వీరాజీయం

మాటంటే మాటే: చినబాబు ‘రూటే’ వేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గట్టిగా నిలబడటానికి ఎన్నో సమస్యలు, ‘స్టాండు’లు దేశం నిండా వుండగా- యింకేమీ దొరకనట్లు అర్జంటుగా మహాత్మాగాంధీగారిని చంపేసింది ఆర్.ఎస్.ఎస్. మనుష్యులేనన్న తన మాటలకి కట్టుబడి, నిలబడతానంటూ- సోనియా తన తనయుడు పోయిన వారం- బుధవారం మంచి రోజుగా ఎంచుకుని సుప్రీంకోర్టులో తాను పెట్టుకున్న అర్జీని ఉపసంహరించుకుంటున్నానన్నాడు.
‘‘మాట మార్చడం మా యింటా వంటా లేదు-’’ అన్నంత గొప్పగా- ‘నా మీద వచ్చిన పరువునష్టం దావాని కొట్టేయండి మహాప్రభో!’’ ‘నేను దాన్ని ఉపసంహరించుకుంటున్నాను’ అంటూ మొరపెట్టుకున్నాడు.
రాహుల్‌గాంధీ తరఫున వాదిస్తున్నది ఎవరోకాదు- మాజీ న్యాయమంత్రిగా, ఘనత వహించిన కపిల్ సిబ్బల్‌జీ!- తనతోపాటు మహలక్ష్మీపావనీ- దీంతో రుూ యిద్దరికీ ముక్కుకోసినట్లయింది. వాళ్లు గ్రుద్దిన బల్లలు వాళ్లనే వెక్కిరించాయి. వాచిన చేతులు సలుపుపెట్టాయి.
‘‘సరే పోండి. మహారాష్టల్రో వున్న భివాండీ మాజిస్ట్రేట్‌గారి సన్నిధికే పొండు,’’అంటూ సుప్రీంకోర్టు ఫైలుమూసేసింది. ఇప్పుడు రేపు కాబోయే కాంగ్రెస్ అధ్యక్షులుంవారు- ‘దేవుఁడా’అంటూ భివాండీ మాజిస్ట్రేటు దగ్గరికి ప్రత్యక్షంగా పోవాలి.
ఓసారి వెనక్కి చూద్దాం-
2014 మార్చి నెలలో ఎన్నికల ప్రచార సభలో ఒకసారి ప్రసంగిస్తూ రాహుల్‌జీ- మహాత్మాగాంధీగారి హత్య- ‘ఇన్ హీ లోగోంనేకీ’- అంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ని నిందించాడు. ‘‘అప్పుడేమో గాంధీజీని, సర్దార్ పటేల్‌జీని వ్యతిరేకించారు. యిప్పుడేమో వాళ్లపేర్లమీద ‘వోట్లు’దండుకోవాలని చూస్తున్నారు’- అన్న తాత్పర్యం వచ్చేటట్లు గంభీరోపన్యాసం చేశాడు.
వేదిక మీద తాతగారి లెవెల్లో ఢంకా బజాయిద్దాం అనుకుంటూ, పప్పులో కాలెయ్యడం- యువరాజావారికి అలవాటే. అలవాటులో పొరపాటుగా గాంధీజీ హత్యా ఉదంతాన్ని తురుపుముక్కలాగా వదిలేసరికి, అది లిటిగేషనై డిఫెమేషనై పీకపట్టుకుంది.
పరువునష్టం దావావేసిన రాష్ట్రీయ స్వయంసేవకుడు మెత్తబడి ‘‘శ్రీ రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టులో- నా వుద్దేశ్యం ఆర్.యస్.యస్.ని నిందించడం కానే కాదు’’, అంటూ నీళ్లు నమలకుండా లాయర్‌ల ద్వారానైనా, ఓ బేషరతు ‘తూనాబొడ్డు’ సమర్పిస్తే చాలు’- అంటూ వుంటే - రుూలోగా చినబాబు బుర్రని ఎవరు తిన్నారో? చెవులు ఎవరు కొరికారో తెలియదుగానీ- మరోసారి ‘రైట్ అబవుట్ టర్న్’కొట్టి బోల్తాపడ్డాడు శ్రీ రాహుల్.
అసలు కేసు పెట్టబడ్డదీ భివాండి మాజిస్ట్రేటు కోర్టులో. అక్కడేదో విచారణ జరిగి తీర్పోపాడో వస్తే- లేదా సదరు మాజిస్ట్రేటువారు హైకోర్టుకి కేసు పంపిచేస్తున్నానూ’ అంటే- అప్పీలూ గట్రా చేయమని కపిల్ సిబ్బల్ ది గ్రేట్‌గారికి పంపించి వుంటే బాగుండిపోను- కాని, ‘చినబాబు ఢిల్లీలో చాలా బిజీ కనుక ప్రత్యక్షంగా కోర్టుకి రారు. విచారణకి హేమాహేమీలయిన అడ్వొకేట్‌లే వస్తారూ’- అని పిటిషన్ పెట్టారు రాహుల్ హితైషులు- హైకోర్టుకి పోయి... కాని, హైకోర్టువారు- ‘‘మరేం కొంపలు మునిగిపోటం లేదు. ఇంచక్కా బోనులోకి వచ్చి నిలబడమనండీ’’- అన్నట్లుగా కేసుని కొట్టేసింది. దాంతో చినదొరగారి లాయర్‌లు వీరోచితంగా సుప్రీంకోర్టు తలుపులు యమర్జంటుగా తట్టారు... 2014, మార్చినుండి యివాల్టికి ఎన్నాళ్లయింది?
ఇంకేముంది? ఈ యవ్వారం మీడియాకి ‘మేత’గా తయారుఅయింది. అసలు ఆర్.ఎస్.ఎస్ వేరూ- ఆర్‌యస్‌యస్ సంబంధం వున్న మనుషులు వేరు- అని రాహుల్‌జీ ఎలా భావించాడు? గినె్న గినె్నలో వున్న పాలూ ఒకటి కావు అన్నట్లా? పోనీ, అలా సమర్ధించుకున్నా- నాథూరాంగేడ్సేకి రా.స్వ.సం.కీ బాదరాయణ సంబంధమే తప్ప మరేమీ లేదూ అంటూ వాదించినా పోయేది. కాదూ కూడదూ అంటే రుూ పిష్టపేషణం వల్ల రేపు యు.పి. ఎన్నికలలో వోటు ముక్క కూడా రాదు’- అనుకొని, హూందాగా ఓ‘సారీ’ చెప్పేసి చేతులు దులుపుకుని కొత్త చొక్కా తొడుక్కొని లేచ్చక్కాపోయి- యు.పి. పాదయాత్రకి పాదాల్ని తయారుచేసుకున్నాపోయేది-
ఇన్ని సంవత్సరాల తర్వాత- చరిత్రనే అడగని, పట్టించుకోని దేశంలో- ‘కులం, పణం’ మాత్రం చెలామణీ అయ్యే రుూరోజుల్లో- ఎవరి సెంటిమెంటు మీద ఫిడేలు రాగాలు వినిపించాలి? అనుకుంటున్నదో కాం.పా. ముందు తేల్చుకోవాలి.
ఉత్తరప్రదేశ్‌లో ఒక పంతులమ్మగారిని, ఎనభై రెండేళ్ల వృద్ధమాతని ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేసిమరీ నిలబెట్టారు. ఆమెకి బ్రాహ్మణ, అబ్రాహ్మణ వోట్లు రెండూ పోలైతే గానీ- కాం.పా.కి ఆబోరు దక్కదు-
ఇక ప్రచారరథం సారధులుగా రాజబబ్బర్, ప్రియాంకాగాంధీలని- బాకాలూదుకుంటూ పొమ్మన్నారు. ఈరోజుల్లో కుల ప్రాతిపదికను వోట్లు కుమ్ముకుందామన్నా- ‘విచ్చ రూపాయ ధీమహే’- యే గానీ, ‘విశ్వరూపాయ ధీమహేలు’ పలుకవు అని కనీసం శ్రీమతి షీలాదీక్షితమ్మకేనా తెలియదా?
‘‘ఆమె- ‘‘సోనియాగాంధీ- ఇండియాకి, కోడలు; నేను యు.పి.కి కోడల్నీ’’అంటే యాదవ సైన్యం, మాయావతీ బలగంకూడా ప్లేటు ఫిరాయించుకుని - తనకే వోట్లు నొక్కేస్తారన్నది పేరాశ కదా?! ఇప్పుడంతా ‘నొక్కుడు బిజినెస్సు’కదా- అక్కడ యు.పి.లో జవహర్‌లాల్ పేరే కాదు- అటల్‌బిహారీ వాజ్‌పేరుూగారి పేరే తెలియని వోటర్లు- రెడీగా చేతులు జాపుతూ వున్నారు. (ఎందుకో?)
రైతులకోసం నువ్వు పాదయాత్ర చేస్తే- మైనార్టీలు, బ్రాహ్మలు, దళితులు వోట్లు ఎందుకు వేస్తారు? పాదయాత్రలు ఆదిన సునీల్‌దత్ స్కూలు. ఆమధ్యన రాజశేఖరరెడ్డిగారి ‘‘హైస్కూలు’’. కాగా- నాయుడుగారు కాలికి- అక్షరాలా బలపాలు కట్టుకుని తిరిగినది ‘‘హెటెక్కు స్కూలు’’అనుకుంటే, ఏం చెయ్యాలీ? తిరగాలి అంతేగాని గాంధీనీ, గాడ్సేనీ తవ్వి తలకెత్తుకుంటారా?
‘‘అమ్మగారికేమో ప్రచార రథం మీద నిలబడ్డానికే కష్టం. బిడ్డలకేమో - ఇందిరమ్మ, జవహర్‌లాల్‌ల పోజులు పెట్టడం కూడా సరిగ్గారాదు. వీళ్లారుూ- డిఫెమేషన్ కేసుని వోట్లలోకి మార్చుకునేది? వెళ్లెళ్లండీ-’’ అంటున్నాడు కోస్తా ఆంధ్రుడు. ‘కాంగ్రెస్‌కి కార్యకర్తలంటే రెస్పెక్టు లేదు’అంటున్నారు సామాన్య కార్యకర్తలు- తస్మాత్ జాగ్రత్త!
బెటర్ థింక్ ట్వయిస్ బిఫోర్ స్టెపిన్‌టు యు.పీ. ఓ.కే!