AADIVAVRAM - Others

నైసర్గిక వాస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర్రావు (బనగానపల్లి)
ప్రశ్న: మా పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. ఎంత ప్రయత్నించినా కూడా దగ్గర దాకా వచ్చి పోతున్నాయి. దీనికి ఇంటి వాస్తు కారణం అవుతుందా?
జ: తప్పకుండా. మీ ఇంటికి ఉత్తర వాయవ్య దోషం ఉంది. అందువల్లనే మీ పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. ఉత్తర వాయవ్య దోష నివారణ చేసుకోండి. మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయి.
పెంచలయ్య (నిడమానూరు)
ప్రశ్న: నా పేరు రీత్యా నేను ఏ దిశలో ఇంటి నిర్మాణం చేస్తే మంచిది?
జ: పడమర ముఖ ద్వారం మీ పేరు రీత్యా చాలా బాగా యోగిస్తుంది.
శేషాచలం (వనపర్తి)
ప్రశ్న: మా ఇంటికి దక్షిణంలోగల వారి ఇంటి వాటర్ సంప్ మాకు ఆగ్నేయ మూలలోకి వస్తుంది. వాళ్లు ఇటీవలనే ఇంటి నిర్మాణం చేశారు. ఆ ఇంటి నిర్మాణం జరిగిన దగ్గర నుండి మాకు చాలా సమస్యలు వస్తున్నాయి. పక్కవాళ్ల ఇంటి వాస్తు కూడా మా మీద ప్రభావం చూపుతుందా?
జ: దీనిని నైసర్గిక వాస్తు అంటారు. పక్కవారికి ఈశాన్యం కాబట్టి వారు వాటర్ సంప్‌ను నిర్మించుకున్నారు. మీకు ఆగ్నేయం కాబట్టి దానివల్ల మీ ఇంట్లో కేసులు, ఆడవారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనికి సంబంధించి యంత్రాల ద్వారా పరిష్కారం కలదు.
కృపానందం (నిడదవోలు)
ప్రశ్న: మేం స్థలం కొని ఐదు సంవత్సరాలు అయింది. అప్పటి నుండి ఇంటి నిర్మాణం చేద్దామంటే ఏదో ఒక సమస్య వస్తున్నది. కారణం తెలియడం లేదు.
జ: మీరు తీసుకున్న స్థలానికి దోషం ఉంది. ఆ స్థల దోష నివారణ చేయించుకోండి. మీ ఇంటి నిర్మాణం త్వరగా మొదలవుతుంది.
గాయత్రి (ఖమ్మం)
ప్రశ్న: మేము ఒక వ్యాపార సంస్థను ప్రారంభించాం. కానీ అది ప్రారంభించిన దగ్గర నుండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది.
జ: మీరు వ్యాపారం చేసే స్థలానికి సంబంధించి నైరుతి మూల కట్టుబడిలో నైరుతి పెరిగింది. దీనివల్లనే మీ వ్యాపారంలో సమస్యలు, నష్టాలు వస్తున్నాయి. ఆ పెరిగిన నైరుతిని వేరుచేస్తూ ఒక గోడను నిర్మించండి. మీ సమస్యలు తొలగిపోతాయి.
రామానుజాచార్యులు (అనంతపురం)
ప్రశ్న: మేం నివాసం ఉంటున్న ఇంటికి బయట వైపున ‘పుట్ట’ ఉన్నది. అలా వుండవచ్చునా? ఇంట్లో అద్దెకి దిగినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
జ: ‘పుట్ట’ అన్నది ఇంటికి బయట వైపున ఉన్నది అన్నారు. ఆ పుట్ట పాములదా? చీమలదా? చెదలదా? అన్నది తెలుపలేదు. ఇక రెండవ విషయం. ఆగ్నేయ దోషాల వలన మీ ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి. ఆ ఇంట్లో ఆగ్నేయ దోషాలున్నాయి. అద్దె ఇల్లు కాబట్టి ఇంటిని మారండి.
కులకర్ణి (శంషాబాద్)
ప్రశ్న: ఇటీవల మేం డూప్లెక్స్ ఇంటి నిర్మాణం చేసి పైన ఆగ్నేయంలోగల బెడ్‌రూం మా పిల్లలకు ఇచ్చాం. అది ఇచ్చిన దగ్గర నుండి వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది.
జ: ఈ విధంగా చాలామంది తప్పు చేస్తున్నారు. ఆగ్నేయంలో బెడ్‌రూం నిర్మించి అది చిన్నపిల్లలకు ఇస్తున్నారు. దీనివల్ల పిల్లలు పెంకి వాళ్లుగా మారడం, అలాగే చెప్పిన మాట వినకపోవడం, చెడు వ్యసనాలకు బానిసలు కావడం జరుగుతుంది. కాబట్టి పిల్లలను ఆ బెడ్‌రూం నుండి వాయవ్యంలోగల బెడ్‌రూంకి మార్చండి. వారు తిరిగి మీ మాట వినడం జరుగుతుంది.

-వాస్తు శిఖామణి చివుకుల రాఘవేంద్ర శర్మ -96 42 70 61 28