ఆంధ్రప్రదేశ్‌

ఒడిశా వైపు కదులుతున్న వాయుగుండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చి దిశను మార్చుకుని ఒడిశా వైపు కదులుతోంది. ఫలితంగా కోస్తాంధ్ర ప్రాంతంలో రాబోయే 24 గంటల్లో తుపాను ఏర్పడే ప్రమాదం ఉందని ఇక్కడి వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుపానుగా మారితే తీర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వానలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఎపి ప్రభుత్వం తీర ప్రాంత జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ, గంగవరం పోర్టుల్లో ప్రమాద సూచికలను ఎగురవేశారు.