Others

జంధ్యామారుతం--శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా హాస్యానికి పింగళి నాగేంద్రరావు ఒక పార్శ్వం అయితే, నవ్వటం యోగం, నవ్వించటం భోగం, నవ్వకపోవటం రోగం అని చాటిన జంధ్యాల మరో పార్శ్వం. ఎన్నో హాస్య పాత్రలు పుట్టించి, ఎందరో హాస్య నటీనటులకు జన్మనిచ్చిన హాస్యబ్రహ్మ జంధ్యాల. అసలు పేరు వేంకట దుర్గా శివ సుబ్రమణ్యశాస్ర్తీ. ఇంటిపేరు జంధ్యాలతో సినీ ప్రయాణం మొదలుపెట్టి, దర్శకుడిగా మొదటి చిత్రం ముద్దమందారం (ప్రదీప్, పూర్ణిమ)తోనే మంచి పేరు తెచ్చుకున్నారు. శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, జగదేకవీరుడు అతిలోకసుందరి, వేటగాడు లాంటి హిట్టు సినిమాలను పుట్టించిన రచయితగా, నెలవంక, ఆనందభైరవిలాంటి గొప్ప సినిమాలకు దర్శక రచయితగా పేరు తెచ్చుకున్నారు. రచయితగా 350 చిత్రాలకుపైగా కలాన్ని కదిలించిన అనుభవం, దర్శకుడిగా 39 సంస్కారవంతమైన చిత్రాలను అందించిన నైపుణ్యం -జంధ్యాలను ప్రత్యేకస్థానంలో నిలబెట్టాయి. తెలుగు సినీ హాస్యానికి ఆయన వేసిన మార్క్ -శాశ్వతమైనది. ఆనందభైరవి చిత్ర యూనిట్ సంగీత నృత్య విభావరి కార్యక్రమాన్ని అమెరికాలో పలు ప్రాంతాల్లో దిగ్విజయంగా నిర్వహించిన మొదటి తెలుగు చిత్ర జైత్రయాత్రను ప్రవాసాంధ్రులు నేటికీ మరీమరీ గుర్తు తెచ్చుకొంటారు. అమెరికాలోని తెలుగువారి సహకారంతో అమెరికన్‌వాసి హీరోగా విజయశాంతి నాయికగా నిర్మించిన పడమటి సంధ్యారాగం చిత్రం అటు అమెరికాలోని తెలుగువారితోపాటు తెలుగు ప్రజలనూ అమితంగా ఆకట్టుకుంది. అదీ -జంధ్యాల అంటే. 1951లో తెలుగువారి పెద్దపండుగ సంక్రాంతినాడు జన్మించి, 2011 జూన్ 19న తనువు చాలించిన జంధ్యాల జీవించిన అర్ధశతాబ్ది కాలంలోనే తెలుగువారు శతాబ్దాల కాలంపాటు గుర్తుంచుకొనే కీర్తిని పొంది తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా మిగిలిపోయారు. అందుకే ధన్యజీవి జంధ్యాల అని తెలుగువారు వేనోళ్ళ కీర్తిస్తుంటారు. హైదరాబాద్‌లోని ఓ కార్యక్రమానికి హాజరై చిర్నవ్వులతో నాకు దొరికిన జంధ్యాల ఇలా.

-పర్చా శరత్‌కుమార్ 9849601717