వీరాజీయం

దేవుడి హుండీ రమ్మంటోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి.ఆర్. అన్నట్లు- ‘‘దాన్నంతటినీ నల్లధనం అనకండి. లెక్కలోకి రాని కష్టార్జితమే అదంతా’’. దేశంలో యివాళ విచిత్రమైన పద్ధతి నెలకొని వుంది. బ్లాక్‌మనీ, వైట్‌మనీ, మూడోది ‘రెడ్‌మనీ’అంటే రక్తాన్ని చెమట చేసి- అవాంతర, అత్యవసర ఖర్చులు, పండుగలు, పబ్బాలకోసం- ధర తగ్గంగానే బంగారం కొని, ఆడపిల్లలకిద్దాం’- లాంటి మమకార బుద్ధులతో దాచిన అయిదొందలు, వెయ్యి నోట్ల కట్టలున్న కరెన్సీ నోట్లు అన్నింటినీ తీసి, దండలు గ్రుచ్చి తమ అభిమాన నటుల మెడలో వేస్తేనో?
‘‘లోగడ మాయావతీజీకి కరెన్సీ దండలేగా వేసేవారు’’- అనడిగాడో టిఫిన్ సెంటర్ వాలా.
‘కానీ యిప్పుడు మోదీగారి మెడలో వేసినా, అయిదొందలు, వెయ్యి రూపాయలూ చెల్లవ్’’- అని చెప్పాను. ‘‘సంసారులదేముంది సార్? క్యూలు తగ్గంగానే, సేవింగ్స్ అకౌంట్‌లో వేసుకుంటారు. ఏలినవారి దయగలిగి- కొత్త నోట్లు బ్యాంకుల స్ట్రాంగ్‌రూమ్స్‌లో చేరినప్పుడు తిరిగి తీసుకుని వాడుకుంటారు’’- అని చెప్పిందో టీచరమ్మ. కానీ ధర్మదాతలెందరో, నేలమాళిగలలో పాతర వేసిన నోట్లకట్టలమాటేమిటి?
‘‘వాటిని ధర్మకార్యాలకి డొనేషన్లుగా యిచ్చేస్తే బెటర్ కదా?’’ అనడిగాడో వడ్డీవ్యాపారి. అయితే, మందిర్ మస్‌జిద్, గురుద్వారాలలో కూడా డొనేషన్స్‌గా పాత నోట్లు తీసుకోవద్దని గవర్నమెంటు ఆర్డర్లు వేసింది.’’ పాత నోట్లని బ్యాంకులలో వేసుకోవాల్సిందే’- నంటుంది ఆర్థికశాఖ. అంచేత అందరికీ నల్లధనం- లెక్కకురాని డబ్బు చీరల అడుగున, వంట యింట, క్యారియర్ గినె్నల్లో, కుక్కిన దాచిన డబ్బు- యిదంతా సార్థకం చేసుకోవాలీ అంటే - ‘ఇహా’ని కి కాకపోయినా ‘పరా’నికి స్వర్గంలో ఓ సీటు రిజర్వేషన్ పనికొస్తే అదే పదివేలు’’- అన్నాడో పెద్దమనిషి. పైగా ఆ ‘పదివేలు’ అన్నమాట, ‘‘నాలుగు కొత్త రెండువేల నోట్లతో కలవాలి’అని కూడా, నాలిక్కర్చుకుని మరీ చెప్పాడు.
‘‘పల్లీలు, మిరపకాయ బజ్జీలు కట్టండి. పిల్లలు ఆడుకునేందుకు పడవలు చేసి, నీటి తొట్టెలో వేయమనండి’’- లాంటి జోకులు, కార్టూన్లూ కాలక్షేపానికే గానీ గుప్తనిధులున్న ఆసాముల పట్ల రాణించవ్-
స్వర్ణ దేవాలయంలో ఛారిటీ ట్రస్టులూ యిచ్చిన పైకానికి- ఇచ్చిన వారి వివరాలన్నీ నమోదుచేసి, ఆదాయం పన్ను శాఖ వారికి యివ్వాలి కనుక వాళ్లు బహిరంగ డొనేషన్లను చెక్కుల ద్వారా, డ్రాఫ్ట్‌ల ద్వారా అయితే తప్ప స్వీకరించడం మానేశారు. ‘‘కానీ దేవుఁడికి కైంకర్యంగా హుండీలో వేస్తే కళ్లకద్దుకుని, లెక్కపెట్టుకుంటాం’’ - అని చెప్పారు వాళ్లు కూడా.
’’ఈ పరిస్థితులలో ఏంచెయ్యాలి?’’అంటూ రెండురోజులపాటు ఎకనమిక్ ఎడిటర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. దాని హాజరైన రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్ ఆధియాగారు- ‘‘హుండీలలో వేస్తే - అవి ఏ ప్రార్థనాలయాలు అయినా, వాటికి లెక్కలు మేం అడగం’’- అని ముసిముసి నవ్వులతో చెప్పారు.
‘‘వారం రోజులయేసరికి కుప్పలకొద్దీ ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు- తిరుపతి ఏడుకొండలవాడి హుండీలో మొదలు లోకల్ వినాయకుడి గుడిదాకా వచ్చిపడిపోతున్నాయి. దీనివల్ల గవర్నమెంటుకి టాక్సు వెళ్లదుగానీ, జనాలకి ఉపయోగపడతాయి. పుణ్యం పురుషార్ధం రెండూ దక్కుతాయి’’- అన్నాడో మోతుబరి.
ఈవారంలో వడ్డికాసుల వాడి ‘అక్షయపాత్రల’లో (హుండీలకు ముద్దుగా దేవస్థానంవారు పెట్టుకున్న పేరు) రెట్టింపు కానుకలు పడ్డాయి. అనుదినమూ, ఎనభైవేల నుంచీ లక్ష మంది దాకా భక్తులు కొండలన్నీ ‘‘ఎక్కి’’వచ్చి, వడ్డికాసుల వాడికి శక్తికొలదీ హుండీలో పైకం, బంగారం వేస్తూ వుంటారు. ఈ అక్షయ పాత్ర అయిదడుగులు ఎత్తు, మూడడుగుల వెడల్పూ వుంటుంది. అలాంటివి రెండుంటాయి సప్తగిరుల మీద, దేవుని సన్నిధిలో, ఈశాన్య దిక్కుగా- రోజూ సుప్రభాత వేళ ఈ హుండీ కలెక్షన్ల లెక్కలు ప్రకటిస్తారు. అవిప్పుడు రెట్టింపయిపోయి, హుండీలను అత్యవసరంగా ఖాళీచేసి పెట్టాల్సి వస్తోందిట. ‘‘హాయిగా వెంకన్న- గోవిందరాజులుస్వామి వారికి వడ్డీయే కాదు అసలుకూడా తీర్చివేయవచ్చును’’- అన్నాడో భక్తుడు.
అదే మాదిరిగా, ‘ఎంత చెట్టుకి అంతగాలి’అన్నట్లు - ఎంత దేవుడికి అంత ఆదాయం పాత నోట్ల రూపంలో వస్తోంది. కనకదుర్గమ్మ దేవాలయంలో హుండీ కానుకలు (ఇది అన్ అకౌంటెడ్ మణీ అనొచ్చా?) రెట్టింపుగా, యిబ్బడిముబ్బడిగా పడ్డాయని దేవస్థానం చెబుతోంది. మామూలుకన్నా అమ్మవారి హుండీ ఆదాయం దినసరి కోటి రూపాయలు పెరిగిందిట. అందులో కొన్ని కొత్త రెండువేల కాయితాలు కూడా వున్నాయి గానీ, వేలు, ఐదొందలూ కుప్పలుకుప్పలుగా పడ్డాయి. అయితే వీటి లెక్కలు కూడా అట్టేపెట్టమని అడుగుతోంది గవర్నమెంట్. త్వరలో వెయ్యి నోటు చూసే ఛాన్సు లేదంటున్నాడు జైట్లీ. ‘‘పోనీ రుూ వెయ్యి నోట్ల కట్టలకి వీడియోలు తీసి, దేవాలయ తెరమీద చూపిస్తే, భక్తుల కనులు మెరుస్తాయిగా?’’అన్నదొక బామ్మగారు, ఆఖరిసారి కళ్లకు అద్దుకుని, వెయ్యినోటు హుండీలో పడేస్తూ. ఐతే, రుూ నోట్లకట్టలన్నీ బ్యాంకులలో కొత్త కరెన్సీగా మార్చుకోడానికి గడువు డిసెంబర్ 30తో ముగుస్తుందా? లేక ఆనక కూడా- హుండీ నోట్లకు బ్యాంకుల తలుపులు తెరిచే వుంటాయా?’’ ఇది శ్రీ మోదీగారి ఆశీస్సులతో- శ్రీమాన్ అరుణ్‌జైట్లీగారే చెప్పాలి-
‘‘చెల్లని నోట్లతో యివాళ, యించక్కా పుణ్యం కొనుక్కోవచ్చు. ఎందుకు వర్రీ?’’అంటూ దేవాలయాల అధికార వర్గాలు మొబైల్ సందేశాలు పంపిస్తే సరి.
చాలామంది తిరుపతి దారిఖర్చులకి, కొత్త మనీ లేక దగ్గరలో వున్న దేవాలయాల్లో హుండీలకు సమర్పించి ఏ.టి.ఎమ్.లకీ, బ్యాంకులకీ పరుగులు తీస్తున్నారుట.
ఇక్కడ గవర్నమెంట్ ఔదార్యం కొంత కూడా వుంది. శవయాత్రలకీ ఉచిత వాహనాలు ఏర్పాటుచేస్తున్నారని ప్రకటన తెలుపుతోంది. అదెంత కాదు? ఆసుపత్రికి పోలేకపోయినాం.. అంటూ క్యూలో పడిగాపులు పడుతున్న జనాలు గొల్లున నవ్వారు.
అవును ఒక్కదెబ్బతో నరేంద్రమోదీ జనాల్ని- ‘నమో నమో’ అంటూ ఆర్తనాదాలు చేయించగలిగాడు.
జస్ట్ ఏన్ ఐడియా ఛేంజ్‌డ్ లైఫ్ ఇన్ ఇండియా!
*