Others

కుక్కలకి మాత్రమే జన్మదినోత్సవ విందు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుషులనే పిలిచి బర్త్‌డేలకి విందులు యివ్వటం లేదు- ఎక్కడో అక్కడ ‘బఫే’లు పెట్టేస్తున్నారు. అటువంటిది యిటీవల జంతువులకి పెళ్లిళ్లు చేయడం, విందులు చేయడం ఎక్కువైంది. జూలో సింహానికీ, సివంగికీ నాలుగు వందల మంది అతిథుల్ని పిలిచి, విందుపెట్టి పెళ్లి చేయడం బాంగ్లాదేశ్‌లో చూశాంగానీ ముంబాయికి చెందిన ఒక చిన్నారి తన 12వ ఏట జన్మదినోత్సవ వేడుకల్ని భారీగా జరిపించుకుంటూ- నాలుగు వందల ఊరకుక్కల్ని అత్యంత మక్కువగా ఆదరణతో పిలిచింది.
ఈ పాపమీద ప్రేమతో ఆమె గుజరాతీ తల్లిదండ్రులు శునక సందడిని ఒక ఎన్.జి.వో సంస్థని పట్టుకుని దాని ద్వారా ఏర్పాటుచేశారు. ఆ సంస్థ పేరు ఏ.ఎమ్.టి.ఎమ్. అంటే ‘ఏనిమల్స్ మేటర్ టు మీ’. బోలెడు డబ్బు తగలేసి కేకు కట్ చేయడం- గానాబజానాలు పెట్టడంకన్నా వీధి కుక్కలకి మంచి తిండి పెట్టడం మంచిది అనీ, అవే తన ఫ్రెండ్స్ అనీ, ఆ గుజరాతీ పాప చెప్పింది.
అయితే ఏ.ఎమ్.టి.ఎమ్ సంస్థ 150 కుక్కల్ని మాత్రమే శునకశాల పెట్టి పోషిస్తున్నది. మరో 11 వందల ఊరకుక్కలు కావాలే? వాటిని ‘మార్యా’, ‘ఆక్షా’ ప్రాంతంలో పట్టుకున్నారు. ఫేస్‌బుక్‌మీద విజ్ఞుప్తులు పెట్టారు. అంతే, 203 మంది వాలంటీర్లు శునకాలను వెంట పెట్టుకుని పాప జన్మదిన వేడుకలకి తరలివచ్చారు. ఇందులో కాలేజీ స్టూడెంట్స్ వున్నారు. కుక్కలకి యిష్టమయిన పదార్థాలు వండించారు. అవతల గణేష్ నిమజ్జనం- ట్రాఫిక్ జామ్స్- ఇవతల కుక్కల దండుల వల్ల ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. అయినా విందు, ఓహో!
శ్రేయోభిలాషులు, బంధువులు, స్నేహితులు కూడా సాయంకాలం ‘విందు’ చూడ ఏతెంచారు. మొత్తం 1240 అతిథి శునకాలు తోకలూపుకుంటూ దిగడ్డాయి. ఈ శునక రక్షణ సంస్థ ధర్మమా అని పాప జన్మదిన వేడుక బ్రహ్మాండంగా సాగింది. కాకపోతే రుూ పాప- అమ్మా, నాన్నా- ‘‘మా పేర్లు బయటపెట్టకండి. ఖర్చులు, శ్రమా అన్నీ భరిస్తాం’’ అన్నారు.
‘‘ఒక పది కుక్కలకి తిండి ఖర్చు యివ్వండి’’- అన్న నినాదంతో యిక శునక పోషక సంస్థలు వెలుస్తాయేమో.. యికమీదట!

వార్త-వ్యాఖ్య -వీరాజీ

-వీరాజీ