Others

వస్తున్నాయ్.. వెబీమాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్క్రీన్ మీద చూస్తే -సినిమా. వెబ్‌సైట్లో చూస్తే -వెబీమా! ఆశ్చర్యపోతున్నారు కదూ! నిజానికి వెబీమా అన్నది వెబ్ సైట్ సినిమాలు ఎక్కువ చూస్తున్నవాళ్లు పెట్టుకున్న టెక్ వర్డ్.
హాలీవుడ్‌లో స్క్రీన్ సినిమాలే కాదు, చానెల్స్‌లో ప్రసారం చేయడానికి మాత్రమే శాటిలైట్ మూవీస్ కొన్ని తీస్తుంటారు. తరువాత్తరువాత ఇలాంటి ప్రయోగాలు చాలాచోట్ల జరిగాయి. క్రమంగా సినిమా మీద మోజు పెరుగుతుండటం.. సులువైన టెక్నాలజీ అందుబాటులోకి వస్తుండటంతో -నిర్మించిన సినిమాను ఎక్కడో ఒకచోట ప్రదర్శించాలి. అందుకు థియేటర్లు అందుబాటులో లేకపోతేనో.. దొరికే అవకాశం లభించకపోతేనో వెబ్‌సైట్‌కు వచ్చేస్తున్నాయి. అలా మొదలైన వ్యవహారం ఇప్పుడు వెబ్‌సైట్ కోసమే సినిమా నిర్మించేసే స్థాయికి వచ్చేశాయి. అలా తయారవుతున్న సినిమాలే -వెబీమాలు.
సినిమా కళాత్మక వ్యాపారం. సినిమా తీయడమే కాదు, దాన్ని విడుదల చేయగలిగే నేర్పూ ఉండాలి. సాంకేతికత సులువైన ప్రస్తుత రోజుల్లో సినిమా నిర్మాణానికి చాలామందే ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు పరిశ్రమకు వస్తూనే ఉన్నారు. అయితే, తీసిన సినిమాను స్క్రీన్‌పై చూసుకోకుండానే వెనుతిరుగుతున్నారు. కోట్లు నష్టపోతున్నారు. కారణం -ప్లానింగ్ లేకపోవడం. డిజిటలైజేషన్ నిర్మాణంలోకి సినిమా కూడా చేరడంతో తక్కువ బడ్జెట్‌లోనే సినీ నిర్మాణ కల నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నవాళ్లు ఎందరో. అందరూ కొత్తవారే అయినా క్వాలిటీగా.. సరికొత్త కథాంశాలతో సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే అవి స్ట్రయిట్‌గా థియేటర్ విడుదలకు నోచుకోకపోవడంతో వెబ్ రిలీజ్‌కు క్యూలో పెడుతున్నారు. సినిమాలకు వీకెండ్ శుక్రవారం బాగా సెంటిమెంట్. అలాగే నేడు వెబ్‌లోనూ సినిమాలు స్పీడుగా విడుదలై హంగామా చేస్తున్నాయి. వీటికి రేటింగ్‌లు.. టాక్‌లతో పనిలేకపోయినా వెబ్ ప్రేక్షకులను వారాంతంలో ఖుషీ చేస్తున్నాయి. పబ్లిసిటీ కూడా అవసరం లేకపోవడంతో కేవలం వౌత్ టాక్‌తోనూ.. సెర్చ్‌లతోనూ ఈ సినిమాలు వెబ్ ప్రేక్షకులను చేరుకుంటున్నాయి.
ఇప్పటికే ఈ విధానంలో వోల్గా వీడియోస్ ద్వారా ఎన్నో చిత్రాలు వెబ్ ప్రేక్షకులకు చేరువయ్యాయి. సినీ నిర్మాణ కార్యక్రమాలన్నీ పేపర్ పబ్లిసిటీలో కనిపించే ఎన్నో సినిమాలు ఆఖరికి ఏమాత్రం చిన్నపాటి పబ్లిసిటీ కూడా లేకుండా వెబ్ చిత్రాలుగా దర్శనమిస్తున్నాయి. యూ ట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్న షార్ట్ ఫిలిమ్స్ తరహాలో నేడు వెబ్ చిత్రాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
బుల్లితెరపై సినిమాలు కనిపించడంతోపాటు పరిచయం లేని తారాగణం ఎక్కువగా ఉండటంతో సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగదంటారు వెబ్ ప్రేక్షకులు. అయితే కొన్ని చిత్రాలు గొప్ప అనుభూతి కలిగిస్తున్నాయని, ఇప్పుడొస్తున్న థియేటర్ చిత్రాలకు దీటుగా ఉంటున్నాయన్న వాదనా లేకపోలేదు. నటీనటలు, టెక్నీషియన్లు, కథ కథనాలకు ప్రాధాన్యతనిస్తూ గంటన్నర నుండి గంటంపావు నిడివిగల చిత్రాలు సైతం వెబ్‌లో ప్రేక్షకులను రంజింపచేస్తున్నాయి.
చిన్న సినిమాలకు సరిగ్గా చోటుదక్కని పరిస్థితుల్లో సినీ అభిరుచిగల దర్శక నిర్మాతలకు వెబ్ సినిమా ఓ వేదికనే చెప్పాలి. విశ్వరూపం చిత్రాన్ని డైరెక్టుగా ఇంటింటికి తీసుకెళ్లాలనే కమల్‌హసన్ ఆలోచనకు సరిసమానమైన ఆప్షన్ ఈ వెబ్ సినిమాలు. నేడు ఆంధ్ర.. తెలంగాణ ప్రభుత్వాలు సైతం చిన్న చిత్రాల కోసం అనేక మినీ థియేటర్లను కాలక్షేప సెంటర్లలో నిర్మించాలని భావిస్తున్నాయి. ఈ లక్ష్యం నెరవేరేంతవరకు వెబ్ సినిమాలు హల్‌చల్ చేస్తూనే ఉంటాయి.
కొంతమంది దర్శక నిర్మాతలు సినిమాను స్టార్ట్ చేసి ఎస్టాబ్లిష్ అయిన తారాగణంతో క్వాలిటీగా మంచి మాటలు, పాటలు, డాన్సులు, ఫైట్లతో నిర్మించి థియేటర్ విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ విడుదల వీలుకాని పక్షంలో వెబ్ ఆప్షన్లని ఎంచుకుని రిలీజ్ చేసేసి పెట్టుబడిని రాబట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు తనయ నీహారిక సైతం వెబ్ సిరీస్ చేసి పాపులారిటీని సంపాదించుకోవడం గమనార్హం! యువతను ఆకర్షించే ఎలిమెంట్స్‌తో ఎక్కువగా వెబ్ చిత్రాలు రూపొందుతున్నాయి. సస్పెన్స్.. క్రైమ్.. థ్రిల్లర్.. హర్రర్ వంటి కథాంశాలతో ఆద్యంతం ఆసక్తిగా రూపొందించే చిత్రాలు వెబ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. కొంతమంది దర్శక నిర్మాతలు ఏమాత్రం క్వాలిటీ.. కమిట్‌మెంట్ లేకుండా ఇష్టానుసారం తీసిన సినిమాలను కూడా ఇక్కడ ప్రమోట్ చేయడంవల్ల వెబ్ చిత్రాలపట్ల ఆసక్తి తగ్గే ప్రమాదం వచ్చి పడుతుంది. ఏదేమైనా వెబ్ ద్వారా సినిమాలు విడుదలయ్యే ఆప్షన్ ఉండటం వలన కొత్తవారికి కొత్త ఊపు వస్తుందనే చెప్పాలి. ప్రేక్షకులకు సైతం కొత్త అనుభూతి కలుగుతుందని భావించాలి.

-బాసు