జాతీయ వార్తలు

పుకార్లను నమ్మవద్దు:వీసీ నజ్మా అక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జామాయా మిలియా యూనివర్శిటీలో నిన్న జరిగిన సంఘటనలు దురదృష్టకరమని, పుకార్లను నమ్మవద్దని వైస్ చాన్సలర్ నజ్మా అక్టర్ అన్నారు. ఆమె ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్న జరిగిన సంఘటనల వల్ల జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో ఆలోచించుకోవాలని, ఇది భావోద్వేగాలకు సంబంధించినదని, ఈ విషయంలో ఎంతో కోల్పోయామని అన్నారు. అలాగే నిన్న జరిగిన సంఘటనల్లో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు అని వస్తున్న వార్తలో నిజం లేదని, ఎలాంటి పుకార్లు నమ్మవద్దని అన్నారు. ఈ వార్తను తాము పూర్తిగా ఖండిస్తున్నామని, నిన్న జరిగిన ఘటనలో 200 మంది విద్యార్థులు గాయపడగా అందులో ఎక్కువ మంది మా విద్యార్థులేనని అన్నారు. వర్శిటీ క్యాంపస్‌లో పోలీసులు కాల్పులు జరిపారని వస్తున్న వార్తలపై యూనివర్శిటీ రిజిస్ట్రార్ సిద్దిఖీ స్పందించారు. కాల్పుల విషయమై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసులతో మాట్లాడామని వారంతా కాల్పుల విషయాన్ని ఖండించారని, సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయని, వాటిని ఖండించలేం, అంగీకరించలేం అని అన్నారు.