Others

మళ్లీ.. జతకలిసే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ్మూ ఎంత స్పీడుగా ఎందిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరిశ్రమలో అడుగుపెట్టిన కాలం నుంచి టాప్ రేంజ్‌కు వెళ్లడానికి ఆమెకు ఎంతో టైం పట్టలేదు. స్టార్ హీరోలకు సరైన జోడీ అన్న టాలెంటెడ్ టాక్‌తో తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న తమ్మూ -త్వరలో రామ్‌తో మరోసారి జోడీ కట్టబోతోందట. గతంలో ‘ఎందుకంటే.. ప్రేమంట’ చిత్రంలో పెయిర్‌గా కనిపించారు. ఇద్దరిమధ్యా కెమిస్ట్రీ వర్కవుటైనట్టు అనిపించినా -ఆ సినిమా సక్సెస్‌కు నోచుకోలేదు. పైగా అప్పటి తమ్మూ పరిస్థితి వేరు. ఇప్పుడు స్టార్‌రేంజ్‌తోపాటు సీనియర్ అప్పియరెన్స్ వచ్చేసింది. రామ్ మాత్రం ఇంకా సెకెండ్ గ్రేడ్ హీరో రేంజ్‌లోనే ఉండిపోయాడు. రాబోయే చిత్రంలో వీళ్లిద్దరూ జతకట్టబోతున్నారని వినికిడి. సంతోష్ శ్రీనివాస్ డిజైన్ చేసిన ప్రాజెక్టులో రామ్, తమన్నాలు పెయిర్ కానున్నారని వినికిడి. ఎనర్జీ విషయంలో ఇద్దరూ ఇద్దరే అయినా -రామ్, తమన్నా పెయిర్‌లో అప్పటి ఫ్రెష్‌నెస్ కనిపిస్తుందా? అన్న చిన్న డౌటు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. చూడాలి ఇద్దరూ ఎలా మెప్పిస్తారో.. కెమిస్ట్రీని ఎలా వర్కవుట్ చేస్తారో?