వీరాజీయం

ఇప్పుడు వీస్తున్నది.. ‘ఫ్యాన్’ గాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయిపోయింది. గేమ్ ఈజ్ ఓవర్! అయినా ఓడిన పార్టీల నేతలు చాలా కాలం గాయాలు మానేదాకా- గోల్‌మాల్ జరిగిందీ అనీ, ప్రత్యర్థి పార్టీ వారు అన్యాయంగా గెలిచేశారనీ- ‘ ఫౌల్.. ఫౌల్’ అంటూ అరుస్తూనే వుంటారు. ‘ఏక్ దివసీయ’ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో- డి.ఆర్.ఎస్. సౌకర్యం వున్నట్లు- ఎన్నికల ఫలితాల విషయంలో- వెంటనే యిలా అరచెయ్యి ఎత్తి పెట్టి, రెండో చేత్తో పిడికిలి పెట్టి గుద్దితే, ఎలక్ట్రానిక్ రీప్లేలు వచ్చేయవుకదా! అంతా ఈవీఎంల లీల అంటారా? అదీ పాత పాటే అయిపోయింది. కొన్ని రాష్ట్రాలలో ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్‌లో ఈవీఎంలు మోదీకీ, భాజపాకు ఎన్నో ఓట్లు వేయించింది అంటారా?... భలే! పడ్డ ఓట్లలో యాభై శాతం వాటాను వైఎస్సార్ కాంగ్రెస్ దోచుకుందిగా! మోదీజీకి అక్కడ కేంద్రంలో లభించిన బండ మెజారిటీ లాంటిదే, ఇక్కడ వైకాపాకు అంటే ‘జగన్’ పేరుకీ లభించింది.
తాజా ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని మలుపు తిరిగాయి. ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి క్రెడిట్ దేవుడికీ, జనాలకీ చెరిసగం పంచేస్తున్నాడు. దేవుడి సంగతి ఏమోగానీ, జనాలు మాత్రం కొందరు- ‘డబ్బండీ! డబ్బు! అంతా డబ్బు మహిమ!’ అన్నారు. జనాలు పైసల్ని రకరకాల మార్గాలలో తీసుకుని వోట్లు వేశారు అన్నారు ఎందరో. సరే! అదీ నిజమే అంటున్నది ఇప్పుడు- సీఎమ్‌ఎస్ అనే అంచనాల సంస్థ. సీఎమ్‌ఎస్ అంటే ‘‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్’’. ఈ సంస్థ చాలా పద్ధతులలో ఎన్నికల వ్యయాన్ని- జనాలకు అందినదన్న పైకం వివరాలనీ కూడా- మధించి మధించి ఒక ప్రకటన చేసింది. పైసలు పంచి పెట్టడంలో- ఓడిపోయిన పార్టీలు కూడా ఏమీ తీసిపోలేదు. పైగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ బాగా పాతుకుపోయి- అధికారంలో వుండి మరీ ఎన్నికలలో పోటీ చేసింది.
జగన్ గెలిచిన తర్వాత ఇంతవరకూ తన మాట మార్చలేదు. దేశంలో వున్న వివిధ కార్పొరేట్ టీవీ చానల్స్‌కీ, బీబీసీకి కూడా ఇంటర్‌వ్యూలు యిస్తూ- ‘‘నాకు ఒక్కటే ధ్యేయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరాలి. ఆ ఒక్క విషయంలో రాజీ లేదు. దానికోసం నేను పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు కొనసాగిస్తూనే వుంటాను’’, అని ప్రకటిస్తూనే వున్నాడు.
‘‘విభజన కారణంగా ఏపీకి తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు ‘అప్పు’- వాటాగా వచ్చింది. అది వడ్డీతో తడిసి మోపెడు అయింది. నెలనెలా ఇరవై వేల కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నాం’’ అంటూ ఆవేదనని ‘వైఎస్సార్ పుత్రుడు’- శషభిషలు లేకుండా వ్యక్తం చేస్తూనే వున్నాడు. చివరికి మోదీ పార్టీ సీట్లు ‘జైత్రయాత్ర’లో రెండువందల యాభై సీట్ల దగ్గర ఆగినా బాగుణ్ను..’ అన్నాడీ యువ ముఖ్యమంత్రి. అవతల నించి, రుూ దక్షిణాది తెలుగు రాష్ట్రాలు రెండింటినీ కూడా మోదీ తన ఎన్‌డీఏలో చేరమని కన్నుగీటుతూనే వున్నది. ఇరవై మూడు ఎంపీ సీట్లుగల వై.సి.పి. మామూలుగా అయితే, అతి పెద్ద ప్రతిపక్ష పార్టీలలో పెద్దపీట వేయించుకునేదే. కానీ, జగన్ ఆవేదన అంతా కేంద్రంలో మోదీ గవర్నమెంటుకి తన మద్దతు అక్కరలేకుండా పోయిందనే. మద్దతు అవసరమై ఉంటే ‘మా సపోర్టు కావాలీ అంటే ముందు మాకు ‘స్పెషల్ స్టాటస్’ని ప్రకటించాలి’ అని మోదీని డిమాండు చేసేవాణ్నికదా?’’ అన్న మాటలే వొత్తి పలుకుతున్నాడు తప్ప- పబ్లిక్‌గా గానీ, ప్రయివేటుగా గానీ, కేంద్రంలో ఓ రెండు మంత్రి పదవులు లభిస్తే- మన రాష్ట్రానికి మేలు సంపాదించగలం అన్న థియరీని యింతవరకూ వ్యక్తం చేయడం లేదు. ‘‘ఒక రకంగా మొన్నటి ఎన్నికల ఫలితాలను దీర్ఘంగా విశే్లషించి చూస్తే తప్ప- దీని వెనుక గల రహస్యం బయటికి రాదు’’ అన్నాడో సీనియర్ సిటిజన్. అట్లా అనుకుంటే ‘‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్’’ వారు రిలీజ్ చేసిన ఎన్నికల వ్యయం చూడవచ్చును. అందులో అధికారిక లెక్కలు, అనధికార లావాదేవీలు, చిట్టా ఆవర్జాలు కూడా వున్నాయి. ‘‘దీని నిజాయితీ ఎంత?’’ అన్నాడో తటస్థ వోటరు. ‘‘నాకు ఒక్కడు కూడా పైసా యివ్వలేదు. ఇస్తానని కూడా అనలేదు,’’ అంటూ కొంత మనస్తాపం దాచుకుంటూ మాట్లాడేడు కూడాను...
ఔను! ఈవీఎంలు అన్నీ మోసం చేయలేదు అంటే- ‘వాటిని నమ్మనివాడిని..’ అని అన్నాడతను. పార్టీల దగ్గర కొందరు జనాలు డబ్బులు తీసుకోలేదు. ‘‘వోట్లు వేశారు’’ అంటే నమ్మడానికి యిక్కడ రుూ ‘‘సి.ఎం.ఎస్.’’వారి నివేదిక అవకాశం యిస్తోంది. దాన్ని చూసేముందు మరొక్క సంగతి. ‘జగన్ గెలుపునకు సంబంధించి’ చిత్తగిద్దాం. అతని మీద వున్న కేసులు ఏవీ కూడా సామాన్య జనం నమ్మలేదు. అవన్నీ రాజకీయ కక్షతో ‘బనాయించి’- కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ప్రాబల్యంతో- పిటిషనర్‌లు పెట్టినవేనని జనం నమ్మారు’ అన్నది రుూ ఫలితాలు మరీ యింత ఉప్పెనగా రావటానికి కారణం.. నో డౌట్!
అసలీ జగన్ ఎవరు? యిదివరకూ, రుూ యువకుడికున్న స్టాటస్, రాజకీయ అనుభవం ఏమిటి?’’ అని చూశారు జనం. వైఎస్సార్ ముఖ్యమంత్రి.. కాకలు తీరిన కాంగ్రెస్ పార్టీ యోధుడు.. అతని కుమారుడు అన్నది మాత్రమే జగన్‌మోహన్‌రెడ్డి ‘హోదా’. ఏది ఏమయినా జనం- బలం- సానుభూతి మాత్రం వున్నాయి. ‘‘రేపటి వారసుడు’’ అన్న దానికి ప్రాతిపదిక నాడే పడ్డది- అంటే, దానికి రాజశేఖరరెడ్డి కొత్తగా కనిపెట్టిన ‘పాదయాత్ర’ అనే ప్రక్రియ మాత్రమే కారణం. నాడే అక్కడే- ‘జగన్ యువరాజు’ అన్న పునాదులు పడ్డాయి. రాజశేఖరరెడ్డి కారణంగా ‘పాదయాత్ర’ అన్నది ఒక శాంతియుత ఆయుధం అయింది. అతని దుర్మరణం- తర్వాత ముఖ్యమంత్రి పదవిని వారసుడిగా జగన్‌కి అప్పచెప్పే ప్రయత్నాలు ఫలించకపోగా- ‘‘తిరుగుబాటు పార్టీ’’ పెట్టడం పర్యవసానం అయింది. అదే మొదలు- వైఎస్‌ఆర్ తనయుని రాజకీయ ఆరంగేట్రం. అంతులేని పోరాటం- సంభవించాయి వడివడిగా...
ఈ ఎన్నికలకు ముందు, ‘జైలు-బెయిలు’ మధ్యన నలుగుతూ కూడా ఈ యువకుడు- ‘ఓదార్పు యాత్ర’- చేశాడు. ఆనక, యిటీవల ప్రజాసంకల్పయాత్ర- రెండూ చేయడం చరిత్రాత్మకమయిన రికార్డు- 341 రోజులు నిర్విరామంగా 3,648 కిలోమీటర్లు- అక్షరాలా కాలికి బలపాలు కట్టుకుని ‘పర్యటించాడు’. ఆ ‘బాలగోపాలం’ దానికి ‘్ఫదా’అయినారన్నది రుూ ఎన్నికల ఫలితాలలో- ప్రధానంగా కనబడుతున్న ‘ఫ్యాక్టరు’. ఒకసారి సెంటర్ ఫర్ మీడియా రిపోర్టు చూద్దాం. మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ - ఎస్‌వై ఖురేషీ దీనికి ‘కితాబు’ కూడా యిచ్చారు. దేశంలో ఈ ఎన్నికలకి మొత్తం అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చయినాయి. అంటే ముందుసారి ఎన్నికల వ్యయానికి యిది ‘డబుల్’ అన్న మాట. ఆంధ్రాలోని 175 అసెంబ్లీ స్థానాలకీ ఎన్నికలు జరుగగా- అందులో సగం నియోజకవర్గాలలో అంటే- 75 నుంచి 80 స్థానాలలో, ఓటర్లకు నేరుగానో, పరోక్షంగానో, నగదు నజరానాగా ముట్టింది. అంటే మిగతా చాలామంది ఓటర్లకు, యే పార్టీ నుంచీ ‘‘రూకలు’’ అందకపోయినా, వాళ్లు ‘వోట్లు’ క్యూలో నిలబడి వేశారు అని అర్థం. నిజానికి, అంచనాల ప్రకారం- రాష్ట్రంలో, ప్రతీ అభ్యర్థీ- పాపం.. వోడినా, గెలిచినా నలభై శాతం ఖర్చు భరించాడు. కొంతమంది లక్కీ ఓటర్లకు- రెండు పార్టీలే కాదు- ‘‘నేనే నెంబర్ వన్’’, అంటూ దిగిన మూడో పార్టీ కూడా యథాశక్తి పైసలు ‘తాయిలం’గా పంచిపెట్టారు అన్నది జన వాక్యం.
సంపన్న జిల్లాలు- ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రక్కనే గల ప్రకాశం జిల్లాల్లో గరిష్టంగా అరవై అయిదు శాతం వోటర్లు- ఓటు ఒక్కంటికీ రెండు వేల నుంచీ నాలుగు వేల దాకా నజరానాలు అందుకున్నారు. అందుకే, ఓడిన శాల్తీలు అంత ‘‘డీలా’’పడిపోయారు. అంచేత పైసలు అందని ఓటర్లు కూడా తమ వేలి మీద ‘ముద్ర’ వేయించుకున్నారు అన్నది నిజం. అంచేత అలాంటి వోటర్లు ‘ప్రజాస్వామ్య విజయంలో మాదే ముఖ్యమయిన పాత్ర’ అని అనుకోవచ్చును- అంచేత గర్వించాడు...జగన్‌కి పరిస్థితులు కలిసివచ్చాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ జగన్ మాటలకి ‘సై’, ‘జై’ అనడం- రేపు పార్లమెంటులో ‘‘ఉభయ తారకం’’- కాగలదు. ఇక జగన్‌మోహన్‌రెడ్డి ‘ఫ్యాన్’ యిప్పుడు తాను చెబుతున్న పాలన విషయంలో జయం పొందగల అవకాశ పవనాల్నే వీస్తున్నది.. తథాస్తు.
లెట్ దేర్ బి పీస్ అండ్ ప్రోగ్రెస్... ఆమెన్..!

-వీరాజీveeraji.columnist@gmail.com 92900 99512