Others

నాకు నచ్చిన సినిమా-- దేవుడమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర దిలీప్ చలం, రామకృష్ణ, లక్ష్మి, తమిళనాడు సిఎం జయలలితల కాంబినేషన్‌లో గొప్ప చిత్రంగా వచ్చిన దేవుడమ్మ చిత్రం గొప్ప చిత్రం. మనుషుల్లో రకరకాల స్వభావాలున్న వ్యక్తులుంటారు. అది మంచైనా చెడైనా మనం చూసిన దాన్నిబట్టే నిర్ణయించుకుంటాం. కానీ మంచి వారి మనసులో గొప్పతనం ఉండదని, మనం మంచి వారుకాదని అనుకున్న వారి జీవితంలో చాలా గొప్పదనం ఉంటుందని ఈ చిత్రం చెబుతుంది. ఎక్కడో దూరాన కూర్చున్నావు/ ఇక్కడ మా తల రాతలు రాస్తున్నావు/ చిత్రమైన గారడీ చేస్తున్నావు/ తమాష చూస్తున్నావు.. అంటూ దేవుణ్ణి కథానాయకుడి అంతరంగం ప్రశ్నిస్తుంటుంది. బ్రతుకుతెరువు కోసం పట్నానికి వచ్చిన అన్నదమ్ములతో పాటుగా వచ్చిన చెల్లెలు జీవితం నగరంలో ఎలా పతనమైంది అన్న కథనంతోపాటుగా నగరంలో పతితురాలైన అబల జీవితం ఎలా చిగురించి ఉన్నత స్థాయికి వెళ్లింది అన్న మరో కథనాన్ని కీలకంగా తీసుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందించాడు. కథానాయకులకు చెల్లెలుగా లక్ష్మి నటించగా, పతితురాలైన నగర అబలగా జయలలిత జీవించారు. ప్రతి చిన్న విషయానికి భయపడిపోయే చెల్లెలు చివరికి దేనినీ లెక్కచేయని ధైర్యవంతురాలై నగర జీవితంలో పడి తడబడి చివరికి పతనమైపోతుంది. పతనమైపోయిన జీవితాన్ని చక్కగా చేసుకోడానికి వేశ్యావృత్తిలో వున్న జయలలిత చివరికి స్వాతిముత్యంలా నలుగురి మన్ననలు పొందుతుంది. అంటే ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ? ఇవన్నీ మనం వేసుకునే లెక్కలు. కానీ దేవుడనేవాడు వేసిన లెక్క వేరే వుందని ఈ చిత్రం చెబుతుంది. ఇలాంటి ఉన్నతమైన విలువలతో రూపొందించిన చిత్రం ‘దేవుడమ్మ’. ఇప్పటికీ ఎంతో గొప్ప సినిమాగా ఆదరాభిమానాలు పొందుతుంది.

-ఎఎల్ భ్రమరాంబ, విజయవాడ