Others

అభిమాన జంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవిలది ఆత్మీయ అనుబంధం. వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ రెండు కుటుంబాలు సన్నిహితంగా మెలిగేవి. పరిశ్రమకు వచ్చినపుడు వ్యాంపు పాత్రలు పోషించిన అంజలీదేవి (శ్రీ లక్ష్మమ్మకథ- 1950) తరువాత అక్కినేనికి హిట్ పెయిర్‌గా మారారు. అక్కినేని సరసన (దాదాపు 50కి పైగా) ఎక్కువ చిత్రాల్లో నాయికగా నటించిన రికార్డు ఆమెకే దక్కుతుంది. అంజలీదేవి కుటుంబ, సన్నిహితులతో కలసి ప్రారంభించిన అశ్వనీ పిక్చర్స్ నిర్మించిన మాయలమారి (1951) చిత్రానికి అక్కినేని కూడా భాగస్వామి. ఇక వీళ్లిద్దరూ కలిసిన నటించిన స్వప్నసుందరి (1950), స్ర్తిసాహసం (1951), ఇలవేలుపు (1956), చెంచులక్ష్మి (1955), పెళ్ళిసందడి (1959), జయభేరి (1959)లాంటి చిత్రాలను ఆణిముత్యాలుగా చెప్పుకోవాలి. అంజలీదేవి నిర్మాతగా అంజలీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రాల్లో అధిక భాగం అక్కినేనే హీరో. పరదేశి (1953), అనార్కలి (1955), సువర్ణసుందరి (1957)లాంటి చిత్రాల్లో అక్కినేనే కథానాయకుడు. అలాగే ఋణానుబంధం (1960), భక్తతుకారాం (1973), మహాకవి క్షేత్రయ్య చిత్రాలను అంజలీ పిక్చర్స్ నిర్మించింది. క్షేత్రయ్య చిత్ర నిర్మాణ సమయంలో ఒక చరిత్రాత్మక సంఘటన జరిగింది. శిథిలావస్థలో వున్న సారథీ స్టూడియోలో దాదాపు 60 చిత్రాల వరకు నటించి, బిజీ స్టూడియో చేసిన అక్కినేనికి -ఓ చిత్రానికి సంబంధించి స్టూడియో ఇవ్వటానికి సారథి అధినేతలు అడ్డుచెప్పారు. ఈ కారణంతో చిత్ర నిర్మాణం ఆగిపోగూడదని కర్నాటక చాముండేశ్వరీ స్టూడియోకు షూటింగ్‌ను షిఫ్ట్ చేశార్ట. ఆ చిత్రంలో నటిస్తూ హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియో నిర్మాణానికి అక్కినేని నడుంగట్టారు. కొన్ని పంతాలు పట్టింపులు కారణంగా అనుకోని అద్భుతాలు జరుగుతాయని పెద్దలు చెప్పే మాట ఇందుకే. అధిక చిత్రాల్లో తనకు నాయికగా నటించిన అంజలీదేవికి ఓ సందర్భంలో ఆత్మీయ అభినందన సత్కారం అందిస్తున్న అక్కినేనిని ఇక్కడ చూడొచ్చు.
**
ఇక్కడ జీర్ణించుకోలేని మరో ముఖ్య విషయం ఏంటంటే -అంజలీదేవి గతించిన నెల రోజులు తిరగకుండానే అక్కినేని కూడా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. 2014లో రోజుల తేడాలో ఇద్దరూ వెళ్లిపోవటం యాదృచ్చికమే అయినా, వారి అనుబంధానికి నిదర్శనం కూడా.

-పర్చా శరత్‌కుమార్ 9849601717