మెయిన్ ఫీచర్

సరైన పోషకాహారంతో ఒత్తిళ్ళు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఉరుకులు, పరుగుల జీవనంలో ప్రతి ఒక్కరూ పలు సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనక తప్పడం లేదు. వీటిని అధిగమించే క్రమంలో మానసిక ఒత్తిడిని తట్టుకుని నిలబడటం కష్టం. ఒత్తిడి వల్ల పలురకాల శారీరక, మానసిక అనారోగ్యాలు అనివార్యమవుతున్నాయి. చాలామంది ఉద్యోగం చేసే చోట ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. అందుకు కారణం- చేరుకోవాల్సిన లక్ష్యాలు, సమావేశాలు,ప్రయాణాలు ఇంకా మరికొన్ని కావొచ్చు. ఒత్తిడిని అధిగమించాలంటే వివిధ రకాల పద్ధతులున్నాయి. యోగా, ధ్యానం, వ్యాయామం, మర్దనా, అరోమా థెరపీ, ఆక్యుపంచర్, మ్యూజిక్ థెరపీ, మానసిక విశ్రాంతి.. ఇలా ఎన్నో పద్ధతులున్నాయి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనది కాకపోతే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒత్తిడి సమస్య మనపైన ప్రభావం చూపుతూనే ఉంటుంది.
మంచి పోషకాలున్న ఆహారం తీసుకునేవారు, శారీరక, మానసిక ఆరోగ్యం కలిగినవారు మాత్రమే ఒత్తిడి నుంచి సమర్థవంతంగా బయటపడగలుగుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఒత్తిడి నుంచి అంత సులువుగా బయటపడలేరు. మనం తీసుకునే ఆహారం సమతులంగా ఉంటే శరీరానికి కావలసిన అన్ని పోషక విలువలు అందుతాయి. దానివల్ల మన శరీరం అన్నింటికీ సిద్ధంగా ఉంటుంది. దేనిపట్లా వ్యతిరేకత ఉండదు. ఒత్తిడి సమస్య వేధిస్తున్నపుడు శరీరంలో నిల్వ ఉన్న పోషకాలను బయటకు వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ప్రొటీన్లు, విటమిన్ ఎ, బి, సిలు శరీరం నుంచి నిష్క్రమిస్తాయి. కొన్నిరకాల ఆహార పదార్థాలు, పానీయాలు శక్తివంతమైనవిగా అనిపించినప్పటికీ, కొన్నిసార్లు అవే ఒత్తిడికి ప్రత్యక్ష కారణాలుగా మారుతాయి. ఆ సమయానికి అవి తీసుకోవటం వల్ల హాయిగా అనిపించినా, ముందు ముందు అవి హానికారకాలుగా మారతాయి. కాఫీలోని కెఫిన్, టీ, చాకొలెట్ వంటివి హార్మోన్లను విడుదల చేసి ఒత్తిడి స్థాయిని ఇంకా పెంచుతాయి. వీటిని తక్కువ మోతాదులో తీసుకోగలిగితే అంత ప్రమాదం ఉండదని వైద్య నిపుణులు అంటున్నారు.
అరటిపండు, గ్రీన్ టీ, నిమ్మరసం, పాలు, ఆరెంజ్, ఓట్స్, బ్లూబెర్రి, వెన్న, బియ్యప్పిండి, బాదాం మొదలైన ఆహార పదార్థాలు ఒత్తిడిని తగ్గించటానికి దోహదపడతాయి. సర్వసాధారణంగా మనం విటమిన్- సిని రోగనిరోధక శక్తి వృద్ధికి, అలర్జీల నివారణకు వాడతాం. విటమిన్-సి ఒత్తిడిని, అలసటను తగ్గిస్తుందని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది. నిమ్మరసాన్ని తరచూ తీసుకుంటే విటమిన్-సి అధిక మోతాదులో శరీరానికి అందుతుంది.
అరటిపండులో ఒక రకమైన ప్రొటీన్ ‘సెరొటోనిక్’గా మారి మానసికంగా సంతోషాన్ని కలిగించి, అలసట నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. పాలు, విటమిన్ బి2, బి12లలో ఉండే ప్రొటీన్లు, కాల్షియం కూడా ఒత్తిడిని దూరం చేస్తాయి. కండరాలకు ఇవి మేలు చేస్తాయి. ఒత్తిడి నుంచి బయటపడేందుకు చాలామంది విరివిగా కాఫీ సేవిస్తుంటారు. దీనికి బదులు కొన్ని పద్ధతులు ఆచరిస్తే మానసిక ఉత్తేజం పొందే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
* రోజూ తొందరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి.
* ఉదయానే్న నడక, వ్యాయామం చేస్తుండాలి.
* చేతులను వెనకకు పెట్టి భుజాలను సాగేలా చేయండి.
* ఏ మాత్రం సమయం దొరికినా ఇంట్లోనే సులభమైన యోగాసనాలు వేస్తుండాలి.
* మార్కెట్‌కు, ఆఫీసుకు సైకిల్‌పై వెళ్తుండాలి.
* అందరిలో కలిసిపోతూ మనసారా నవ్వేందుకు యత్నించాలి.
* ఊపిరి బాగా పీల్చి వదలండి.
* టీవీ చూడకుండా ఒక సాయంత్రం గడపండి.
* ఆటలకు సమయం కేటాయించండి.
* ఒక సమయంలో ఒక పని మాత్రమే చేస్తుంటే ఏకాగ్రత కుదురుతుంది.
* కోపం, ఆగ్రహం వంటి భావావేశాలు కలిగినపుడు వౌనంగా ఉంటే ఒత్తిడి తగ్గుతుంది.

-మనస్విని