైహిక చైతన్యంతో ఉంటూనే ఈ అధ్యాత్మ చైతన్యం ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది.
మనం చరిస్తున్న భూగోళానికి ఎనె్నన్నో అక్షాంశలు.. అన్ని అక్షాంశలు సమానతకు ప్రతీకలే. ఈ భూమండలంలోని మనమందరం మానవాంశలమే. మనమూ సమత్వానికి ప్రతీకలమే. మానవాంశతో మనం బౌద్ధికంగా జీవిస్తుండాలి. ఇక్కడ జీవించటం అంటే చదరంగం ఆటలో పావులు కదిపినట్లు మన ఆలోచనలను ప్రణాళికాబద్ధంగా ఆచరణలో పెట్టటమే. అప్పుడే మన మానవ కదలికలు సరియైన పంథాలో సాగుతాయి. ఈ జీవికకు కావలసిన దేహపరమైన ‘లింక్’ల నన్నింటినీ చైతన్యపరచటమే బౌద్ధిక చైతన్యం. ఇది స్వభావ జనితం. బుద్ధి పుడితే చేస్తాం అంటుంటాం. అంటే స్వభావం అనే కదా! మాస్టరిజంలో దీనే్న ‘బుద్ధిక్ కాన్షియస్‌నెస్’ అంటాం.
బౌద్ధిక చైతన్యమే స్వభావ చైతన్యం. ఇది అరువు తెచ్చుకున్నది కాదు.. మనలో స్వతహాగా ఉన్నదే. అయితే మానసిక చైతన్యం మాత్రం ఎరువుతో సమృద్ధిమైందే. స్వభావానికి కొంత శిక్షణ ఇవ్వటం వల్ల మన స్వభావం తెలివితేటలమయం అయింది. ఇదే జ్ఞాన ప్రకాశనం. సంపాదించుకున్న జ్ఞానంతో దైహిక వర్తనం సాగించటమే మానసిక చైతన్య వర్తనం. అంటే మానసిక చైతన్యంతో మనలో ‘గమనిక’ పెరుగుతుంది. జీవితం ‘వాచ్ - వర్కింగ్ ప్రిన్సిపుల్స్’ మయం అవుతుంది. మెంటల్ కాన్షియస్‌నెస్‌తో మన నుండి సడెన్ ఫీలింగ్స్, సడెన్ ఎక్స్‌ప్రెషన్స్ వ్యక్తమవుతున్నప్పటికీ అవన్నీ తెలివితేటలతో ప్రతిఫలించేవే. మొత్తానికి స్వభావానికి జ్ఞానసాధన తోడైతే తప్ప మానసిక చైతన్యం సాధ్యం కాదు. జ్ఞానవికసనమన్నా, మేధోవికసనమన్నా ఇదే.
* * *
బౌద్ధిక, మానసిక పరిణతిలో ఆత్మ స్థూల శరీరంగా వర్తిస్తుంది. అధ్యాత్మగా సూక్ష్మ శరీరంలో ఖగోళం నుండి నిర్వాణానికి, నిర్వాణం నుండి పర నిర్వాణానికి, పర నిర్వాణం నుండి మహాపర నిర్వాణానికి ఎదుగుతుంది. అంటే ధ్యానాత్మగా ఈ పరిణామాలలో పయనిస్తూ, విశ్వాత్మగా పరిణమిస్తుంది. ఈ ప్రయాణమే ‘యాస్ట్రల్ ట్రావెల్’. ఈ పరిణామానే్న ‘స్పిరిట్యుయల్ జర్నీ’ అనీ అంటుంటాం. అంటే దేహాత్మ అధ్యాత్మగా విశ్వావరణలలో విస్తృతం కావటం అన్న మాట. నిజానికి ఇవన్నీ యాస్ట్రల్ ప్లేనే్స.

-విశ్వర్షి 93939 33946