Others

మొనోపలీ తగ్గుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-సంజీవ్ మేగోటి

తెలుగు, కన్నడ భాషల మధ్య సినిమా అన్న సరిహద్దుని ఒకటి చేసి, అటు
కన్నడంలోను, ఇటు తెలుగులోను
చిత్రాలను నిర్మిస్తూ సరికొత్త పంధాలో
పయనిస్తున్నారు సంజీవ్ మేగోటి. అఘోర చిత్రంతో తెరంగేట్రం చేసి మనసుందిరా, కలర్స్, పౌరుషం చిత్రాలతో తన సత్తా నిరూపించిన ఆయన కన్నడ చిత్రాల విజయపరంపరతో తెలుగు
పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. ఈవారం ఆయనతో చిట్‌చాట్..
--

మీ నేపథ్యం?
-ఆదోని వద్ద దిబ్బనకల్లు ఊరు. బిఎస్సీ చదువుకున్నా. ఇంట్లో పౌరాణిక నాటకాల వాతావరణం ఉండటంతో కళారంగంవైపు ఆకర్షితుడినయ్యా.
దర్శకుడు అవ్వాలనుకున్నారా?
-రచయితగా కెరీర్ ప్రారంభించాను. దర్శకత్వ మెళకువలు తెలుసుకుని ఇటొచ్చా.
తొలి అవకాశం ఎలా?
-అఘోర చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న నన్ను ఆ చిత్ర నిర్మాత శ్రీ్ధర్‌శెట్టి దర్శకత్వ బాధ్యత కూడా అప్పగించడంతో తొలి అవకాశం వచ్చింది.
లవ్, హారర్ జోనర్స్‌పై అభిప్రాయం?
-నేనొచ్చినప్పుడు వందశాతం కుటుంబ కథా చిత్రాలలో ఒక్క శాతం మాత్రమే హారర్ జోనర్స్ చిత్రాలుండేవి. ఇప్పుడు అది తిరగబడింది. ఇప్పుడు అన్ని హారర్ జోనర్స్ చిత్రాలే వస్తున్నాయి!
తెలుగు పరిశ్రమలో సమస్యలు?
- థియేటర్ల సమస్య చెప్పక తప్పదు. కన్నడంలో మాత్రం మొత్తం 650 థియేటర్లు ఉంటే, అక్కడవారు ఒకరికొకరు చక్కగా మాట్లాడుకొని చిత్రాలను విడుదల చేసుకుంటారు. తెలుగులో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ కూడా మోనోపలి తగ్గుముఖం పడుతోంది. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న బేధాలు అక్కడ లేవు.
తరువాత ప్రాజెక్టులు?
-అవినాష్‌తో ఓ కన్నడ చిత్రం జూలై నుండి మొదలవుతోంది. యోగేష్‌తో మరో చిత్రం ఉంటుంది. తెలుగులో చేతన్ చీనుతో ఓ చిత్రం అనుకుంటున్నాం.
దర్శకుడంటే?
- 24 విభాగాలలో పూర్తి అవగాహనతో డిగ్నిఫైడ్‌గా ఉండి అందరికీ మార్గదర్శకుడిగా మంచి సినిమా అందించేవాడు.

-శేఖర్