రివ్యూ

ఆ రెండూ లేవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*రొమాన్స్ విత్ ఫైనాన్స్

తారాగణం:
సతీష్‌బాబు, మెరీనా, ప్రియాంక, సురేష్, ధన్‌రాజ్, చలాకి చంటి, ఉమ,
సంగీతం:
జాన్ పోట్ల
కెమెరా: మురళి
నిర్మాత: జనార్దన్ ముదుముల
దర్శకత్వం:
రాజు కుంపట్ల

---
బాగోలేదు
---
ప్రేమికులు ప్రేమించడంలో సిద్ధహస్తులే. కానీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ఆలోచన లేనివాళ్లేనని ఈ సినిమా చెబుతుంది. ప్రేమ ఆకర్షణకు పుడుతుందా? డబ్బుకు పుడుతుందా? లేక అవసరానికి పుడుతుందా? అనంటే ఆయా వ్యక్తుల మానసిక వైకల్యాలు, స్థైర్యాలను బట్టి వుంటుంది అని సమాధానమొస్తుంది. ప్రేమించడం తప్పుకాదు కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోవడం పెద్ద తప్పు. ఒకసారి మనసిచ్చాక ఆ మనిషిని గూర్చి పాజిటివ్‌గానే ఆలోచించాలి. లేదా ప్రేమించకముందే ఆ మనిషిలో వున్న గుణగణాలను బేరీజు వేసి ముందుకెళ్లగలగాలి. అలా కాకుండా క్షణికమైన ఆకర్షణతో ప్రేమలో పడితే ఆ తరువాత పరిణామాలను ఎదుర్కొని నిలవగలిగితేనే ఆ ప్రేమ నిలుస్తుంది లేదా ఓడిపోతుంది.
కథేంటి?
ఈ చిత్రంలో కథ ఏమీ లేదు. ఒకబ్బాయి జై (సతీష్‌బాబు) ఒక అమ్మాయి చైత్ర (మెరీనా)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె కరుణకోసం దేవాలయాల చుట్టూ తిరుగుతాడు. అక్కడకొచ్చిన ఆ దేవత అతన్ని చూసి వరించింది. కథ మెయిన్ ట్రాక్‌లో బాగానే సాగింది. ఒకరోజు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు హీరో. ఛీ ఛీ నీమీద నాకు అలాంటి భావన ఎప్పుడూ లేదంటూ పక్కకు తొలగిపోయింది చైత్ర. ఇదేంటీ? అనుకొని అంతకుముందే అలవాటున్న మందును మరింత ఎక్కువ తాగేస్తాడు అబ్బాయి. ఈ నేపథ్యంలో అటువైపునుండి చైత్ర స్నేహితురాళ్లు, ఇటువైపునుండి జై స్నేహితులు వాళ్ళిద్దర్నీ మళ్లీ ప్రేమించుకోమని, పెళ్లిచేసుకోమని బతిమిలాడేస్తుంటారు. చివరికి వాళ్ళ కథ ఏమైంది అనేదే ముగింపు.
ఓ చిన్న పాయింట్‌ను పట్టుకుని రెండున్నర గంటలపాటు సాగదీసిన దర్శకుడి ధైర్యానికి హేట్సాఫ్ చెప్పొచ్చు. కాకపోతే సన్నివేశాలను స్క్రీన్‌ప్లే బిగువుతో చిత్రీకరిస్తూ ప్రేక్షకుడికి బోరు కొట్టకుండా ఉన్నట్లయితే సినిమా బాగుండేది. ఉన్నంతవరకూ హీరో హీరోయిన్లమధ్య వచ్చే సన్నివేశాలన్నీ ఫర్వాలేదు. ఈ సినిమాలో మరో గొప్ప విషయమేమిటంటే ఎక్కడా స్టూడియో షాట్లే లేవు. అన్నీ ఔట్‌డోర్ షాట్లే. ఓ రకంగా మొత్తం ఓ కాలేజీ క్యాంపస్‌లో సాగే వ్యవహారం. ఆ క్యాంపస్‌లో వుండే రకరకాల ప్రేమికులు, వాళ్ల బాధలు, గాధలు అన్నీ ఔట్‌డోర్‌లోనే చిత్రీకరించాడు దర్శకుడు. సినిమాలో ప్రధానమైన కథ లేకపోవడం మైనస్ పాయింటే. హీరోయిన్ ఎందుకు అతని ప్రేమను తిరస్కరించింది అనే కథనమైనా బలంగా వున్నట్లయితే ప్రేక్షకుడు ఆనందించేవాడు. ఓ చిన్న సిల్లీ పాయింట్ పట్టుకుని హీరోయిన్ హీరో ప్రేమను రిజెక్ట్ చేయడమనేది సరైనది కాదు. కథ అలా వుంది అందామా.. అందులో అర్థం లేదు. అందుకే లేని కథను రెండు గంటలపాటు లాగించిన కథనం, సినిమాలో దమ్మును చూపించినట్లయితే మరింత బాగుండేది. రొమాన్స్ విత్ ఫైనాన్స్ అన్న టైటిల్‌కు జస్ట్ఫికేషన్ కూడా రాలేదు. అది మనీషా పాత్రలో వచ్చింది. కానీ ఆ పాత్ర ప్రధానమైనది కాదు! చైత్ర, జైలమధ్య వచ్చే కథనంతోనే సినిమా పేరును ఆకట్టుకునేలా పెడితే ప్రేక్షకులు మరికొందరు థియేటర్లకు వచ్చేవారేమో! నటీనటుల్లో చైత్రగా మెరీనా అక్కడక్కడా మెరుపులు మెరిపించింది. విషాద సన్నివేశాల్లో తేలిపోయింది. సతీష్‌బాబు నటుడిగా అ ఆలు దిద్దే స్థాయిలోనే ఉన్నాడు. అతనికన్నా స్నేహితుడు సూరిగా చేసిన సురేష్ ఫర్వాలేదనిపించాడు. కొత్త కొత్తగా, పోవే పోవే పోపోవే, పడి పడి ఎగసే పొడి పొడి సొగసే పాటలు ఆకట్టుకుంటాయి. సంగీతం ఫర్వాలేదు. నేపథ్య సంగీతం మైనస్. సినిమాలో ఎక్కువ మార్కులు పొందేది మాత్రం కెమెరా పనితనం. కథ కథనాలు ఎలా వున్నా కెమెరా పనితనంతోనే సినిమాకు ఒక రూపం వచ్చింది. ఆలస్యం చేసిన ప్రేమ, ఓపెన్ చేసిన బీరు విషంరా, అబ్బాయిలు చీమల్లాంటివారు, మనం చెక్కరలాంటివాళ్ళం, మన చుట్టూ తిరుగుతూనే వుంటారు, ఐడియాలు వడియాల్లా ఎప్పుడుపడితే అప్పడు రావురా లాంటి మాటలు ఫర్వాలేదనిపించాయి. దర్శకత్వ పరంగా ఇంకా పదును తేలాల్సిన అవసరం వుంది. ఇందులో ఓ పాత్ర చెప్పినట్టుగా సీరియల్‌లా సాగదీస్తావేందిరా అన్నట్లుగా సినిమా సాగింది అలా!

-శేఖర్