Others

విమాన భోజనంలో బల్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణీకులకు పెట్టే భోజన పదార్థాలలో తల వెంట్రుకలు మొదలు బల్లులదాకా వుంటాయన్న ఆరోపణలు అలా వినబడుతూనే వుంటాయి.
పోయినేడాది- మహారాజా (ఎయిర్ ఇండియా పేరు)గారు ఒక ప్రయాణీకురాలికి పెట్టిన భోజనంలో బల్లి పిల్ల పడి వున్నది. ముంబాయి నుంచి న్యూయార్క్‌కు మహారాజా సర్వీస్‌లో ప్రయాణం చేసిన మాల్తీ మథుకన్ పహాడియా అనే ప్రయాణీకురాలికి అందించిన భోజన పళ్లెంలో బల్లిపిల్ల కనబడ్డది. ఆమె ఆ ఆహారం తిరస్కరించి, వినియోగదారుల ఫిర్యాదు సంఘానికి వెళ్లింది. ప్లేటులో ఒక తల వెంట్రుకల చిక్కుకూడా అగపడ్డదిట!
‘‘జిల్లా సంఘం’’ శ్రీమతి పహాడియాకి పదిహేను వేల రూపాయలు పరిహారం ఇవ్వమంది. కానీ, ఎయిర్ ఇండియా ఇవ్వనంది. అప్పీలుకి పోయింది. మహారాష్ట్ర వినియోగదారుల కమిషన్ దీనిమీద మరింత విచారణ జరిపించింది. పదిహేను వేల రూపాయలు ఏ మూలకి?
‘‘పాపం! ఆ రోజు ఆ ప్రయాణీకురాలు పస్తు పడుకుని అంత దూరం ప్రయాణం చేసింది. కనుక పరిహారం లక్ష రూపాయలు చేస్తు న్నాం’’ అని ప్రకటించింది. అప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలాగా, ఎయిర్ ఇండియాపై కోర్టుకి వెళ్లింది. ప్రయాణికులు తినే విధంగా వుండే భోజ నం పెట్టడం విమాన సం స్థల కనీస ధర్మం- మర్యాద. కనుక లక్ష రూపాయల జరిమానా- దావా ఖర్చుల నిమిత్తం మ రో పదివేల రూపాయలు కూడా క్రక్కమని కోర్టువారు ఆదేశించారు. భేష్!