Others

కాలకృత్యాలకై ‘తీర్థ’యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వచ్ఛ్భారత్, స్వేచ్ఛ్భారత్, కుశల్‌భారత్, ఆ భారత్, రుూ భారత్- యిలా రకరకాల భారత్‌లు ఎన్నో యిక్కడ వున్నాయి. మరో క్రొత్త స్లోగన్- బేటీ ‘పఢావో’ వచ్చింది. అద్సరే, ముందు ఆడపిల్లని డీసెంట్‌గా బ్రతకనివ్వాలి కదా? అదేకదా ‘బచానా’ అంటే.
జార్ఖండ్‌లోని ‘దుమారియా’ మండలానకి చెందిన ‘హర్దా’ అనే గ్రామం వుంది. అందులో కస్తూరిబా గవర్నమెంట్ బాలికల వసతి పాఠశాల వుంది. అందులో 250మంది బాలికలు- (మోదీజీ భాషలో ‘బేటీ’లు) చదువుకోవడానికి వుంటున్నారు. ఆ స్కూల్లో మంచినీళ్లు, అనగా త్రాగునీరూ, ఉప్పునీళ్లూ, మరుగుదొడ్లూ కూడా లేవు. ఎండాకాలంలో తప్పనిసరి అయితే త్రాగటానికి మాత్రం ఒక వెయ్యి లీటర్లు ‘ఘుట్సాలా’ నుంచి కొనుక్కొస్తారు. అంచాత ఈ 250 మందీ, వేకువ ఝామున లేచి, చేత పెద్ద బక్కెట్లు ధరించి- ‘లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్...’ అంటూ, వాళ్ల స్కూలుకి ఒక కిలోన్నర మీటర్ల దూరంలో వున్న ‘్భమ్‌దాత్’ నదీ తీరానికి యాత్రలాగా బయలుదేరుతారు. అన్నట్లు వాళ్లు పట్టుకున్న బకెట్‌లలో వాళ్లు వుతుక్కోవాల్సిన దుస్తులు, దుప్పట్లు వగైరా కూడా వుంటాయి. అక్కడ నదీ తీరాన, ఆరుబయటా రుూ ‘బేటీయా’ (ఆడపిల్లలకి బహువచనం) అందరూ కాలకృత్యాలు ‘ఓపెన్’గా తీర్చుకుని- బట్టలను బండలకు బాది ఉతుక్కుని తిరిగి ‘రైట్ లెఫ్ట్’గా స్కూలు ‘రిట్రీట్ మార్చ్’ చేస్తారు. అదీ ఆ ప్రాంతం తీవ్రవాదుల ‘అడ్డా’ కావున - రుూ పిల్లలకి ‘రక్షణ’గా టీచర్లంతా కూడా ‘తైనాతు’గా వెళ్తారు నిత్యం.
స్కూల్లో బావి పాడుపడ్డది. బోరింగ్ యింకిపోయింది. నెల రోజులయింది. దిక్కులేదు. ఇదీ వీళ్ల కొత్తరకం ‘గురుకులవాస విద్యా విన్యాసం’! ‘‘బేటీ బజావో బాబూ! బేటీ బజావ్!’’
అక్కడంతా ‘కవల’ల మేళం!
మన చిత్తూరులో ఓ ఇంగ్లీష్ మీడియం స్కూలుంది. చుట్టుప్రక్కల గ్రామాలలోగానీ, వూళ్లలోగానీ- కవల పిల్లలున్నవారు- మనకేం ‘చింత’లేదు. ‘‘వీళ్ళని క్యామ్‌ఫోర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పడేద్దాం’’ అనుకుంటారుట.
అలాగ ఆ స్కూలుకు ‘కవలల స్కూలు’ అన్న పేరు కూడా పడిపోయింది. ఎల్.కె.జి క్లాసు నుంచీ పదో తరగతి దాకా చదువుకుంటున్న ‘కవల పిల్లలున్న’ రుూ స్కూల్లో మొత్తం మీద 28 కవల జంటలు- పాఠాలు నేర్చి- పరీక్షలు రాస్తున్నారు. ఇందులో ఒక్క ఆరు జంటలు మాత్రం ఒకేలాగా వుండకుండా తేడాగా వుండే కవలలు కాగా మిగతావారంతా ‘అచ్చుగుద్దినట్లు ఒక్కటే’ మూసలో వుంటారు. ఇందులో పనె్నండు మగ పిల్లల జంటలు కాగా- తతిమ్మా వారంతా ఆడపిల్లలే. ఒక్కోసారి ముఖ్యంగా, ‘లంచ్ అవర్స్’లో, రుూ పిల్లలు టీచర్లని తెగ తికమక పెట్టేస్తూ వుంటారు. ఒక్కోసారి ఈ పెంకి ఘటాలు కావాలనే టీచర్లని ఇతరులనీ బురిడీ కొట్టిస్తూంటారు. అదో సరదా!
చిన్నదేం కాదాస్కూలు. వెయ్యికి పైగా స్టూడెంట్స్ వున్నారు. ఖరీదయిన ఆంగ్ల మాథ్యమ పాఠశాలే. వాళ్లు యిటీవల ‘కవలల దినోత్సవం’ సంబరంగా చేసుకున్నారు. పిల్లలంతా ఒక్కోరూ మరొక్కరి ‘జెరాక్సు కాపీ’ల్లాగా రంగు రంగుల దుస్తుల్లో ముస్తాబై- ‘పండగ’కి వచ్చినట్లు వచ్చారు. పాపం స్ట్ఫాకి వీళ్లని సర్దుబాటు చేసి, ఆడించి, పాడించేసరికి తలప్రాణం తోకకి వచ్చేసింది. ఓ పేరు పిలిస్తే మరోడు ‘యస్ మామ్’ అంటాడు.
అయితే, రుూ స్కూల్లో యిప్పటికి దేవుని దయవల్ల ‘టీచర్ ట్విన్స్’ లేరు. వీళ్ళల్లో కొందరు పెద్దాళ్లయి టీచర్లుగా వస్తే తప్ప- అటువంటి అవకాశం రాకపోవచ్చు.
చెట్లు, చెరువులు మనకి శ్రీరామరక్ష!
బెత్తెడు జాగా వున్నా చాలు- మొక్కలు నాటండీ అంటూ నినాదాలు, ఆదేశాలు- కాని అదే చేత్తో సర్కారు వారి ఆధ్వర్యంలోనే చెట్లు కూల్చడం, రోడ్లు వేసుకోవడం, చెఱువులు పూడ్చి రమ్య హర్మ్యాలు నిర్మించడం- యిది మన నాగరికత.
ఇవాళ దేశం మొత్తంమీద అగ్గి కురుస్తున్నది. చుక్క నీరు దొరకడం గగన సదృశమయిపోతున్నది, గత జల సేతు బంధనంగా చేయగలదేముంది? హైదరాబాద్‌లో చెరువులు బిల్డింగు పునాదుల్లోకి యింకిపోయాయి. కట్టడాలు మేఘాల్ని తాకేయి. అందాల నగరం ‘బంగలూరు’గా పేరు మారినా అనేక ‘బెంగ’లూరుగానే వున్నది అది. ఈ వార్త చిత్రం కాదు గానీ, ఒక హెచ్చరికగా భావించి వ్యాఖ్యానించుకోవడం అవసరం. ఈ ఐ.టి. మహానగరంలో బృహత్ మహా నగరపాలిక లెక్కల ప్రకారం 800 చెరువులుండాలి గానీ, 200 మాత్రం- అవీ అంతంత మాత్రంగానే మిగిలి ఉన్నాయి. ఈ సరస్సులలో యిప్పుడు మురుగు వ్యర్థ పదార్థాలతో ఒక ప్రక్క కుళ్లిపోతూ- మరో ప్రక్క అడ్డమయిన చెత్త- భవన నిర్మాణాల పనులనుంచి వచ్చే రాళ్లూ రప్పలతో కుమిలిపోతున్నది ‘కందనహుళ్లి’. ఈ చెరువుని కాపాడటం కోసం పగలు హోంగార్డుల కాపలాలు పెట్టారు. రాత్రిపూట తెచ్చి రాళ్లూ, సున్నం, బండలూ, వ్యర్థ పదార్థాలూ పడేస్తూ వున్నారు జనులు- తెలివైన ఘనులు!
ప్రపంచం మొత్తం మీద సివిక్‌సెన్స్- అంటే సామాజిక స్పృహ పవిత్ర భారతదేశంలోనే ‘హుళక్కి’! మనదంతా ‘కల్చర్’ కదా? చెరువుని కాపాడాలి అంటే గోడలు, కంచెలు కట్టలేరు కదా? అంటే, దానికి ప్రాజెక్టు వర్కూ, మంజూరూ, సాంక్షన్లూ వగైరాలుంటాయి. అంచేత చెరువు చుట్టూ అధికారులు కందకాలు త్రవ్వారు. అంటే, వెనుకటి రాజుల కోటల చుట్టూ కందకాలుండేవిగా? అలాగన్నమాట- గోతులు తీశారు. ఈ చెరువు ముప్ఫయిన్నర ఎకరాల వైశాల్యం గలది. దానిలో నీరు కలుషితం, అదృశ్యం కాకుండా కాపాడాలీ అంటే ఎలా? పైగా దీన్ని కప్పేస్తూ ఓ వంద అడుగుల ఎత్తున ‘చెత్తకొండ’ ఏర్పడిపోయింది. చెర్లో నీళ్లు కుళ్లు కాల్వల నీళ్లతో కలిసి దుర్గంధభరితం, దుర్భరం అయిపోయాయి. 20 అడుగుల పొడవు, నాలుగడుగుల లోతుగల కందకం నిర్మించారు. బిల్డింగ్ వ్యర్థాలు తెచ్చే ట్రక్కులని నిలవరించారు. మురుగునీరు అంతా చెరువుల్లోకి రాకుండా దాన్ని శుద్ధి చేసే కర్మాగారానికి మళ్లించాలని ప్రణాళికలు వేశారు. అలాగా రుూ ‘కందన్‌హళ్లీ’ సరస్సును ప్రజల కోసం పర్యావరణ పరిరక్షణ కోసం కాపాడాలని నానాతంటాలు పడుతున్నారు. దీనే్నమంటాం? స్థానికులే స్థానికులకి శత్రువులు- అనొచ్చునా?
కొసరు ముచ్చట
కనీ వినీ ఎరుగనంతటి ‘నీట్’గా సాగించారు ‘నీట్’ పరీక్షలు. చేతికి ఉంగరం, కాలికి చెప్పులూ కూడా లేకుండా నిలువుదోపిడీ చేసి, ఒళ్లంతా తడిమేసి, రేపటి డాక్టర్లు కావాలని కోరుకునే 66,700మంది అభ్యర్థులని పరీక్షా కేంద్రాలలోకి తాపీగా పంపించారు. లోనకు పోయి, పేపరు తెరిచి చూస్తే- చాంతాడంత పరీక్షా పత్రంలో - పాపం! సిలబస్‌లో లేని ప్రశ్నలే వున్నాయి అని స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ గోలెట్టేశారు. మొత్తం 1040 పరీక్షా కేంద్రాలు దేశంలోని 52 పెద్ద నగరాలలో ఏర్పాటుచేశారు. ఇది తొలివిడత పరీక్ష- మలివిడత పరీక్ష జూలై 24న జరుపుతారు. చాలామంది పిల్లలకి జ్వరాలు వచ్చేశాయిట.
****
ప్రపంచం మొత్తంమీద మన ఒంగోలు గిత్తకి ఉన్న పేరు ప్రతిష్ఠలు, డిమాండ్ మరో పశువుకి లేవంటారు. ఈ మాట నిలబెడుతూ రుూమధ్యనే ఒక ఒంగోలు గిత్త ఏకంగా 19 లక్షల రూపాయలు పలికింది. వైఎస్సార్ జిల్లా కొత్తపేటకు చెం దిన గురుజాల రామకృష్ణారెడ్డి- రుూ ఒంగోలు గిత్త యజమా ని ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లెకు చెం దిన అంజిరెడ్డి తన గిత్తను అమ్మకానికి పెట్టాడు. దాన్ని రామకృష్ణారెడ్డి మోజుపడి కొన్నాడు. ‘‘నందిలాగా వున్నదీగిత్త’’ అన్నారంతా!

-వీరాజీ