Others

ఇంకెంతకాలమిలా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు ఒక సినిమా థియేటర్‌లో విడుదలయిందంటే.. సైకిల్‌స్టాండ్ వాళ్ల దగ్గర నుంచి హాల్లో టీ, పల్లీలు, సమోసాలు అమ్ముకునేవారి వరకూ హడావుడి కనిపించేది. స్వీట్స్‌బళ్లవారికి, ఆ థియేటర్‌నీ నమ్ముకుని జీవించే ఇతర వ్యాపారస్థులకు విడుదలైన సినిమా కనీసం యాభై రోజుల వరకైనా హౌస్‌పుల్ కలెక్షన్స్‌తో నడుస్తుందనే గ్యారంటి ఉండేది. ఆ ఆనందంతోనే తమ వ్యాపారాలు సంతోషంగా సాగించేవారు. సినిమా సూపర్‌హిట్ రేంజ్ టాక్ వచ్చిందంటే వారి ఆనందం వందరోజుల వరకూ కొనసాగేది. అంటే ఆ సినిమా నూరు రోజుల వరకూ వసూళ్లను రాబట్టడటమేగాక.. వ్యాపారాలకూ ఎటువంటి ఢోకాలేకుండా కాసులు కురిపించేదన్నమాట. కమర్షియల్‌గా విజయవంతమైన సినిమాలు నమ్ముకున్న నిర్మాతలనూ.. బయ్యర్లనూ.. థియేటర్లలో పనిచేసే వాళ్లను.. పైన చెప్పుకున్న చిన్న చిన్న వ్యాపారస్తులను కష్టాల నుంచి బయట పడేసేది. మినిమమ్ గ్యారంటితో పెట్టిన పెట్టుబడులను మించి లెక్కకు మిక్కిలి లాభాలతో అందర్నీ ఒడ్డున పడేసిన సినిమాలు నాడు కోకొల్లలు. నేడు అలాంటి సినిమాలు ఎల్లలు దాటి వెదికినా ఏడాదికి నాలుగైదు కూడా కనిపించటం లేదు. నాడు పూర్తిస్థాయిలో కళకళలాడిన సినీ పరిశ్రమ నేడెందుకు వెలవెలబోతుంది అని ప్రశ్నించుకుంటే చాలా కారణాలు కనిపిస్తాయ. వ్యాపారాల్లో కోటాను కోట్లు సంపాదించిన వాళ్లు సినిమా గురించి ఏమీ తెలియకుండానే చిత్ర విచిత్రమైన పరిశ్రమకు రావడం ఒక కారణం. 24 శాఖలపై కనీస అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టడం మరో కారణం. ఏది మామిడి పండో.. ఏది జామపండో.. ఏది సీతాఫలమో తెలుసుకోకుండా విషఫలాలను పండించి ప్రేక్షకుల మీదకు వదిలిపెడుతుండటం మరో తప్పు. ఫస్ ట సీన్‌తోనే సినిమా జాతకం అర్థమై ఆడియన్స్ వెనక్కి తిప్పి పంపుతున్న సినిమాలు నేడు వందకి తొంభైశాతం అని తెరచింపి మరీ చెప్పొచ్చు. ఒకప్పుడు వందకు వంద, కొద్దికాలానికి వందకు యాభై అరవై కనిపించిన సక్సెస్ శాతం -నేడు ఐదు పదికి పడిపోవటంతో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడలేక చతికిలపడుతున్నాయ. వంద సినిమాలు విడుదలైతే అందులో పది మాత్రమే విజయం సాధిస్తే మిగతా 90 సినిమాలు పరిస్థితి ఏమిటి? ఆ సినిమాలు తీసిన వాళ్ల భవిష్యత్తు ఏమిటి? థియేటర్లనే నమ్ముకున్న వ్యాపారస్తుల సంగతేమిటి? అయినా ఇక్కడ ఆలోచించాల్సిన ముఖ్య విషయం నేడు వస్తున్న ఎంతటి భారీ చిత్రమైనా వారం రెండు వారాల కంటే కలెక్షన్స్‌ని రాబట్టలేక పోతుంది. ఆ రెండు వారాల తరువాత వ్యాపారస్తుల పరిస్థితి నడిసంద్రంలో నావలా పడి ఉండటమేనా? గత పదేహేనేళ్లుగా ఈ విపత్కర పరిస్థితులకు తట్టుకోలేక సినిమా హాళ్లను పడగొట్టి వాటి స్థానంలో కళ్యాణ మంటపాలు, అపార్ట్‌మెంట్లు, షాపింగ్ మాల్స్ వెలుస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. సినీ ప్రేక్షకులే కాదు పండిత పామరులు, మేధావులు విజ్ఞులు అందరూ ఈ విషయం గురించి సరిగ్గా ఆలోచిస్తే నేడు మూతపడుతున్న థియేటర్లను చూస్తుంటే పరిశ్రమ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో అర్థమవుతుంది. సునామిలాంటి భూతం సినీ పరిశ్రమను ఏ స్థాయికి తీసుకువెడుతుందో మూతపడుతున్న థియేటర్లను లెక్కగట్టి మరీ చెప్పొచ్చు. అసలు ఎందుకిలా జరుగుతుందని ఆలోచించే సినిమా పెద్దలే కరవయ్యారు. సమస్యలను సర్వనాశనం చేసి పరిశ్రమ పచ్చగా ఉండేలా తీర్చిదిద్ది ఆ దిశగా అడుగులు వేయంచే నాధులే కనిపించకుండా పోతున్నారు. అయినా సినిమా థియేటర్ల వాళ్లు నేటి సినిమాల వల్ల ఏ మాత్రమూ లాభాలు లేక పోవటంతో.. ఖాళీ స్థలానికే కోట్లకు కోట్లు రేటు పలుకుతుండటంతో గతంలో ఎన్నో సూపర్‌హిట్ల సినిమాలు నడిపించిన యాజమాన్యాలే.. థియేటర్లను మూసేసి రియల్ ఎస్టేట్‌వారికి అమ్ముకుని ఇతర వ్యాపార రంగాలవైపు తరలిపోతున్నారు. కొన్నవారు థియేటర్లను పడగొట్టి వాటిస్థానంలో కళ్యాణ మంటపాలు, అపార్ట్‌మెంట్లు, పాషింగ్‌మాల్స్ నిర్మించి ప్రతినెలా లక్షల్లో ఆదాయం సమకూర్చుకుంటున్నారనేది జగమెరిగిన సత్యం. తెలుగు సినిమా భయానక పరిస్థితి చూస్తుంటే, ముందు ముందు సినిమాలు నిర్మించే చిన్న నిర్మాతలు కనుమరుగైపోతారనేది ఇండస్ట్రీ టాక్. పల్లెల్లో కనిపించే మామూలు థియేటర్లలో పెద్ద సినిమాలు ఆడించే అవకాశం ఎలాగూ ఉండదు కనుక, అలాంటి థియేటర్లన్నీ దుకాణాలుగానో, శిథిలాలుగానో మారిపోవడం ఖాయం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చిన్న సినిమా థియేటర్ల యాజమాన్యలు, ఆ థియేటర్లనే నమ్ముకుని సోడా బీడా బిజినెస్ చేసే వ్యాపారులు.. అవన్నీ మానేసి ఇతర వ్యాపార రంగాలవైపు తరలిపోయన పరిస్థితిని చూస్తున్నాం. పరిశ్రమను కలుపుమొక్కలా పట్టి పీడిస్తున వీడియో పైరసీ సమస్య... నేడు ప్రతి టీవీ చానెల్లో నాలుగైదు నడుస్తున్న పరిస్థితి... థియేటర్లను దారుణంగా దెబ్బతీస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్ని ఛానళ్లల్లో కలిపి పాతిక ముప్పయి సినిమాలు ఇంట్లోనే దర్శనమిస్తుంటే ఇప్పటికే థియేటర్ వైపు వచ్చే వారే కరవవుతున్నారు. ఒకప్పుడు దూరదర్శన్‌లో గురువారం చిత్రలహరి, ఆదివారం ఒక సినిమా వచ్చేది అలా అన్ని ఛానళ్లలో సినిమాలను కట్టడి చేసి వారానికి ఒక ఛానల్లో ఒక సినిమా వచ్చేలా చూడాలి. నటీనటులు దర్శకులే కాదు ఇతర సాంకేతిక నిపుణులూ తమ తమ పారితోషకాలను కొంతలో కొంత తగ్గించుకుంటే సినిమా నిర్మాణానికి బడ్జెట్ తగ్గి నిర్మాతలు మరిన్ని చిత్రాలు తీయడానికి ఆసక్తి కనబరుస్తారు. సినిమా థియేటర్లు కొందరి చేతుల్లోనే ఉంటున్నాయన్న నిజం.. వాళ్ల సినిమాలే నడవాలన్న తపన.. ఈ పద్ధతి వల్ల చాలా సినిమాలకు థియేటర్లు దక్కించుకునే పరిస్థతి లేక మరుగున పడిపోతున్నాయి. కనీసం మూతపడిన థియేటర్లను తెరిపిస్తే కొంతలో కొంత ఫలితం ఉంటుంది. ఫంక్షన్ హాల్స్ , షాపింగ్ మాల్స్‌గా మారిపోయన థియేటర్లు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుని పరిశ్రమను పదికాలలపాటు పచ్చగా ఉండేలా చేయాలని ఆశిద్దాం.

-బంటు గిరివాస