Others

చింతామణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతామణి నాటకాన్ని చలన చిత్రానికి తగినట్టుగా రావూరి సత్యనారాయణ రచించారు.

కళ: శ్రీ్ధర్
నృత్యం: చోప్రా, వేదాంతం జగన్నాథశర్మ
సంగీతం: టివి రాజు, అద్దేపల్లి రామారావు
సంగీత పర్యవేక్షణ: భానుమతి
కూర్పు, నిర్మాణం, దర్శకత్వం:
పి రామకృష్ణ.

--
సంఘ సంస్కర్త, మహాకవి, సుప్రసిద్ధ నాటకకర్త, న్యాయవాది
కాళ్ళకూరి నారాయణరావు. ఆయన రచించిన నాటకాల్లో సాంఘిక దురాచారాలైన వరకట్నంపై ‘వరవిక్రయం’, వేశ్యావృత్తిపై
‘చింతామణి’, తాగుడు వ్యసనంపై ‘మధుసేవ’ ప్రసిద్ధిపొందాయి. 1939లో వరవిక్రయం, 1956లో చింతామణి చలన చిత్రాలుగా రూపొందాయి. ‘వర విక్రయం’ చిత్రం ద్వారా చిత్రసీమలో
ప్రవేశించిన భానుమతి, తమ భరణీ పిక్చర్స్ పతాకంపై ‘చింతామణి’ రూపొందించటం విశేషం. ఏప్రిల్ 11, 1956లో విడుదలైన
ఈ చిత్రం 60ఏళ్లు పూర్తి చేసుకుంది.

ప్రముఖ వ్యాపారవేత్త వాసుదేవమూర్తి (వక్కలంక కామరాజు). కొడుకు బిల్వమంగళుడు (ఎన్టీ రామారావు), కోడలు రాధ (జమున)ది అన్యోన్యమైన దాంపత్యం. ఆ నగరంలో శ్రీకృష్ణుని భక్తురాలు చింతామణి (్భనుమతి). వేశ్యావృత్తిలో జీవిస్తుంటుంది. ఆమె తల్లి శ్రీహరి (ఋష్యేంద్రమణి). బిల్వమంగళుని చిన్ననాటి స్నేహితుడు భవాని శంకరం (ఎస్వీ రంగారావు) చింతామణిపై మోహంతో ఆస్తిపాస్తులను పోగొట్టుకుంటాడు. అదే వూరిలోని సుబ్బిశెట్టి (రేలంగి) అనే వ్యాపారి చింతామణి ప్రాపకం కోసం, తండ్రి (బొడ్డపాటి), భార్య (్ఛయాదేవి)కు తెలియకుండా ఊరిలో అప్పులుచేసి ఆమెకు కానుకలు ఇస్తుంటాడు. భవాని శంకరం ద్వారా చింతామణి బిల్వమంగళునితో పరిచయం పెంచుకుంటుంది. పండితుడు, మంచివాడు అయిన బిల్వమంగళుడు చింతామణి వ్యామోహంలో చిక్కుకొని, భార్యను, తండ్రిని నిర్లక్ష్యం చేస్తాడు. అనారోగ్యంతో తండ్రి మరణిస్తాడు. భార్య ఒంటరిదౌతుందన్న ఆలోచన కూడా లేకుండా, తుఫాన్ రాత్రి కూడా చింతామణి కోసం బయలుదేరుతాడు. భర్తను వారించ అశక్తురాలై, అతన్ని అనుసరించిన భార్య రాధ కాలుజారి నదిలోపడి మరణిస్తుంది. భార్య అని తెలియక ఆమె మృతదేహాం ఆధారంగా ఒడ్డుచేరిన బిల్వమంగళుడు, చింతామణి ఇంటివద్ద పూలతీగ అనుకుని ఓ సర్పాన్ని పట్టుకుని ప్రాకి లోపలికి ప్రవేశిస్తాడు. చింతామణి అంత రాత్రివేళ అతను వచ్చినందుకు ఆశ్చర్యపడి, దీపం వెలుగులో అతనితో కలిసి వెళ్ళి పామును, రాధ శవాన్ని గుర్తిస్తుంది. తనపై వ్యామోహం వదలుకొమ్మని చెప్పి సన్యాసి వేషంలో వెళ్ళిపోతుంది. తండ్రికి, భార్యకు అంత్యక్రియలు పూర్తిచేసి, అంధుడైన బిల్వమంగళుడు దైవధ్యానంలో కాలం గడుపుతుంటాడు. చింతామణి శ్రీకృష్ణ ధ్యానంలో అతనికి శిష్యురాలిగా వర్తిస్తుంది. శ్రీకృష్ణుడు, రుక్మిణితో కలిసి అక్కడకు వచ్చి అచ్చట సాధువులను, బిల్వమంగళుని ఓ భరిణెలో ఏమున్నదని ప్రశ్నించి, దానికి సరియైన జవాబు వీరిచే పొంది చింతామణి, బిల్వమంగళును ఆశీర్వదించటం. వారిరువురూ శ్రీకృష్ణునిలో ఐక్యంకావటంతో చిత్రం ముగుస్తుంది.
ఈ చిత్రంలో బిల్వమంగళుని పాత్రకోసం నిర్మాతలు మొదట అక్కినేని నాగేశ్వరరావును సంప్రదించారు. ఆయన దానికి అంగీకరించకపోవటంతో ఎన్టీ రామారావును సంప్రదించగా ఆమోదించటం జరిగింది. ఎన్టీ రామారావు ఈ చిత్రంలో నాయకుని పాత్రకు పరిపూర్ణమైన న్యాయం చేకూర్చారు. భార్య రాధపట్ల ప్రేమ, అనురాగం, తండ్రిపట్ల గౌరవం, చింతామణి నృత్యానికి ఆకర్షింపబడి ఆమెతో శాస్త్ర చర్చలపట్ల పండితునిగా మక్కువ, ఆమె స్వభావం, సౌందర్యంపట్ల వ్యామోహంతో ఇల్లాలికి దూరంకావటం, భార్య రాధ ‘లోకంలో భర్తయే అందని మానిపండైన భార్య భరించగలదా’ అని అడిగితే ‘నీ హక్కులకోసం ఇంకా ఆరాటపడుతున్నావా రాధా. అన్ని ధర్మాలను విడిచి నా మనసు పరాధీనం అయిపోయింది. అందము, సుగుణాలువున్నా పెళ్ళాడిన భార్య అవటమే నీలోపం’ అంటూ ఎంతో నిగ్రహంతో నిజాన్ని వెల్లడించటంలో పలికిన సంభాషణలు, నదిఒడ్డున భార్య శవం ఒడిలో పెట్టుకొని ఆమె సుగుణాలు తలపోస్తూ చింతించటం, చివరకు అంధుడై శ్రీకృష్ణుని భక్తిలో తరించటం, ఎంతో సౌమ్యత, శాంతం చూపే పాత్ర బిల్వమంగళునిగా ఎన్టీ రామారావు తన నటన నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
అనుకూలవతియైన ఇల్లాలిగా, చివర నదిలో బల్లకట్టులేదని, భర్త ఇబ్బంది పడతాడని ఆ సంగతి తెలియచేయాలని, అతనికై వేదనతో పరుగుపెట్టడం, అంతకుముందు మామగారు మరణించగా ‘శవ జాగరణ చేయలేను తోడువుండమని’ దైన్యంతో కోరిన వనిత, భర్తకోసం అన్నీ మరచి ధైర్యంతో పరుగుపెట్టడం, ఈ పాత్రను సహజ నటి జమున ఆకట్టుకునేలా నటించింది.
చింతామణిగా భానుమతి కరుణ, మంచితనం, శ్రీకృష్ణుని ఎడల భక్తి, వేశ్యగా వృత్త్ధిర్మాన్ని తనపై వ్యామోహం వదలుకొమ్మని బిల్వమంగళుని కోరటం, తల్లి అడగమందని, భవాని శంకరాన్ని డబ్బుకోసం ఒత్తిడి చేయటం, బిల్వమంగళునితో పరిచయం కల్పించమనే సందర్భంలో వ్యాసుడు, విశ్వామిత్రుడు, విప్రనారాయణుడు, ఋష్యశృంగుడు వంటి మహాపురుషుల ప్రస్తావన తెచ్చి పాండిత్యం ప్రదర్శించటం, నృత్య, గానాలతోనూ అలరించేలా నటించింది.
నాటకంలోని సన్నివేశాలను, సంభాషణలను చిత్రానుగుణంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్ది తమ ప్రతిభను చూపారు దర్శకులు పి రామకృష్ణ, రచయిత రావూరి సత్యనారాయణ. మిగిలిన సాంకేతిక నిపుణులు, వీనుల విందైన సంగీతాన్ని అందించడంలో సంగీత దర్శకులు అద్దేపల్లి, టివి రాజుల కృషి ఫలించింది.
చిత్ర గీతాలు, పద్యాలు
శ్రీకృష్ణుని విగ్రహంముందు భానుమతి నృత్యంతో చిత్రీకరించిన గీతం -రావోయి, రావోయి ఓ మాధవా అందాల రాధ అలిగింది (పి.్భనుమతి). శ్రీకృష్ణుడు, రుక్మిణిలపై చిత్రీకరించిన తత్వగీతం -కనరా శ్రీహరి లీలలు/ కనరా ఈ జగమంతా నీ మాయాజాలమ్ (కె రఘురామయ్య). రాధ (జమున)పై చిత్రీకరించిన పద్యం -తనియ ధనుడు రూపసి యొప్పనివాడు వివేకి (పి.లీల, చింతామణి నాటకం నుంచి). బిల్వమంగళునిపై పద్యం -అర్ధాంగి లక్ష్మిఐనట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా (చింతామణి నాటకం నుంచి ఘంటసాల). భవాని శంకరం, చింతామణితో పద్యం -విడిచితి బంధువర్గము (మాధవపెద్ది, చింతామణి నాటకం నుంచి). నాటకంలోని మరికొన్ని పద్యాలు.. -ఇంతులు తారసిల్లువరకే పురుషాగ్రాణలెంతలేసి (్భనుమతి), -తాతలనాటి క్షేత్రములెల్ల/ తెగనమ్మి దోసిళ్ళతో తెచ్చి (మాధవపెద్ది), -దివ్య స్థలంబగు తిరుపతి కొండను (మాధవపెద్ది), -నలువురు నోటగడ్డియిడ (మాధవపెద్ది), -నను దేవేంద్రునిగా నొనర్తుననియెన్ (మాధవపెద్ది), -కలిగిన భాగ్యమెల్లను మొగంబున తెచ్చితి (మాధవపెద్ది), -ఇంట రంభలవంటి ఇంతులుండగ సాని సంపర్కముగోరు (మాధవపెద్ది). కె రఘురామయ్య పాడిన పద్యాలు -తాపస వృత్తిబూని పృధుశ్చాన మొనర్చియునన్ను చేరగా, -పసిడి శీలమ్ము నమ్మిన పతితవయ్యో, -పూజ్యుల ఇంట పుట్టిన చాలునా బ్రతుకొక్క ధర్మమై, -్భక్త్భివము తొలుపారు బహుళగతుల ఆత్మచింతన. రేలంగి పాడిన నాటకంలోని పద్యాలు -ఎంత దయోచింతలపై పంతంబున, -కాని రోజులువచ్చి కళ్ళుమూసుకుపోయి చల్లగ సాని ఇంటికి. జమునపై -తగునా నను నీటముంచతగునా (పి.లీల), ఎన్టీఆర్‌పై -చదివితి సమస్త శాస్తమ్రులు చదివి ఏమి ఫలము (ఘంటసాల), -చూచిన వేళ ఎట్టిదియో చూడక యుండిన (ఘంటసాల), -తల్లిరో నీదు వాదామృతధారలు (ఘంటసాల), జమునపై పద్యం -హైందవ సుందరీమణుల కాత్మవిభుండె (పి.లీల), ఎన్టీఆర్‌పై పద్యం -తాలిమిభూమికీడైన దాని (ఘంటసాల), భాగవతంలోని పద్యం సిరికిన్ చెప్పడు (పి.లీల), ఎన్టీఆర్‌పై శ్రీకృష్ణకర్ణామృతంలోని పద్యం -కస్తూరి తిలకం లలాట పలకే (ఘంటసాల).
చిత్రంలో భానుమతి, ఎన్టీఆర్‌పై యుగళ గీతం -అందాలు చిందేటి ఆనందసీమా రాగాల తూగే శృంగార మేమో (్భనుమతి, ఎఎం రాజా.. రచన రావూరి). మరో భక్తిగీతం -జయజయాసుందర వనమాలి (ఘంటసాల, భానుమతి- రావూరి). చల్లని జాబిలి, తెల్లని వెనె్నల, శే్వతవర్ణపు దుస్తుల్లో భానుమతి నృత్యంతో అలరించేలా చిత్రీకరించిన గీతం -పున్నమీ చకోరి నోరుూ లేవోయి హాయి జాబిలి (్భనుమతి- రావూరి). దేవాలయంలో భానుమతి నృత్యగీతం -మేలాయే నీ వేళ శ్రీవేణుగోపాల (్భనుమతి). శ్రీకృష్ణుని స్వప్నంలో చూచిన చింతామణి పాడేగీతం -తీయని వేణువులూదిన దారుల పరుగిడు రాధనురా (్భనుమతి-రావూరి). ఆ సందర్భంలోని పద్యం -వౌనులు సతతమున్ భజింపగనిపింపన్ (్భనుమతి- చింతామణి నాటకంలోనిది).
‘చింతామణి’ చిత్రంలోని పాత్రధారులంతా పాత్రోచితంగా నటించి అలరించారు. చక్కని రచనతో, సమర్ధవంతమైన దర్శకత్వంతో చిత్రం ప్రశంసనీయంగా రూపొందింది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి