Others

నాకు నచ్చిన పాట--ఇదే నా మన సంప్రదాయమిదేనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలు ఇన్నీ అన్నీ కాదు. ఎందరో స్ర్తిమూర్తులకు పసుపుతాడే ఉరితాడై ప్రాణం తీస్తుంది. వరకట్నపు మంటలకు ఆహుతి అవుతున్నారన్నది నిజం. ఈ సంప్రదాయం అప్పటికీ యిప్పటికీ కొనసాగుతూ ఉండటం విచారకరం. పద్మశ్రీ ఘంటసాల గళంతో ‘వరకట్నం’ చిత్రంలో కథానాయకుడు నటరత్న నందమూరి తారక రామారావు నటనతో సమాజాన్ని సంప్రదాయాల్ని నిలదీస్తూ ప్రశ్నిస్తూ సాగే -ఇదే నా మన సంప్రదాయమిదేనా/ వరకట్నపు పిశాచాల దురంతాల కోరలలో/ అనె్నం పునె్నం ఎరుగని ఆడబ్రతుకు బలియేనా అంటూ పాడే ఈ పాట అప్పట్లో ఓ సంచలనం. సినిమాకే హైలైట్. పాట అర్థవంతంగా వుండి సంగీతపరంగానూ వినసొంపుగా ప్రేక్షక హృదయాలను తాకిన చక్కని గీతం. భార్యాభర్తలు ఇద్దరూ సమానమే అనుకొని సాగిపోతే సంసారం నిండుగా కొనసాగుతుంది. కానీ వరకట్నం పేరుతో వేధిస్తూ అబలలను అన్యాయంగా కబళిస్తున్న ఈ సంస్కృతి ఇంకా కొనసాగటం మన దౌర్భాగ్యం. మహిళలకు విద్యాబుద్ధులతోపాటు అన్నింటా సమాన అవకాశాలు కల్పిస్తే వరకట్న ప్రసక్తేరాదు. డాక్టర్ సి నారాయణరెడ్డి కలంనుండి జాలువారిన మరొక ఆణిముత్యం ఈ పాట సామాన్యులకు కూడా అర్థమవుతుంది. ఇంకా ‘చట్టాలను చేసి లాభమేమి/ దినందినం శాసనాలు చేసి లాభమేమి/ బుసకొట్టే స్వార్థమ్మును విసిరికొట్టలేనిది/ సహనమూర్తియైన స్ర్తిని గౌరవించలేనిది/ అని ప్రశ్నిస్తూనే ఏంచేయాలో కూడా చెపుతారు రచయిత. పురాణాలు తిరగేసిన చాలదు/ ధర్మపన్నాలు వల్లించిన తీరదు/ చెప్పే నీతులన్నీ చేతలలో చూపాలి/ అబలల కన్నీటి మంటలార్పివేయగలగాలి’’ అని చెప్పే ఈ పాట సాంఘికంగా స్ర్తిలకు న్యాయం జరగాలని హెచ్చరిక. ఈ సమాజానికి, సంఘానికి పంపటంవలన కొందరైనా మారతారని రచయిత ఆశయం నెరవేరాలని ఆశిద్దాం!

--

వెనె్నల రచయితలకు
సూచన
వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో పళశశళ్ఘబజూళషష్ఘశ్ఘౄజ.ష్యౄకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-కాకరపర్తి సుబ్రహ్మణ్యం, తెనాలి