Others

నాకు నచ్చిన పాట-అహోఆంధ్ర భోజ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మనసులు చిత్రంలోని ఘంటసాల ఆలపించిన అద్భుతమైన గీతం ‘అహో ఆంధ్రభోజ/ శ్రీకృష్ణదేవరాయ/ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజోవిరాయ..’ అనే పాట నాకు చాలా ఇష్టమైనది. ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. రాయలకాలం నాటి వైభవాన్ని కళ్లకు కట్టినట్టు చూపుతూ సామాన్యుల జీవన స్థితిగతులు ఆ కాలంలో ఎలా ఉండేవో ఈ పాటలో చక్కగా వర్ణించారు. ముఖ్యంగా కథానాయకుడు తన భార్య అంధురాలు కాగా ఆమెకు అలనాటి వైభవాన్ని కన్నులకు కట్టినట్టుగా సాక్షాత్కరింపచేసే ప్రయత్నంలో ఈ పాటను పాడతాడు. ఈ పాటకు స్వరాలు అందించిన కెవి మహదేవన్ బాణీ అద్భుతంగా ఉంటుంది. అందుకుతగ్గ సాహిత్యం ఆకట్టుకుంటుంది. సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడు కాగా, అంధురాలుగా నటించిన షావుకారు జానకి ఆ పాటలో లీనమైపోయి నటించి, పాటకు నిండుదనాన్ని చేకూర్చారు. ‘కనులు లేవని నీవు కలత పడవలదు/ నా కనులు నీవిగా చేసికొని చూడు’ అనడంలోనే ప్రేమికుడి లాలన ఆ అంధురాలైన ప్రేయసితో ఎలా వుందో గమనించవచ్చు. ‘కొంగుముడి వేసుకుని కొత్త దంపతులు/ కొడుకు పుట్టాలని కోరుకున్నారని/ శిలలపై శిల్పాలు చెక్కినారు’ అంటూ సాగిన సాహిత్యం ఎంత సొబగులు అద్దుకుందో గమనించవచ్చు. ఇలాంటి పాటలు ఈ కాలంలో అరుదుగా వస్తున్నాయి. ఒక యాత్రా స్థలాన్ని అద్భుతంగా వర్ణిస్తూ సాగిన ఈ పాట ఉత్తమమైన పాటగా భావించాలి.
---

వెనె్నల రచయితలకు
సూచన
వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో పళశశళ్ఘబజూళషష్ఘశ్ఘౄజ.ష్యౄకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-టి. రఘురామ్, నరసరావుపేట