మీ వ్యూస్

దిగజారుడు టాకీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా ప్రారంభం రెంటితో, ఇంటర్‌వెల్‌లో ఒంటితో తీసిన జాతీయ అవార్డు గ్రహీత సత్తారు సత్తా ఏమిటో గుంటూర్ టాకీస్‌తో వెల్లడైంది. ఈ సినిమా తర్వాత గతంలో సత్తారుకిచ్చిన అవార్డుని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తుంది. దిగజారుడుతనానికి పరాకాష్ఠ ఈ సినిమా. ఏం ఆశించి సినిమా తీశారో వారికే తెలియాలి. నరేష్‌లాంటి సీనియర్ నటుడు నటించాల్సిన సినిమానా ఇది? శృంగారానికి, బూతుకి ఉన్న తేడాని పూర్తిగా నిస్సిగ్గుగా చెరిపేసిన సినిమా ఇది. రేష్మిని నమ్ముకొని తీశారు. 24 క్రాఫ్టులలో ఏ ఒక్కదాని గురించి చెప్పుకునే అర్హతలేని సినిమా గుంటూర్ టాకీస్. ఊరు పేరు చెప్పి ఆ ఊరు పరువు తీసినట్టయ్యింది. టాలీవుడ్‌లో సన్నీలియోన్‌లా హాట్ స్టార్ అవుదామనుకున్న రేష్మి ఆశలు అడియాసలయ్యాయి.
-రాచపూడి లక్ష్మీనారాయణ, ఆదిలాబాద్

భక్తి పాటలు
ఆణిముత్యాల వంటి ఆపాతమధుర చిత్రాల్లో ఒక మంచి భక్తిపాటతో ప్రారంభం ఉండేది. ఆధ్యాత్మికత, చక్కని సాహిత్యం, లబ్ధప్రతిష్టులైన సంగీత దర్శకులు స్వరపరచిన ఈ గీతాలను ఘంటసాల, పిబి శ్రీనివాస్, సుశీలవంటి గాయనీగాయకులు పాడుతుంటే ప్రేక్షకులు భక్తితో వినేవారు. ఆ పాటలు నేటికీ రేడియోలో, టీవీల్లో శ్రోతలను, వీక్షకులను రంజింప చేస్తున్నాయి. నేటి సినిమాల్లో కమర్షియల్ విలువలు పెరిగి, భక్తిఅనేది మచ్చుకైనా కనబడటం లేదు. సాంఘిక చిత్రాల్లో భక్తిపాటలు అసలు ఉండవు. పెళ్లిళ్లవంటి సన్నివేశాల్లోనూ కమర్షియల్ సాంగ్స్‌పెట్టి వాటి ప్రాముఖ్యత దిగజారుస్తున్నారు. కొందరు ఘనాపాఠీలు దేవుళ్లపై సెటైర్లు, కామెడీ సీన్లు తీసి ప్రజలపై వదులుతున్నారు. మానవులకు సమున్నత వ్యక్తిత్వ వికాసాన్ని భక్తి అందిస్తుంది. సినిమా అనే శక్తివంతమైన సాధనం ద్వారా భక్త్భివన పెంపొందించడం చాలా సులభం. కానీ మనవారికి అవి కూడా తెలియదు.
-ఎం కనకదుర్గ, తెనాలి

విడుదల తేదీ ఇవ్వండి
ఫ్లాష్‌బ్యాక్‌లో మొనగాళ్లకు మొనగాడు సినిమా గురించి చదివాం. సేకరణకర్త ఈ సినిమా విడుదల తేదీని రాయడం మరిచారు. గతంలోనూ కొన్ని చిత్రాలకు విడుదల సంవత్సరం రాయడం మరిచారు. గమనించగలరు. రాబోయే రోజుల్లో ఆ లోటు లేకుండా జాగ్రత్త వహిస్తారని కోరిక. ఇక శరత్కాలంలో రమణమూర్తి కథనం చదివింపచేసింది. సినిమా రంగంలో ఎత్తుపల్లాలు అధిగమించడం ఆయనకే సాధ్యమైంది.
-మంగం ఆనందరావు, వేగివారిపాలెం

నాగులచవితి
వ్యాసం బాగుంది. అపురూపమైన పౌరాణిక ఘట్టాలకు దృశ్యరూపం కల్పించిన ఘనత తెలుగు చిత్ర పరిశ్రమకే దక్కుతుంది. అద్భుతమైన భక్తి, పౌరాణిక చిత్రాల పరంపరలో నాగులచవతి ఒక ఆణిముత్యంగా నిలిచింది. 50ఏళ్లు దాటినా ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. నదులు, పుణ్యక్షేత్రాలు, పాతివ్రత్యం ప్రాశస్త్యాలను అద్భుతంగా తెలియజేస్తుందీ చిత్రం.
-సి ప్రతాప్, శ్రీకాకుళం

సక్సెస్-కామెడీ
కామెడీ హీరోలు వ్యాసం ఆలోచింప చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ నటులు తాము సృష్టించుకున్న ఇమేజ్‌కి బానిసలు. ఆ చట్రం నుండి బయటపడడం అసంభవం కాదుగానీ, కష్టసాధ్యం. పడిన ముద్రను క్రమక్రమంగా చెరుపుకుంటూ రావాలిగానీ ఒక్కసారిగా హీరోచిత డాన్సులు, ఫైట్లు, రొమాన్స్‌కు వెళ్తే జనం తిప్పికొడతారు. అందాల రాముడు, మర్యాదరామన్న హిట్టవ్వడానికి కారణం సునీల్ కామెడీ వదులుకోకుండా కొన్ని సన్నివేశాల్లో మాత్రమే హీరోచితంగా ప్రవర్తించడం. పూలరంగడులో సిక్స్‌ప్యాక్ ప్రదర్శించినా ముఖం పీక్కుపోయి, ఎవరి శరీరానికో సునీల్ ముఖం తగిలించిన అనుభూతి కలిగి హిట్‌కాలేదు. కమెడియన్లు ఇమేజ్‌ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ కొత్త ఇమేజ్ సాధిస్తే సక్సెస్ అవుతారు.
-సి మైథిలి, సర్పవరం

వివాహం తర్వాత..
పెళ్లయ్యాక కూడా హీరోయిన్‌గా రాణించిన తారలెందరో ఉన్నారు. గతంలో వారు శృంగార సన్నివేశాలు శృతిమించకుండా చూసుకునేవారు. పోటీని తట్టుకోడానికి వాళ్లిప్పుడు హద్దులు మీరుతున్నారు. ఆ విషయం బహిరంగంగా చర్చించరు. కానీ కరీనా రూటే సెపరేటు. కీ అండ్ కా చిత్రంలో ఆమె ముద్దు సీన్లో పాల్గొనడమే కాదు, హీరో అర్జున్‌కపూర్ ఎంత బాగా ముద్దుపెట్టాడంటే నా భర్త కూడా అంత బాగా పెట్టలేడని కితాబిచ్చింది. ఔరా! ఎంత బరితెగింపు! ఎందుకంటే భర్త సైఫ్‌కంటే ఆమె సంపాదనే ఎక్కువ మరి! నిజంగా ఇది చిత్ర విచిత్ర ప్రపంచమే!
-పి చంద్ర, కాకినాడ

ఆలోచించాల్సిన ప్రశ్న
కమెడియన్లు హీరోలుగా పనికిరారా? ఆలోచించాల్సిన ప్రశే్న! తెలిసో తెలియకో నటులు ఒక్కో చట్రంలో ఇరుక్కుపోతారు. కొందరే దాన్నుండి బయటపడగలుగుతారు. అలనాటి అక్కినేని సాంఘిక హీరో. ఎన్టీఆర్ జానపద, పౌరాణిక హీరో. ఎన్టీఆర్ చట్రం నుండి బయటపడి సాంఘిక చిత్రాల్లోనూ రాణించినా, అక్కినేని పౌరాణికాల జోలికి పోలేదు. చంద్రకళ హీరోయిన్‌గా చేసినా, ఆమెను చెల్లిగానే చూశారు ప్రేక్షకులు. కాంతారావు సాంఘికాల్లో నటించినా జానపదాలు, పౌరాణికాలే ఆయన్ని నిలబెట్టాయి. సీతగా రంగప్రవేశం చేసి రెండు మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసిన గీతాంజలి హాస్య నటి చట్రంలో బిగుసుకుపోయింది. అంతా ఇమేజ్ చట్రం మహిమ!
-బి చంద్రిక, రాజేంద్రనగర్

స్పష్టతలేని సినిమా
ప్రస్తుతం సినిమా పరిశ్రమతోపాటుగా ప్రజలకు కూడా బాగా ఆసక్తి కలిగిస్తున్న విషయం చిరంజీవి 150వ సినిమా. ఈ సినిమాపే లెక్కలేనన్ని కథనాలు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కడా స్పష్టత లేదు. చిరంజీవి ఈ సినిమాకోసం ఎందుకింత ఆలస్యం చేస్తున్నారో అర్ధంకావడం లేదు. ఆయన ఏవో పాట్లు పడటంకన్నా తనని అంత గొప్ప హీరోని చేసిన ప్రజల జీవనానికి దగ్గరగా ఉండే కథలతో తీసిన గత సినిమాలను పరిశీలించి, కథను సిద్ధం చేసుకోవాలి.
-పెయ్యల శ్రీనివాస్, శ్రీకాకుళం