Others

సో సో.. సోనారిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవకాశాలు రావాలంటే అందాలైనా ఉండాలి. ఆహార్యాన్ని మరిపించే నటనా పాటవమైనా ఉండాలి. రెండూవున్నవాళ్లు -కష్టం లేకుండా టాప్‌రేంజ్‌కు చేరడం క్లిష్టం కాదు కనుక వాళ్లను పక్కనపెడదాం. కేవలం అందాలనే నమ్ముకుని అవకాశాలు అందుకుంటున్న వాళ్ల లిస్టులో -సోనారికాకు స్పెషల్ ప్లేస్ ఇస్తున్నారు తోటి తారలు. ‘అమ్మో అంత స్పీడ్ మావల్ల కాదు’ అంటూ మూతి తిప్పుకుంటున్నార్ట. ఎలాగూ తెలుగు సినిమాల్లో కథానాయకి పాత్రకు నటించే అవకాశాలు, సన్నివేశాలు ఉండటం లేదు కనుక -అందాలతోనే అల్లుకుపోదామని చూస్తోందట సోనారిక. తెలుగు సినీపరిశ్రమలో అందం అన్న పదానికి ‘కలరు-్ఫగరే’ నిర్వచనంగా మారిన నేపథ్యంలో -సోనారిక చాన్స్‌లు బాగానే అందుకుంటుందని అంటున్నారు. నాగశౌర్యతో జూదూగాడు చేసిన వెంటనే బెల్లంకొండ శీనుతో స్పీడున్నోడు చేసింది. మంచు విష్ణుతో ‘ఆడోరకం ఈడోరకం’ చేసిన వెంటనే మళ్లీ బెల్లంకొండ శ్రీనుతో జతకట్టే చాన్స్ దక్కించుకుందట. చేసిన మూడు ప్రాజెక్టుల్లో ఏదీ హిట్టు మార్కు కొట్టకపోయినా -గ్లామర్ విషయంలో బదోరియా గట్స్ చూసే చాన్స్‌లు ఇస్తన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఈడోరకం..’ చిత్రంలో ఏమాత్రం మొహమాటపడిన సోనారిక వచ్చే చిత్రంలో ఎలా కనిపిస్తుందోనన్న ఆసక్తి అయితే ఆ ఈడు ఆడియన్స్‌లో లేకపోలేదు.