Others

అక్కడ కనె్నపిల్లలే దుర్గమ్మలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధుర్గాపూజ బెంగాల్ ప్రత్యేకత గానీ బంగ్లాదేశ్ యివాళ ముస్లిం దేశం అయినప్పటికీ అక్కడి హిందువులు దసరా ఉత్సవాలను పశ్చిమ బెంగాల్‌లాగా బంగ్లాదేశ్ అంతటా అతి ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అక్కడి హిందువులు సజీవమూర్తిగా దుర్గమ్మకి పూజలు చేస్తారు. పదహారేళ్లలోపు కనె్నపిల్లల్ని తీసుకొచ్చి, దుర్గాదేవి అంతెత్తు అద్భుత విగ్రహం ముందు ఆసనం వేసి కూర్చోబెట్టి ‘కుమారి’ పూజని శాస్త్రోక్తంగా జరుపుతారు. ఢాకాలో వున్న అతి పెద్ద దుర్గా మందిరంలో పోయిన ఆదివారం అతి వైభవంగా కుమారీ పూజలు జరిగాయ్! దుర్గమ్మ ఏటా నాలుగు రోజులపాటు ఈ భూమీదిక వచ్చి మానవజాతిని అలరిస్తుంది. రకరకాల అవతారాలలో పూజలందుకుని- దుష్టసంహారాన్ని శిష్టరక్షణని ప్రసాదిస్తుంది- అని అక్కడి హిందువులు ఆదికాలం నుంచీ నమ్ముతూ వస్తున్నరు. ఈ కనె్నపిల్లనే అమ్మ దుర్గలాగా ఆహార్యం, ఆభరణాలూ పెట్టి అలంకరించి- మేళతాళాలతో, భక్తిప్రపత్తులతో తీసుకువచ్చి- ఆసీనురాలిని చేసి పూజించడం రుూనాటికీ కొనసాగుతున్నది.‘‘మేము అమ్మనీ, అక్కనీ, కూతుర్నీ కూడా చూసేది రుూ ‘కుమారి’ దేవతలోనే. ఇలా అన్ని రకాలుగా చేతనామూర్తిగా ‘స్ర్తి’ శక్తి ప్రత్యేకతని అందుకోవాలన్నదే రుూ ‘కుమారి’ పూజల లక్ష్యం అంటున్నారు బంగ్లాదేశ్ మేధావులు.

-వీరాజీ veeraji.pkm@gmail.com