Others

పెద్ద పులుల పాలిట యముడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పులి’ మన దేశంలో జాతీయ జంతువుగా యింకా రకరకాలుగా పేర్గాంచింది. దాన్ని అంతరించిపోతున్న జాతులలో చాలా ముఖ్యమైనదిగా ప్రకటించారు. నలభై వేల గాండ్రు గాండ్రు పులున్న మన దేశంలోని అడవులలో వాటి సంఖ్య నలభైవేల దాకా వుండేది కాస్తా ఇరవై రెండు వేలకి దిగజారిపోయింది.
ఇలా అంతరించిపోడానికి వేరే కారణాల మాట ఎలా వున్నా, ‘ఓ గండరగండ పులి వేటగాడే’ అసలు కారణం అంటున్నారు పోలీసులు. పదిహేను సంవత్సరాల నుంచీ ‘్భమా బావరియా’ రకరకాల వేషాలు కట్టి పోలీసుల కళ్లల్లో దుమ్ముకొట్టి పారిపోతున్నాడు గానీ, అతని బారి నుంచి పెద్ద పులులు తప్పించుకోలేకపోతున్నాయి. డజన్‌ల సంఖ్యలో పులుల్ని వేటాడే రుూ భయంకర పులి దొంగ - వాటి చర్మాలతో, దుమ్ముల, ఎముకలతో, గోళ్ళతో అద్భుతమైన వ్యాపారం చేసి- లక్షల రూపాయలు సంపాదించాడు.
ఈ ‘్భమా బావరియా’కి ఓ పెద్ద అన్న వున్నాడు. వీళ్లు యిద్దరూ కలిసి పులుల వేట, వధ, చర్మాల ఎగుమతీ చేస్తున్నారు. ఎట్టకేలకు అక్టోబర్ 17న భీమా బావరియాని పోలీసులు పట్టుకున్నారు. అదే వాళ్లకీ, పులులకీ కూడా సంబరం కలిగించే వార్త-
భీమా సన్యాసి వేషంలో వుంటాడు. కాబట్టి సాధువు కదా పులుల్ని చంపడు అనుకుంటారు అందరూ. మరోసారి ఈ భీమా ‘ముష్టివాడి’ వేషంలో తిరుగుతాడు. ముష్టివాడు ఎక్కడైనా పులికోరల్తో వ్యాపారం చేస్తాడనుకుంటారా, ఎవరైనా?
ఇలా బావరియా బహురూపధారి. జైల్లోనుంచి పారిపోవడం, బెయిలు తీసుకుని అదృశ్యమైపోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్యలు. ఉత్తరాఖండ్‌లోని కరణ్ ప్రయాగ అడవులలో పులులను చంపి, వాటి చర్మాలను కంబళ్లుగా కప్పుకుని దొరికిపోయాడు. కానీ పరార్ అయిపోయాడొకసారి. మరోసారి ఉత్తరప్రదేశ్‌లోని నాజియాబాద్‌లో, 2005లో పోలీసుల వలలో పడ్డాడు కానీ తప్పించుకున్నాడు. కాకపోతే, పోలీసులకు అతనికి వున్న వేర్వేరు యిండ్లలోనుంచి పులి చర్మాలు, గోళ్లు, దుమ్ములు, ఎముకలు వగైరా కుప్పలుగా దొరికాయ్. ‘‘కోట్ల రూపాయలొస్తాయ్ వీటన్నిటినీ అమ్మితే చైనాకి’’ అంటారు మరి. ‘్భమా పులిగాడు లోపల వుంటే అడవులలో పులుల సంఖ్య పెరుగుతోందిట. పులుల సంఖ్య పడిపోవడానికి కారణం వాటి చావుల్లో 37 శాతం భీమాలాంటి పులి వీర భయంకరుల వల్లనే అంటున్నారు అడవి జంతువుల సంరక్షక సంఘం వాళ్లు. పులిని తప్పించుకోలేని మానవులు వున్న దేశంలో- పులులకు చర్మాలు వలిచేస్తున్న భీమా బావారియాల సంఖ్య కూడా బాగా పెరుగుతోందట.
ఈ పులి భీమాసురుడు జ్యుడీషియల్ కస్టడీలో వున్నాడిప్పుడు. పెద్ద లాయర్‌కోసం వెదికిస్తున్నాడు- పులుల్ని కాపాడలేక సతమతమవుతున్న గవర్నమెంట్ మీద జాలిపడుతున్నారా? పడండి!

పిల్లల చదువులు ఏం కాను?

దేశ రాజధానిలో వాతావరణ - పర్యావరణ కాలుష్యం వల్ల దుర్భరంగా తయారైంది. కన్ను పొడుచుకున్నా యాభైమీటర్ల దూరం అవతల ఏమున్నదో, పొగ మంచు కారణంగా తెలియదు. పాఠశాలలకి శలవులు ఇచ్చేశారు. ‘‘స్కూళ్ళు మూసేస్తే, పిల్లల చదువులు ఏం కాను?’’ అంటూ జంతర్ మంతర్ దగ్గర పేరెంట్స్ ప్రదర్శనలు మొదలుపెట్టారు. ‘‘్ధర్నాలు చెయ్యండి గానీ గడ్డి బొమ్మలు తగలెట్టకండి’’ అంటున్నారు అధికారులు. ‘‘ఇళ్ళల్లో నుండి బయటికి పిల్లల్ని పంపకండి’’ అంటున్నారు అక్కడ అధికారులు.
ఢిల్లీ స్థితి ఇతర నగరాలకి గుణపాఠం కావాలి. పిల్లల్లో బ్రోంకైటిస్ ఆస్తమా మొదలు అన్ని రకాల వ్యాధులూ ప్రబలిపోతున్నాయి. కనుక చెత్తకుప్పల్ని రోడ్లమీద తగలెట్టకండి’’ అన్నది నీతి; భీతి కూడాను. మన ఢిల్లీయే మన పల్లెలకు వార్నింగ్!

కూతుర్ని
కన్నందుకు ‘కారు’!

‘‘కొడుకును కంటే అది యిస్తాం యిది చేస్తాం అది చేస్తాం’’ అంటుంటారంతా. కానీ ఒక ఉత్తరప్రదేశ్ అత్తగారు కోడల్ని కూతురులాగా చూసుకుంటానని అందరికీ చెప్పేది. ఆమె తన మాట నిలబెట్టుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో ‘ఖుష్‌బూ’ అనే కోడలు పం డంటి కొడుకుకు బదులు పువ్వంటి కూతుర్ని కన్నది. దీపావళి నాడు రుూ వార్త విన్న అత్తగారు తక్షణం ఎగిరి గంతేసి కోడలికి ఒక హోండా సిటీ కారు కొని బహుమతిగా ఇచ్చే
సింది. ఆ మంచి అత్తగారి పేరు ప్రేమాదేవి. ఆరోగ్య శాఖలోనే ఉద్యో గం చేస్తున్నది. ‘ఆడపిల్లని కన్నతల్లికి అదే శాపం’ అనే రోజులు క్రమేపీ మారుతున్నాయి అనడానికి గుజరాత్‌లోని సింధూ ట్రస్ట్ ఆసుపత్రి కొత్త ఉద్యమం లేవదీసింది. వాళ్ల ఆసుపత్రిలో ఆడపిల్లని కన్నతల్లికి పురిటి ఖర్చులు తీసుకోరు. అన్ని చికిత్సలూ ఫ్రీ.
‘అమ్మాయిని కను- అన్ని సదుపాయాలు పొందు’ అన్నదే ‘సింధూ’వారి నినాదం. ఎందుకంటే ‘గుజరాత్‌లో వెయ్యిమంది మగరాజులకి 890 మంది స్ర్తిలు మాత్రమే వున్నారు’ అంటున్నాయి జనాభా లెక్కలు. ‘ఈ వ్యత్యాసం తగ్గాలి’ అంటూ ఆడపిల్లల్ని కనబోయే ఆ వనితామణులకి, రిజిస్ట్రేషన్ ఫ్రీ కూడా ఎత్తేసిందా సింధూ ఆసుపత్రి.
మామూలు పురుడు అంటే ఏడు వేలరూపాయలు, సిజేరియన్ అయితే ఇరవై వేల రూపాయలు కనీసం ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మగ పిల్లల తల్లులకే ఎక్కువ ఖర్చు. ఆడపిల్లలలకి అన్నీ ఉచితం- రిజిస్ట్రేషన్ ఫీ పండ్లలో పెట్టి మరీ యిచ్చేస్తారు.
‘అమ్మాయే పుట్టాలీ’ అని కలలుగనే దంపతుల సంఖ్య మెల్లిగా పెరుగుతోందిట. ఎందుకంటే, అమ్మాయిని కనగానే సరా? దాన్ని ఎదిగిన కొద్దీ మగ ముష్కరుల దుష్ట దృష్టి నుంచి కాపాడవద్దా?!

-వీరాజీ