జాతీయ వార్తలు

‘విసిలను తక్షణమే భర్తీ చేయండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: తెలంగాణసహా దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న వైస్‌చాన్సలర్ పోస్టులను ఒక నిర్ణీత వ్యవధిలో భర్తీ చేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించాలని కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ధారించిన వ్యవధిలోగా ఉపకులపతుల నియామకాలు జరగని పక్షంలో విశ్వవిద్యాయాలకు అందవలసిన నిధులను నిలిపివేయవలసిందిగా ఆయన ప్రభుత్వానికి సూచించారు. వైస్ చాన్సలర్లను నియమించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని ఆయన రాజ్యసభలోప్రతిపాదించిన ఒక ప్రత్యేక తీర్మానంలో తెలిపారు. తెలంగాణాలోని అతి పురాతనమైన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వైస్‌చాన్సలర్ లేడని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.