Others

నాకు నచ్చిన పాట --నన్నుదోచుకుందువటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గులేబకావళి సినిమా కోసం సినారె రాసిన తొలి గీతంగా గుర్తించబడిన ‘నన్ను దోచుకుందువటే..’ గీతం నాటినుండి నేటి వరకు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటూనే వుంది. సినారె కలం సామాన్య ప్రేక్షకుడిని సాహిత్యాభిలాషులైన వారికి కూడా నచ్చేలా పదాలను పొందుపరిచింది. నీ చరణమ్ముల నీడలోన, కర్పూర కళికలాగ, పూలదండలాగ నా జీవితం అర్పిస్తానని భార్య అంటే, కలకాలం నిలిచిపోయే సంకెలలు వేసినావు అని భర్త ప్రశంసిస్తాడు. నా మనస్సునే గుడిగా చేసి, నిన్ను కొలుచుకుంటానని ఆమె తన్మయంతో అర్ధిస్తే మన బంధం ఇగిరిపోని గంధం అని అభయం ఇస్తాడు భర్త. ఈ భావానికి అద్భుతమైన బాణీతోడై ఘంటసాల, సుశీల గానామృతం మధుర భావనలకు లోనుచేస్తుంది. పాట ప్రారంభంలోనే వినిపించిన వేణువుతో ప్రేక్షకులు సమ్మోహితులవుతారు. ఈ సినిమాలో అన్ని పాటలు ప్రేక్షకుల పెదవులపై ఎప్పుడూ కదలాడుతూనే ఉంటాయి. ఎన్టీఆర్, జమున హిట్ పెయిర్ గీతాలలో ముందు వరుసలో నిలిచే ఈ గీతం చెరగని ముద్ర వేసింది.

-ఎస్‌ఎస్ శాస్ర్తీ, విశాఖపట్నం