మహబూబ్‌నగర్

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 1: 2016 నూతన సంవత్సర వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి అంధుల పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. అంథ విద్యార్థులతో కలసి నూతన సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అంతేకాకుండా కలెక్టర్ కార్యాలయంలో వారి సిబ్బందితో కలసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టర్‌ను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విశ్వప్రసాద్ 2016కేక్‌ను కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకున్నారు. పోలీస్ సిబ్బందితో కలసి ఆయన ఉత్సాహంగా గడిపారు. ఇదిలా ఉండగా అంథుల పాఠశాలలో కలెక్టర్ టికె శ్రీదేవి 2016 నూతన సంవత్సరం కేక్‌ను కట్ చేసి విద్యార్థులకు కేక్‌ను తినిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంథ విద్యార్థులు ఆధైర్య పడకుండా ధైర్యంతో ముందుకు వెళ్లితే అన్నింటిలో రాణిస్తారని సూచించారు. ఇలాంటి విద్యార్థులకు అందరూ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. జిల్లాలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్నందున పెంపొందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని అన్నారు. జిల్లాలో చదువుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండడంతో అభివృద్ధి విషయాలు కూడా ప్రజలకు తెలియడం లేదని అన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారి సిబ్బందిని ఉద్దేశించి కూడా కలెక్టర్ మాట్లాడుతూ నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాలని ప్రజల మన్ననలను మరింత పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు. పోలీసుల కుటుంబాలు అభివృద్ధి చెందాలని, వారి పిల్లలందరు ఉన్నత చదువులు చదివి పోలీస్ శాఖకు మంచిపేరు తీసుకురావాలని తెలిపారు. జిల్లాలో నేరగాళ్లను అరికట్టడం జరుగుతుందని నిరంతరం గతంలో నేరాలు చేసిన వారిపై నిఘా ఉంటుందని తెలిపారు. జిల్లా ప్రజలకు 2016నూతన సంవత్సర శుభాకాంక్షలు జిల్లా పోలీసుల తరపున తాను ప్రత్యేకంగా తెలుపుతున్నట్లు వెల్లడించారు. 2016సంవత్సరంలో జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి సైతం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కొత్వాల్ నూతన సంవత్సరం కేక్‌ను కట్ చేశారు. టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌పి వెంకటేష్ కేక్‌ను కట్ చేశారు. కలెక్టర్‌కు పోలీసులు శుభాకాంక్షలు తెలుపగా వివిధ శాఖల అధికారులు ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా నూతన సంవత్సరం సందర్భంగా ఎన్నడూ లేనివిధంగా దేవాలయాలకు భక్తులో పోటెత్తారు. తెల్లవారుజాము నుండే ప్రధాన దేవాలయాల దగ్గర క్యూలో దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మన్యంకొండ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వేలాదిమంది భక్తులు తరలిరావడంతో మన్యంకొండ గోవింద నామస్మరణతో మారుమోగింది. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.