Others

వృత్తి పట్ల అదీ గౌరవం -- శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఫొటో చూడండి.. నటరత్న ఎన్టీఆర్ అంటే అప్పట్లో నిజంగా సూపర్‌స్టార్. ఆయన వస్తే కుర్చీలు వేసి అడుగులకు మడుగులొత్తేవాళ్ళు సెట్‌నిండా వుంటారు. ఒక్క సెట్టేం ఖర్మం.. ఎక్కడికిపోయినా అక్కడ కళాకారుడికి లభించే గౌరవమే అలాంటిది. అలాగని ఎక్కడికివెళ్లినా తామేదో రాజుల్లాగా, అభిమానులను పాలించే దేవుళ్లలాగా ఏరోజునా ప్రవర్తించిన దాఖలాలు కనిపించవు. అహంకారానికి తావివ్వని మామూలు నటీనటుల్లాగే ఉండేవారు. ఆ అణకువ కారణంగానే అభిమానుల చేత గొప్పవారుగా ఆరాధింపబడ్డారు. ఈ చిత్రంలో మహానటుడు ఎన్టీఆర్ ఓ సినిమాకు సంబంధించిన పాటల రికార్డింగ్ కార్యక్రమానికి ముందు జరుగుతున్న చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పటిది. నేను హీరోనన్న ఇమేజ్‌ను పక్కనపెట్టి, ఆయన కోసం వేసిన కుర్చీలను పక్కనపెట్టి అందరితోపాటుగా కింద కూర్చుని బాణీల చర్చల్లో పాల్గొన్నారు. గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల, పాటల రచయిత కొసరాజు తదితరులతోపాటుగా తానూ అందరిలో ఒకడై ఒదిగిపోయిన నిగర్వి ఎన్టీఆర్. అప్పటి తరానికి ఏ మాత్రం భేషజాలు లేవని చెప్పడానికి ఈ చిత్రమొక్కటి చాలు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717