Others

353 కిలోమీటర్ల పరుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తం మీద తన కెరీర్‌లో 34,347 అంతర్ జాతీయ స్థాయి క్రికెట్ పరుగులు సాధించిన భారతరత్న సచిన్ టెండూల్కర్- మొత్తం 664 మ్యాచ్‌లు ఆడాడు. అతను వికెట్‌ల మధ్య మెరుపువేగంతో పరిగెత్తడం యింకా చాలామందికి గుర్తు వుండే వుంటుంది!
ఒక పరుగు తీయాలి అనుకున్నా ఎదుటి బ్యాట్స్‌మన్‌కి ఓ పరుగు యివ్వాలీ అన్నా- ఇరవై రెండు గజాల దూరాన్ని చకచకా దాటాలి. బవుండరీలు, సిక్సర్‌లు ప్రక్కనబెట్టండి. నిలబడి అందుకున్న- పరుగులవి. ఐతే- ఒకటీ, రెండూ ఒక్కోసారి ఏకబిగిన నాలుగు పరుగులూ తీసే లిటిల్ మాస్టర్ కేవలం తన ఖాతా పరుగులకోసం దాటిన దూరం కిలోమీటర్స్‌లో లెక్కలు తీశారు. మొత్తంమీద అతను 353 కి.మీ.ల దూరం తన ఒక్కడి పరుగులకోసం పరిగెత్తాడు.
ఇరవై నాలుగు సంవత్సరాలపాటు అలా అన్నిరకాల ‘పిచ్’ల మీద మెరుపులు కురి పిస్తూ- పరుగుల వరదని ప్రేక్షకుల కనుల పండువుగా సాగించాడు. ‘అన్‌మోల్ రతన్ సచిన్’- అంటారంతా!

veeraji.pkm@gmail.com