Others

పెద్ద స్టార్‌తోనే వస్తానేమో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైరెక్టర్ సాయ సురేశ్

అల్లరి నరేష్ హీరోగా జేమ్స్‌బాండ్‌తో దర్శకుడి ప్రస్థానం ప్రారంభించాడు సాయికిషోర్. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునే సినిమా తెరకెక్కించి మంచి మార్కులే సంపాదించాడు. నిర్మాత అనిల్ సుంకర ఇచ్చిన తొలి అవకాశాన్ని సరిగ్గానే వాడుకున్న సాయికిషోర్ మలి ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు. రెండో ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన సాయికిషోర్‌తో చిట్‌చాట్

మీ నేపథ్యం?
పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. స్టూడెంట్ డేస్‌లోనే సినిమా అంటే పిచ్చి. అది క్రమంగా కెరీర్ ఆసక్తిగా మారింది. డైరెక్టర్ టార్గెట్‌తో ఇండస్ట్రీకి వచ్చాను.

ఎక్స్‌పీరియన్స్?
స్ట్రెయిట్ డైరెక్టర్ చాన్స్ కోసం వేట మొదలైంది. రెండు సినిమాలు ఒకే అయ్యి ఆగిపోయాయి. అసలు విషయం అప్పుడర్థమైంది.

మరి తరువాత చాన్స్ ఎలా వచ్చింది?
ఎదురుదెబ్బ తగిలేసరికి -పరిస్థితి అదుపు తప్పుతోందన్న విషయం అవగతమైంది. ఆ టైంలో -రచయిత గోపీమోహన్ సలహాతో శీనువైట్లతో ప్రయాణం మొదలెట్టాను. ‘దూకుడు’ వరకూ ఉన్నా. ఆ టైంలో అనిల్ సుంకర నుంచి హామీ దొరికింది. -డైరెక్టర్ అయ్యాను.

అల్లరి నరేష్‌తో చేయడం?
నరేష్‌కు కథ చెప్పినపుడు ఇలాంటి వాటికోసమే చూస్తున్నానంటూ స్క్రిప్ట్‌పై నమ్మకం వ్యక్తం చేశాడు. అదే -జేబ్స్‌బాండ్. నరేష్‌లాంటి వ్యక్తిత్వమున్న హీరోతో పనిచేయడం నిజంగానే అదృష్టం.

జేమ్స్‌బాండ్ సంతృప్తినిచ్చిందా?
జేమ్స్‌బాండ్ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్. డిఫరెంట్ స్టోరీ, బ్యాక్‌డ్రాప్ అన్నీ కలిసి సినిమాకు ఫ్రెష్‌నెస్ ఇచ్చాయి. అల్లరి నరేష్ మార్కు కామెడీతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఫస్ట్ ఎఫర్ట్.. గుడ్ రిజల్ట్.

లేటెస్ట్ ప్రాజెక్టులు?
ఇంకా ప్రయత్నాల్లోనే ఉన్నా. ఓ కొలిక్కి వస్తోందని మాత్రం చెప్పొచ్చు. త్వరలోనే ఓ స్టార్ హీరోతో వస్తానేమో.

-శ్రీ