రాష్ట్రీయం

కాళోజీ వర్శిటీ విసిగా కరుణాకర్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, నవంబర్ 26: వరంగల్ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ప్రొఫెసర్ బి కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ, శాశ్వత విసి నియమించే వరకు కొనసాగాలని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం గురువారం జివో జారీ చేసింది. ప్రస్తుతం ప్రొ.కరుణాకర్‌రెడ్డి వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ జనరల్ సర్జరీ విభాగం అధిపతిగా, సూపరింటెండెంట్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అటవీ అభివృద్ధి సంస్థ ఎండిగా డికె పాండే
హైదరాబాద్, నవంబర్ 26: తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌గా ఐఎఫ్‌ఎస్ అధికారి డి.కె.పాండేను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నేడు చండీయాగానికి కెసిఆర్ ప్రత్యేక పూజలు
హైదరాబాద్, నవంబర్ 26: ఆయత మహా చండీయాగం నిర్వహించడానికి ముందు శుక్రవారం తెల్లవారు జామున తన ఫాం హౌస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆయత మహా చండీయాగం నిర్వహించనున్నారు. దేశంలో అరుదుగా నిర్వహించే ఆయత మహాచండీయాగం నిర్వహించడానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మహాయాగానికి రాష్టప్రతి, పలు రాష్ట్రాల గవర్నర్లు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులను ఆహ్వానించనున్నారు.

అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీసులకు యూనిఫాం వెసులుబాటు ఇవ్వాలి
సిఎం కెసిఆర్‌ను కోరిన బిజెపి నేత కిషన్‌రెడ్డి
హైదరామాద్, నవంబర్ 26: అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీసు సిబ్బందికి యూనిఫాం ధరించడంపై వెసులుబాటు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కోరారు. ఈ మేరకు సిఎంకు లేఖ రాసినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. 45 రోజుల పాటు చేపట్టే ఈ దీక్ష సందర్భంగా నల్లటి వస్త్రాలు ధరించడం తప్పనిసరి అయినందున వారికి యూనిఫాం ధరించే వెసులుబాటు కల్పించాలని సిఎంను కోరారు. అయ్యప్ప దీక్షలో మరింత క్రమశిక్షణతో, అంకితభావంతో భక్తులు తమ తమ వృత్తుల్లో పని చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. నల్లటి వస్త్రాలతో పాటు పోలీసు యూనిఫాం ధరిస్తూ కాళ్లకు బూట్లు వేసుకోకుండా పని చేస్తున్నారని తెలిపారు.

ఏపిలో ఇద్దరు ఐపిఎస్‌ల బదీలీ
హైదరాబాద్, నవంబర్ 26: ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ఎస్పీలను బదిలీ చేస్తూ గురువారం డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్‌సి వెయిటింగ్‌లో ఉన్న ఎస్పీ ప్రకాష్ జాదవ్‌ను యాంటీ ఎర్రచందనం స్మగ్లింగ్ టాస్క్ఫోర్స్(తిరుపతి)కి బదిలీ చేశారు. అదేవిధంగా వెయిటింగ్‌లోనే ఉన్న టి జనార్దన్ సిఐడి విభాగం ఎస్పీగా బదిలీ అయ్యారు.