Others

మనుషులూ బురద మెండుగా మెచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పంది బురద మెచ్చుగానీ పన్నీరు మెచ్చునా?’ అన్నాడు మహాకవి వేమనగారు. కానీ అక్కడ ఆ సంద్ర తీర నగరంలో అంతా అధునాతన జనాలే. బురద కోసం వెంపర్లాడుతూ వచ్చి నడుం లోతు బురద మడుగులో దొర్లుతారు, పొర్లుతారు, కేరింతలతో, ఆటా, పాట కలిపి, బురద సంబరాలు- ఒకటి కాదు, రెండు కాదు పది రోజులు సాగిస్తారు. దక్షిణ కొరియాలోని బొరియాగ్ నగరంలో రుూ ‘‘బురద హోలీ’’ జూలై 15 నుంచీ కడు రంజుగా సాగుతున్నాయి. ఇది 18వ బురద సంబరం. బురద సానువులమీదినుంచి జారుడుబండ మీద లాగ జారడం, మడుగులో డాడ్జ్‌బాల్ లాంటి ఆటలు ఆడటం, బురద గుంటలు దాటుకుంటూ- వాటిలో మునిగి తేలుతూ పరుగులూ, పందేలూ ఆడటం- యివన్నీ కాకుండా ‘‘ప్రపంచ బురద సుందరాంగనల’’ పోటీలు కూడా హైలెట్‌గా వుంటాయి.
ఈ బొరియాగ్‌నే ‘డేచియాన్’ స్థానికులు పిలుస్తారు. భాష కూడా ‘‘చూన్ చియాంగ్’’ అనే ప్రత్యేక భాష. ఇంతకీ రుూ సంబరాలకు కారణం ఈ సంద్ర తీర మృత్తిక- అందం, ఆరోగ్యం యినుమడింపజేసే నల్లని ఒండ్రు మట్టి మాదిరి చిత్తడి మట్టి- మాంచి వర్షం కురుస్తూ వుంటే - ‘బర్సాత్ మేఁ తక్‌దిన దిన్’ అన్నట్లు కమ్మగా కొరియన్ పాప్ సింగర్- పి.యస్.వై పాటలు దంచేస్తూ వుండగా- పోయిన శనివారం ధూంధాంగా మొదలైనాయి సంబరాలు.
ఈ బురద హోళీ రంగేళీలో రకరకాల- చిత్ర విచిత్ర క్రీడలుంటాయి. రాత్రుళ్లు బాణసంచా ఆకాశాన్ని వెలిగిస్తుంది. బొరియాంగ్ నగరానికి పోయినేడాది మూడు లక్షల ఇరవై వేలమంది రాగా- రుూ ఏడాది రుూ సంఖ్య రెట్టింపు అవుతోంది అని అంచనా.
.....................................................
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03
................................................

-వీరాజీ