భయపెట్టని హారర్ సినిమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీడ్కోలు - 2015

తెలుగునాట వెండితెరపై ఈ ఏడాది కొన్ని ప్రయోగాలు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా బాహుబలి, రుద్రమదేవి వంటి చిత్రాలు తెలుగు చిత్రసీమకు గొప్ప ఖ్యాతిని అందించాయి. చారిత్రక కథలు, జీవితచరిత్రలు, సందేశాత్మక చిత్రాలకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. గతంకన్నా ఎక్కువ సంఖ్యలో వచ్చిన కుటుంబకథా చిత్రాలకు జనం నీరాజనం పట్టారు. హీరోల పేరునుబట్టి కాక, సినిమాల్లో కథాబలం ఉన్నవాటిని ఆదరించారు. మరోవైపు ఎప్పటిలా ప్రేమకథల ఫార్ములాతో సినిమాలు తామరతంపరగా వచ్చినా ప్రేక్షకుల మదిని దోచినవి ఒకటీఅరా మాత్రమే. ఇక ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది హారర్ జోనర్‌లో దాదాపు 50 సినిమాలు వచ్చాయి. అందులోనూ చెప్పుకోదగ్గ విజయం సాధించినవి నాలుగైదుకు మించిలేవు.

ఒక్కసారిగా ఆకాశంలోంచి పిడుగులు పడుతున్నాయి. ఆ మంటలు ఎక్కడినుంచి వస్తున్నాయో తెలియని హీరోహీరోయిన్లు భయంతో పరుగెడుతున్నారు. వారి క్లోజప్ షాట్స్‌లో భయంతో వారి అణువణువూ వణుకుతున్న సీన్ కనిపిస్తోంది. తర్వాత ఏం జరగబోతోందో వారికి అర్థంకావడం లేదు. ప్రేక్షకుడికి కూడా అర్థం కావడంలేదు. ఒక్కసారిగా స్క్రీన్‌పైకి దయ్యం వచ్చి, వాళ్లిద్దర్నీ గుండెలు అదిరేలా భయపెడుతుంది. ఆ సీన్ చూసి ప్రేక్షకుడు కూడా భయం తాలూకు థ్రిల్లింగ్ అనుభూతితో ఆనందిస్తాడు. ఇటువంటి ఆనందంకోసమే హారర్ థ్రిల్లర్ సినిమాలకు పొలోమంటూ తెలుగు ప్రేక్షకులు థియేటర్ వైపునకు వెళ్తున్నారు. ఇటువంటి జోనర్‌లో సినిమాలు రూపొందించే కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. వీరికి ప్రేక్షకుడిని ఎలా భయపెట్టడమా అనేదే అసలు విషయం. దీనికోసం ఎటువంటి సినిమాలనైనా తీస్తున్నారు. హారర్ సినిమాలు గతంలో వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి. భవిష్యత్‌లో కూడా మళ్లీ రాకుండా అంత చెత్తగా ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు. హారర్ సినిమాలు అంటే మినిమమ్ భయం కలిగేలా చిత్రాన్ని తీయలేకపోతున్నారు. గతంలో దొరికిన అనుభూతి ఈ సంవత్సరం విడుదలైన హారర్ థ్రిల్లర్స్ చిత్రాలలో దొరకడం లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఈ సంవత్సరం జనవరి నుండి ప్రారంభించి, దాదాపుగా 30 నుండి 40 చిత్రాలు హారర్ జోనర్‌లో విడుదలయ్యాయి. ఇందులో ప్రతి చిత్రంలో కూడా ప్రేక్షకుడిని భయపెడతామని చెప్పారు. కానీ గతంలో వచ్చిన అనేక చిత్రాల కలగూరగంప కథలతో సినిమా ఉండడంతో, చూసే ప్రేక్షకుడికి గతంలో చూసిన సినిమాలు గుర్తుకు వచ్చి ఏమాత్రం భయపడక సినిమాలను తిప్పికొట్టాడు. ఒక మంచి షాట్ ఉంటే చాలు, ఆ షాట్‌లో భయం కలిగితే చాలు.. ప్రేక్షకుడు ఆ చిత్రానికి పట్టం కట్టాడు. ఈ సంవత్సరం విడుదలైన అనేక హారర్ చిత్రాలలో ‘రాజుగారి గది’, ‘పాప’ చిత్రాలు మాత్రమే ప్రేక్షకులకు నచ్చాయి. ‘రాజుగారి గది’ డైరెక్ట్ తెలుగు చిత్రం కాగా, ‘పాప’ తమిళం నుండి వచ్చిన ‘ఉనక్కెన్నవేండుమ్‌సొల్లు’ చిత్రానికి అనువాదం. ఇక్కడ డబ్బింగ్, స్ట్రయిట్ అన్న తేడా ప్రేక్షకుడికి లేదు. విషయం సినిమాలో వుండి నచ్చితే హిట్ చేశాడు. వరదలా వస్తున్న చిత్రాలను తిప్పి కొట్టాడు. ఒక్క హారర్ సినిమా హిట్టయితే అటువంటి జిరాక్స్ కాపీలు టాలీవుడ్‌లో కథాకథనాలు లేకుండా చుట్టేయడమే ఈ వ్యతిరేకతకు కారణవౌతోంది. హారర్ సినిమా అనగానే అందులో అమ్మాయిలను అర్ధనగ్నంగా చూపించే కథనాలు ప్రత్యేకంగా అల్లుతున్నారు. ఓ రకంగా సెక్స్‌ను ప్రేరేపించేలా ఈ కథలు ఉంటున్నాయి. దయ్యాల బారిన పడేది ఎక్కువగా అమ్మాయిలే ఉండడం ఆయా కథలల్లో ప్రత్యేకత. ఆ అమ్మాయిల నరక యాతనను ప్రత్యేకంగా చిత్రీకరించి, హారర్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు అని వదిలేయడం పరిపాటి అయింది. 2015లో కూడా ఇటువంటి చిత్రాలే ఎక్కువగా రూపొందించారు. గతంలో విడుదలైన అనేక చిత్రాలకు రీమేక్‌గా, అదే కథాకథనాలతో కేవలం ఓ గెస్ట్‌హౌస్‌లోనో, ఓ ఫామ్‌హౌస్‌లోలో సినిమా అంతా తక్కువ బడ్జెట్‌లో చుట్టేసి, ఎక్కువ లాభాలు రావడంకోసం ఇతర భాషల్లో కూడా అనువాదం చేసి, వదులుతున్నారు. ముఖ్యంగా ఇట్లా చేయడంతో ఆయా సినిమాలకు మినిమమ్ గ్యారంటీ ఉండడంతో నిర్మాతలు సేఫ్ జోన్‌గా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా కొత్తగా వచ్చే దర్శకులు హారర్ జోనర్‌ను సేఫ్ కథగా ఎన్నుకుని అల్లుకుని నిర్మాతలను సంప్రదించడం ఈ సంవత్సరం బాగా కనిపించింది. హారర్ సినిమాల కథలలో ప్రారంభం బాగానే వుంటుంది. కొద్దోగొప్పో హారర్ సన్నివేశాలు ప్రేక్షకుణ్ణి కట్టిపడేస్తాయి. ముగింపు మాత్రం చప్పగా తేల్చేస్తున్నారు. సమస్యకు పరిష్కారాన్ని పేలవంగా చిత్రీకరించడంతో ఆ సినిమాలు ఢమాల్‌మంటున్నాయి. ఈ సంవత్సరం ‘గంగ’, ‘త్రిపుర’, ‘కాకి’, ‘పిశాచి’, ‘చంద్రకళ’,‘మాయ’,‘బుడుగు’,‘మయూరి’, ‘కాలింగ్‌బెల్’, ‘ప్రమాదం’, ‘ఆ ఇంట్లో దయ్యం వుందా’, ‘అవును-2’, ‘చంద్రిక’, ‘కల్పన గెస్ట్‌హౌస్’లాంటి చిత్రాలు హారర్ జోనర్‌లో ప్రేక్షకుల్ని పలకరించాయి. ‘365డేస్’, ‘కిక్-2’, ‘చీకటి రాజ్యం’ చిత్రాలు కూడా థ్రిల్లర్ జోనర్‌లోనే వచ్చాయి కానీ, వచ్చినట్లే వెళ్లిపోయాయి. మా సినిమా ఒంటరిగా చూస్తే బహుమతులిస్తామని గతంలో ప్రకటించినా, అలా చూస్తామని ఎవరూ రాలేదు, ఆ బహుమతులెవరూ పొందలేదు. కానీ ఈ సంవత్సరం హారర్ సినిమా చూస్తూ గుండెపోటుతో ఓ ప్రేక్షకుడు చనిపోయిన సంఘటన విస్తుగొలిపింది. హారర్ సినిమాలు ప్రేక్షకుడికి భయంతోపాటు చిన్న ఆనందాన్ని ఇస్తే పరవాలేదు. కానీ ప్రేక్షకుల్ని ఏదో మభ్యపెట్టి, ప్రాణాలు పోయేంతగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. దర్శక నిర్మాతలు ఆ దిశగా సినిమాలను చుట్టే ప్రక్రియకు కామాపెట్టి, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేలా సినిమాలు రూపొందించడం అందరికీ మంచిది!

-జి.ఆర్.ఆర్