Others

సమ్‌థింగ్ స్పెషల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యమీనన్..
స్టార్ హీరోయినా? కాదనాలి! బీభత్సమైన ఫ్యాన్ మెయిలింగ్ ఉందా? లేదనాలి! మోడ్రన్ బార్బీని మించిన గొప్ప గ్లామర్ డాలా? నవ్వుకోవాలి! కనీసం చాలామందిలా హాట్‌హాట్ హీరోయినా? ప్చ్ అనేయాలి! మరేంటీ స్పెషల్ అంటే -సమ్‌థింగ్ స్పెషల్ అని చెప్పక తప్పదు. పైన చెప్పుకున్నవన్నీ ఉన్న హీరోయిన్లకంటే నిత్య ఇంకొంచెం స్పెషలే. సరదాగా చెప్పాలంటే సకల కళా వల్లభి. చేసిన, చేస్తున్న పాత్రలకే కాదు, ఎంచుకుంటున్న చిత్రాల విషయంలోనూ ఆమెకంటే ఓ ట్రాక్ రికార్డు ఉంది. అంతేకాదు, మంచి గాయని కూడా. తన గాత్రానికి సార్థకత చేకూరే చాన్స్ వచ్చినందుకు ఇప్పుడు ఎగిరి గంతేస్తోందట. ఆ చాన్స్ ఏంటో తెలుసా? -సమ్‌థింగ్ స్పెషల్ ఉంటే తప్ప చాన్స్ ఇవ్వని సైలెంట్ సైక్లోనిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతానికి గాత్రం అందించే అవకాశం రావడమేనట. విపరీతమైన క్రేజ్ తెచ్చేకున్న సూర్య తాజా చిత్రం ‘24’లో నిత్య ఓ పాటేసుకుంది. సాంగ్ హిట్టవ్వడమే కాదు, మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. తను చేస్తున్న సినిమాల్లో ఇప్పటికే చాలా పాటలేసుకున్న నిత్య -ఈ పాట మాత్రం తనకు సమ్‌థింగ్ స్పెషల్ అంటూ ఇలా మురిసిపోతోంది. పాత్రల్లోనే కాదు,
పాటల్లోనూ నిత్య గడుసుదే!