Others

అవార్డులకు విలువ కట్టగలమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక కళాకారుడికి చిత్ర విజయాలతోపాటు అవార్డులు మానసిక ఆనందాన్ని కలుగచేస్తూ మరికొన్ని మంచి పాత్రల్లో నటించటానికి ఉపకరిస్తాయి. ఈ కార్యక్రమాలు ప్రభుత్వపరంగా ఏర్పాటైన సందర్భాలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నట గాయకుడు కిశోర్‌కుమార్ పేరిట జాతీయ స్థాయిలో ఉత్తమ నటన ప్రదర్శించిన కళాకారులకు ఏటా అవార్డులు ఇచ్చి సత్కరిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం రాజ్‌కపూర్ పేరిట అవార్డులు ప్రవేశపెట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు పేరిట జాతీయస్థాయి పురస్కారాలు ప్రవేశపెట్టింది.
ఇదిలావుంటే, బి సరోజాదేవి కన్నడంలో తన సొంత ఖర్చుతో జాతీయస్థాయి అవార్డును పెట్టి కళాకారులను సత్కరిస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు కూడా జాతీయస్థాయిలో తన పేరిట అవార్డు పెట్టి ఏటా కళాకారులను సత్కరించారు. అలాంటి ఓ సందర్భంలోనేదే ఈ చిత్రం. తనతోపాటు పలు చిత్రాల్లో నాయికగా నటించిన అంజలీదేవికి అక్కినేని పురస్కారం బహూకరిస్తున్నప్పటి చిత్రమిది. అవార్డు గ్రహీత అంజలీదేవి, అవార్డు ప్రదాత జమున, అవార్డు స్థాపించిన అక్కినేనిని ఇక్కడి చిత్రంలో చూడొచ్చు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717